Home> తెలంగాణ
Advertisement

Telangana Cabinet Meeting: తెలంగాణ కేబినెట్ భేటీలో తీసుకున్న కీలక నిర్ణయాలు

Telangana Cabinet Meeting Decicions: తెలంగాణ రాష్ట్ర కేబినెట్ భేటీ అయి పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఈ ఏడాది స్వాతంత్య్ర దినోత్సవం కానుకగా 15 ఆగస్టు నుంచి రాష్ట్రంలో కొత్తగా 10 లక్షల మందికి పెన్షన్లు మంజూరు చేయాలని తెలంగాణ కేబినెట్ నిర్ణయించింది.

Telangana Cabinet Meeting: తెలంగాణ కేబినెట్ భేటీలో తీసుకున్న కీలక నిర్ణయాలు

Telangana Cabinet Meeting Decicions: తెలంగాణ రాష్ట్ర కేబినెట్ భేటీ అయి పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఈ ఏడాది స్వాతంత్య్ర దినోత్సవం కానుకగా 15 ఆగస్టు నుంచి రాష్ట్రంలో కొత్తగా 10 లక్షల మందికి పెన్షన్లు మంజూరు చేయాలని తెలంగాణ కేబినెట్ నిర్ణయించింది. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా ఇస్తున్న 36 లక్షల పెన్షన్లకు అదనంగా 10 లక్షల కొత్త పెన్షన్లు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నట్టు కేబినెట్ వెల్లడించింది. ఇప్పటివరకు ఇస్తున్న పాతవి, ఇకపై ఇవ్వనున్న కొత్తవి మొత్తంగా కలిపి 46 లక్షల మంది లబ్ధిదారులకు పెన్షన్ అందివ్వనున్నట్టు కేబినెట్ ప్రకటించింది. 

తెలంగాణ కేబినెట్ తీసుకున్న ఇతర కీలక నిర్ణయాలు.
స్వాతంత్య్ర దినోత్సవ వజ్రోత్సవాలను పురస్కరించుకుని సత్ప్రవర్తన కలిగిన 75 మంది ఖైదీలను విడుదల చేసేందుకు తెలంగాణ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. 

కోఠిలోని ఈఎన్.టి. ఆస్పత్రిలో వైద్యుల కొరత ఉన్నందున 10 మంది స్పెషలిస్ట్ డాక్టర్ పోస్టులు మంజూరు చేస్తూ నిర్ణయం. పెరిగిపోతున్న పేషెంట్స్ తాకిడిని ఎదుర్కొనేలా, ప్రస్తుత అవసరాలకు అనుగుణంగా కోఠి ఈఎన్.టి. ఆస్పత్రిలో అత్యాధునిక సౌకర్యాలతో ఈఎన్.టి.టవర్ నిర్మాణం.

సరోజినీ దేవి కంటి దవాఖానలో అత్యాధునిక సదుపాయాలతో కొత్త బిల్డింగ్ కాంప్లెక్స్ నిర్మాణానికి ప్రతిపాదనలు.

రాష్ట్రవ్యాప్తంగా ప్రస్తుతం అంగన్‌వాడీ కేంద్రాల్లో ఖాళీగా ఉన్న 5,111 టీచర్లు, ఆయాల పోస్టులను వెంటనే భర్తీ.

స్వాతంత్య్ర వజ్రోత్సవాల్లో భాగంగా ఈనెల 21వ తేదీన శాసనసభ, స్థానిక సంస్థల ప్రత్యేక సమావేశాలు నిర్వహించేందుకు ప్రభుత్వం గతంలోనే నిర్ణయం తీసుకుంది. అయితే, అదే రోజున పెళ్లిళ్లు, శుభకార్యాలకు చివరి ముహూర్తం కావడం.. పెద్దఎత్తున వివాహాది శుభకార్యాలు ఉండటంతో ప్రజాప్రతినిధుల విజ్ఞప్తి మేరకు ఆ ప్రత్యేక సమావేశాలను రద్దు చేస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది.

స్వాతంత్య్ర వజ్రోత్సవాలను పురస్కరించుకుని జాతీయ భావన పెంపొందించేందుకు ఆగస్టు 16న ఉదయం 11.30 గంటలకు రాష్ట్రవ్యాప్తంగా ఏకకాలంలో సామూహిక జాతీయ గీతాలాపన జరిపేందుకు నిర్ణయం.

జీవో 58, 59 ప్రకారం నిరుపేదలకు పట్టాల పంపిణీ ప్రోసిడింగ్స్‌లో వేగం పెంచాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి కేబినెట్ ఆదేశాలు.

గ్రామకంఠంలో నూతన ఇళ్ల నిర్మాణం విషయంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి అధికారులతో కలిసి కమిటీ ఏర్పాటు. 15 రోజుల్లోగా ఒక నివేదిక ఇచ్చి, ఆయా సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపే దిశగా నిర్ణయం. 

శరవేగంగా అభివృద్ధి చెందుతున్న వికారాబాద్ పట్టణ శివార్లలో ఆటోనగర్ నిర్మాణానికి 15 ఎకరాల స్థలం కేటాయింపు.

షాబాద్‌లో షాబాదు బండల పాలిషింగ్ పరిశ్రమ అభివృద్ధి కోసం పాలిషింగ్ యూనిట్లను ఏర్పాటు చేయడానికి వీలుగా తెలంగాణ స్టేట్ ఇండస్ట్రియల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ (టీఎస్ఐఐసీ) ఆధ్వర్యంలో 45 ఎకరాల స్థలం కేటాయింపు. 

తాండూరు మార్కెట్ కమిటీ అవసరాల కోసం యాలాలలో 30 ఎకరాల స్థలం కేటాయించాలని ప్రభుత్వం (Telangana govt) నిర్ణయించింది.

Also Read : MLA Jeevan Reddy: ఎమ్మెల్యే జీవన్‎రెడ్డికి బుల్లెట్ ప్రూఫ్ వాహనం.. హత్యాయత్నంతో భద్రత పెంపు

Also Read : Munugode Byelection: ఎల్లుండి మునుగోడులో రేవంత్ రెడ్డి పాదయాత్ర.. టికెట్ రేసులో ముందున్న చెరుకు సుధాకర్?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link - https://bit.ly/3P2DgvH

Apple Link - https://apple.co/3df6gDq

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

Read More