Home> తెలంగాణ
Advertisement

తెలంగాణ ముఖ్యమంత్రి హోదాలో తొలిసారి బడ్జెట్ ప్రవేశపెట్టనున్న కేసీఆర్

తెలంగాణ ముఖ్యమంత్రి హోదాలో తొలిసారి బడ్జెట్ ప్రవేశపెట్టనున్న కేసీఆర్

తెలంగాణ ముఖ్యమంత్రి హోదాలో తొలిసారి బడ్జెట్ ప్రవేశపెట్టనున్న కేసీఆర్

హైదరాబాద్: తెలంగాణ ఏర్పడిన తర్వాత రెండోసారి అధికారంలోకొచ్చిన కేసీఆర్ సర్కార్ నేటి ఉదయం 11.30 గంటలకు ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుంది. ఆర్థిక శాఖను తన వద్దే అట్టిపెట్టుకున్న ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌ రావు శాసనసభలో బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుండగా శాసన మండలిలో వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ బడ్జెట్‌ను ప్రవేశపెడతారు. రెండోసారి ప్రభుత్వం ఏర్పాటైన అనంతరం గురువారం తొలిసారిగా సీఎం అధ్యక్షతన ప్రగతి భవన్‌లో సమావేశమైన రాష్ట్ర మంత్రిమండలి 2019-20 సంవత్సరానికి సంబంధించిన తాత్కాలిక బడ్జెట్‌కు ఆమోదం తెలిపింది. తెలంగాణ ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి హోదాలో బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన తొలి ముఖ్యమంత్రిగా కేసీఆర్ రికార్డు సొంతం చేసుకోనుండగా గతంలో ఇటువంటి రికార్డు కేవలం ముగ్గురి పేరు మీజే ఉంది. ముఖ్యమంత్రి హోదాలో బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన వారిలో ఒకప్పటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులు బెజవాడ గోపాల్‌ రెడ్డి, కాసు బ్రహ్మానంద రెడ్డి, కొణిజేటి రోశయ్య ఉన్నారు.

గత నాలుగేండ్లలో రాష్ట్ర సొంత ఆదాయం గణనీయంగా వృద్ధిచెందిన నేపథ్యంలో 2019-20 ఆర్థిక సంవత్సరానికి ప్రవేశపెడుతున్న ఓటాన్ అకౌంట్ బడ్జెట్ రూ.2 లక్షల కోట్లు దాటే అవకాశాలున్నాయని తెలుస్తోంది.

Read More