Home> తెలంగాణ
Advertisement

Telangana Elections : పోలింగ్ సరళిపై స్పందించిన ఎన్నికల ప్రధానాధికారి 

తెలంగాణలో పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది

Telangana Elections : పోలింగ్ సరళిపై స్పందించిన ఎన్నికల ప్రధానాధికారి 

తెలంగాణలో పోలింగ్ కొనసాగుతోంది. ఉదయం ఏడు గంటలకు  ప్రారంభమైన పోలింగ్ ..సాయంత్రం ఐదు గంటల వరకు కొనసాగనుంది. కాగా ఓటు హక్కును వినియోగించుకునేందుకు మహిళాలు భారీ సంఖ్యలో పోలింగ్ కేంద్రాలకు తరలివస్తున్నారు. దివ్యాంగులు సైతం ఓటు హక్కు వినిగించుకునేందుకు పోలింగ్ కేంద్రాలకు వస్తున్నారు.

పోలింగ్ సరళిపై తెలంగాణ ఎన్నికల ప్రధానాధికారి రజత్ కుమార్ స్పందించారు. ఉదయం 11 గంటలకు 21.97 శాతం పోలింగ్ నమోదు అయినట్లు తెలిపారు. ప్రతి రెండు గంటలకు పోలింగ్ వివరాలు ప్రకటిస్తామన్నారు. ప్రస్తుతం ఓటింగ్ ప్రశాంతంగా కొనసాగుతుందన్నారు.  దివ్యాంగుల ఓటింగ్ పై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నమని రజత్ కుమార్ తెలిపారు. శాంతిభద్రతలపై పోలీసులు జాగ్రత్తలు తీసుకుంటున్నారని తెలిపారు. 

ఈవీఎంలు మొరాయించినట్లు ఎలాంటి ఫిర్యాదులు రాలేదని తెలిపారు.   235 మంది బెల్ ఇంజినీరింగ్ సిబ్బంది..ఈవీఎంల పనినీరు పరిశీలిస్తున్నారు. మాకు వచ్చిన నివేదికల ప్రకారం ఎలాంటి సమస్యలు ఉత్పన్నం కాలేదని ఎన్నికల ప్రధానాధికారి రజన్ కుమార్ వివరించారు

Read More