Home> తెలంగాణ
Advertisement

TS budget sessions 2022: అసెంబ్లీ సాక్షిగా ఫీల్డ్ అసిస్టెంట్లకు సీఎం కేసీఆర్ గుడ్ న్యూస్

Telangana budget sessions 2022: అసెంబ్లీ వేదికగా ఫీల్డ్ అసిస్టెంట్లకు సీఎం కేసీఆర్ గుడ్ న్యూస్ చెప్పారు. వారిని మళ్లీ విధుల్లోకి తీసుకుంటామన్నారు. వీరితో పాటు సెర్ఫ్, మెప్మా ఉద్యోగులకు తీపి కబురు చెప్పారు. సర్ఫ్, మెప్మా ఉద్యోగులందరికీ ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా వేతనాలు ఇస్తామన్నారు.

TS budget sessions 2022: అసెంబ్లీ సాక్షిగా ఫీల్డ్ అసిస్టెంట్లకు సీఎం కేసీఆర్ గుడ్ న్యూస్

Telangana budget sessions 2022: తెలంగాణ బడ్జెట్ సమావేశాలు నిరవధికంగా వాయిదా పడ్డాయి. ఆఖరి రోజు సభలో ప్రసంగించిన సీఎం కేసీఆర్.. ఫీల్డ్‌ అసిస్టెంట్లు, సెర్ఫ్‌, మెప్మా ఉద్యోగులకు తీపి కబురు చెప్పారు. ఉక్రెయిన్‌ నుంచి తిరిగొచ్చిన విద్యార్థులనూ ఆదుకుంటామని హామీ ఇచ్చారు. మరోవైపు ప్రభుత్వం కాగ్ నివేదికను సభలో ప్రవేశపెట్టింది. తెలంగాణ బడ్జెట్ సమావేశాల్లో చివరి రోజు సీఎం కేసీఆర్ అసెంబ్లీలో ద్రవ్య వినిమయ బిల్లును ప్రవేశపెట్టారు. అనంతరం బిల్లుపై చర్చ జరిగింది. ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చకు కేసీఆర్ సమాధానమిచ్చారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వంపై మరోసారి విమర్శలు చేశారు సీఎం కేసీఆర్. రాష్ట్రాలను నియంత్రించాలని చూస్తుందని ఆరోపించారు. కేంద్ర సర్కార్ తీరు ఫెడరల్ స్పూర్తికి విరుద్ధమన్నారు. ఆర్థికంగా తెలంగాణ బలంగా ఉందని తెలిపారు. తలసరి ఆదాయంలో తెలంగాణే టాప్ ప్లేస్‌లో ఉందని వెల్లడించారు. 

అసెంబ్లీ వేదికగా ఫీల్డ్ అసిస్టెంట్లకు సీఎం కేసీఆర్ గుడ్ న్యూస్ చెప్పారు. వారిని మళ్లీ విధుల్లోకి తీసుకుంటామన్నారు. వీరితో పాటు సెర్ఫ్, మెప్మా ఉద్యోగులకు తీపి కబురు చెప్పారు. సర్ఫ్, మెప్మా ఉద్యోగులందరికీ ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా వేతనాలు ఇస్తామన్నారు. భూదాన్ ఉద్యమం ద్వారా పొందిన భూములకు ధరణీ పోర్టల్‌లో ఇబ్బందులు తలెత్తుతున్నాయని కాంగ్రెస్ సభ్యుడు భట్టివిక్రమార్క ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చారు.ఈ భూములను వివరాలు పార్ట్‌-2లో ఉంచుతున్నారని తెలిపారు. సమస్యను పరిష్కరించాలని ఆయన కోరారు.

మల్లు భట్టి విక్రమార్క లేవనెత్తిన సమస్యపై కేసీఆర్ స్పందించారు. వెంటనే పరిష్కరిస్తామని సీఎం హామీ ఇచ్చారు. మరోవైపు ఉక్రెయిన్‌లో చిక్కుకొని చదువులు మధ్యలో వదిలేసి వచ్చిన తెలంగాణ విద్యార్థులకు అండగా ఉంటామని కేసీఆర్ హామీ ఇచ్చారు. వారి చదువుకు అయ్యే ఖర్చు రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుందని అసెంబ్లీ ప్రకటించారు. మధ్యాహ్న భోజన పథకం కార్మికుల జీతాన్ని మూడు వేల రూపాయలకు పెంచారు. అటు ద్రవ్య వినిమయ బిల్లుతో పాటు మొత్తం నాలుగు బిల్లులు శాసనసభలో ఆమోదం పొందాయి.

మరోవైపు తెలంగాణ ఆర్థిక స్థితిగతులపై కాగ్ తయారు చేసిన నివేదికను ప్రభుత్వం అసెంబ్లీలో (TS budget sessions 2022) ప్రవేశపెట్టింది. 2019-20 సంవత్సరానికి గాను ఆర్థిక పరిస్థితులను కాగ్ తన నివేదికలో వివరించింది. ఐదేళ్లలో మొదటిసారిగా తెలంగాణ రెవెన్యూ మిగులు సాధించలేదని వెల్లడించింది. మార్కెట్ రుణాల ద్వారానే ద్రవ్యలోటులో 97 శాతం వచ్చిందని స్పష్టం చేసింది. ఎఫ్‌ఆర్‌బీఎంకు అనుగుణంగానే రుణాలు ఉన్నట్లు పేర్కొంది. 2020 మార్చి 31తో ముగిసిన సంవత్సరానికి గాను కాగ్‌ నివేదిక విడుదల చేసింది.

Also read : Telangana Jobs: తెలంగాణలో మొదలు కానున్న ఉద్యోగాల జాతర, పోలీస్ శాఖ నుంచే ప్రారంభం

Also read : Mallu Ravi: కొల్లాపూర్ 'మన ఊరు-మన పోరు' సభలో మల్లు రవి వార్నింగ్..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Read More