Home> తెలంగాణ
Advertisement

Teenmar Mallanna Exclusive Interview: తెలంగాణలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఎవరు గెలుస్తారు?

Teenmar Mallanna Exclusive Interview: తెలంగాణలో పొలిటికల్‌ హీట్‌ నెలకొంది. బీజేపీ పాదయాత్రతో ఊపుమీదుంది. అటు కాంగ్రెస్‌పార్టీ కూడా సభలు నిర్వహిస్తోంది. అధికార టీఆర్‌ఎస్‌ తనదైన శైలిలో విపక్షాలను తిప్పికొడుతోంది. ఈ నేపథ్యంలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఎవరు గెలుస్తారు?

Teenmar Mallanna Exclusive Interview: తెలంగాణలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఎవరు గెలుస్తారు?

Teenmar Mallanna Exclusive Interview: తెలంగాణలో పొలిటికల్‌ హీట్‌ నెలకొంది. బీజేపీ పాదయాత్రతో ఊపుమీదుంది. అటు కాంగ్రెస్‌పార్టీ కూడా సభలు నిర్వహిస్తోంది. అధికార టీఆర్‌ఎస్‌ తనదైన శైలిలో విపక్షాలను తిప్పికొడుతోంది. ఈ నేపథ్యంలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఎవరు గెలుస్తారు? ఎవరికి ఎంతశాతం ఓటు బ్యాంకు సొంతమవుతుంది ? జీ తెలుగు న్యూస్‌ ఒపీనియన్‌ పోల్‌ వివరాలు ఇప్పుడు చూద్దాం. బిగ్‌ డిబేట్‌ విత్‌ భరత్‌ ప్రోగ్రాంలో భాగంగా జీ తెలుగు న్యూస్‌ నిర్వహించిన పోల్‌లో ఆసక్తికర ఫలితాలు వెలువడ్డాయి. ఇప్పటికిప్పుడు తెలంగాణలో ఎన్నికలు జరిగితే ఎవరు గెలుస్తారనే అంశంపై జీ తెలుగు న్యూస్‌ పోల్‌ నిర్వహించింది. ఆ పోల్‌లో ప్రేక్షకులు అనూహ్య తీర్పును ఇచ్చారు. 
 
ప్రముఖ రాజకీయ నాయకుడు, 7200 మూవ్‌మెంట్ సారథి తీన్మార్‌మల్లన్నతో బిగ్ డిబేట్‌ విత్ భరత్‌ కార్యక్రమం ఆకట్టుకునేలా సాగింది. జీ తెలుగు న్యూస్‌ ఎడిటర్‌ భరత్‌ కుమార్‌ అడిగిన ప్రశ్నలకు తీన్మార్‌ మల్లన్న తనదైన శైలిలో సమాధానాలు ఇచ్చారు. ఈ క్రమంలోనే ఇటీవల తీన్మార్‌ మల్లన్న ఓ టీవీ ఛానెల్‌ ఇంటర్వ్యూలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే టీఆర్‌ఎస్‌ గెలుస్తుందని ప్రకటించిన విషయాన్ని భరత్‌ గుర్తు చేశారు. దీనికి తనదైన శైలిలో మల్లన్న స్పందించారు. అదంతా తన వ్యూహంలో భాగమని టీఆర్‌ఎస్‌ అస్సలు గెలవదని మల్లన్న స్పష్టంచేశారు. 

దీనిపై జీ తెలుగు న్యూస్‌ పోల్‌ సర్వే నిర్వహించింది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే గెలిచేది ఎవరు? అని ప్రేక్షకుల అభిప్రాయాన్ని కోరింది. ఎన్నికలు వస్తే గెలిచేదెవరంటూ టీఆర్‌ఎస్‌, బీజేపీ, కాంగ్రెస్‌, హంగ్‌ అని అప్షన్స్‌ ఇచ్చింది. పదివేలకు పైగా ప్రేక్షకులు తమ ఒపీనియన్‌ను షేర్‌ చేశారు. జీ తెలుగు న్యూస్‌ ఒపీనియన్‌ పోల్‌లో పాల్గొన్నారు. అయితే, ఎవరూ ఊహించని రీతిలో పోల్‌ రిపోర్ట్‌ వచ్చింది. 

fallbacks
ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే.. కాంగ్రెస్‌పార్టీ అధికారం చేజిక్కించుకుంటుందని ప్రేక్షకులు అభిప్రాయం వ్యక్తం చేశారు. పర్సెంటేజీల వారీగా చూస్తే.. ఒపీనియన్‌ పోల్‌లో కాంగ్రెస్‌పార్టీ గెలుస్తుందని 44 శాతం మంది అభిప్రాయపడగా.. బీజేపీకి అధికారం దక్కుతుందని 34శాతం మంది ఓటేశారు. ఇక, అధికార టీఆర్‌ఎస్‌ మళ్లీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని చెప్పిన వాళ్లు కేవలం 16శాతం మంది మాత్రమే ఉన్నారు. ఏ పార్టీ గెలవదని, హంగ్‌ ఏర్పడుతుందని 6శాతం మంది అభిప్రాయపడ్డారు. యాదృచ్చికం ఏంటంటే.. బిగ్‌ డిబేట్ విత్‌ భరత్‌ కార్యక్రమంలో తీన్మార్‌ మల్లన్న ఇప్పటికిప్పుడు తెలంగాణలో ఎన్నికలు జరిగితే టీఆర్‌ఎస్‌ మూడో స్థానంలో నిలుస్తుందని తన అభిప్రాయం వ్యక్తం చేశారు. అంతేకాదు.. పీకే టీమ్‌ సర్వే రిపోర్ట్‌ కూడా ఇదే విషయాన్ని తేల్చిందన్నారు. జీ తెలుగు న్యూస్‌ ఒపీనియన్‌ పోల్‌ లో కూడా సరిగ్గా ఇదే రిజల్ట్‌ వచ్చింది.

Read More