Home> తెలంగాణ
Advertisement

Rythu Bandhu and Loan Waiver: తెలంగాణ రైతులకు శుభవార్త.. ఒకేసారి రైతుబంధు, రుణమాఫీ

Minister Tummala On Rythu Bandhu and Loan Waiver: ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రైతుబంధు నగదు జమ.. రుణమాఫీపై తెలంగాణ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ఆ నిధులన్నీ ఒకేసారి జమ చేస్తామని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు ప్రకటించారు. ఈ నెలాఖరులోపే వాటి ప్రక్రియ పూర్తి చేస్తామని తెలిపారు.

Rythu Bandhu and Loan Waiver: తెలంగాణ రైతులకు శుభవార్త.. ఒకేసారి రైతుబంధు, రుణమాఫీ

Minister Tummala On Rythu Bandhu and Loan Waiver:​ తెలంగాణ రైతులకు కొద్దిరోజుల్లోనే రైతుబంధు నిధులు జమ కానున్నాయి. వాస్తవంగా డిసెంబర్‌ లోనే రైతుబంధు చెల్లించాల్సి ఉండగా రాష్ట్రంలో అధికారం మారడంతో రైతులకు ఆ డబ్బు జమ కాలేదు. తాజాగా రైతు బంధు డబ్బుల విషయంపై తెలంగాణ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. రైతుబంధు నిధులను విడతలవారీగా కాకుండా ఒకేసారి విడుదల చేసేందుకు కసరత్తు ప్రారంభించింది. నెలాఖరులోగా రైతుబంధు నగదు జమ చేస్తామని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు ప్రకటించారు. నిజామాబాద్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో మంత్రి ఈ ప్రకటన చేశారు. ఈ ప్రకటనతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

నిజామాబాద్‌లో (Nizamabad) బుధవారం ఎన్టీఆర్‌ విగ్రహాన్ని ఆవిష్కరించిన అనంతరం మంత్రి తుమ్మల మాట్లాడారు. 'ఎన్టీఆర్‌ స్ఫూర్తితో కాంగ్రెస్‌ ప్రభుత్వం రైతుల సంక్షేమానికి కట్టుబడి ఉంది. రెండు లక్షల మంది రైతుల రుణమాఫీని దశలవారీగా రైతు ఖాతాల్లోకి జమ చేసేందుకు ప్రభుత్వం ప్రణాళిక రూపొందిస్తోంది. రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు' అని ప్రకటించారు. 

రాష్ట్రవ్యాప్తంగా రెండెకరాల లోపు భూమి ఉన్న 29 లక్షల మంది రైతులకు రైతుబంధు జమ చేసినట్లు మంత్రి తుమ్మల తెలిపారు. మిగిలిన రైతులకు రేపటి నుంచి రైతుబంధు నగదు జమ చేసేందుకు చర్యలు చేపట్టినట్లు చెప్పారు. ఎన్ని ఇబ్బందులు వచ్చినా రైతు డిక్లరేషన్‌ను అమలు చేస్తామని ప్రకటించారు. రైతుల సంక్షేమమే కాంగ్రెస్‌ ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నా రైతుల ప్రయోజనాల విషయంలో రాజీపడబోమని స్పష్టం చేశారు.

రైతు డిక్లరేషన్‌ లో పేర్కొన్ని ప్రతి హామీని అమలు చేసేందుకు తమ ప్రభుత్వం పట్టుదలతో ఉందని చెప్పారు. యాసంగి (రబీ) సీజన్‌ లో రైతుబంధు జమ చేయడానికి రూ.7,625 కోట్లు అవసరం అవుతాయని చెప్పారు. ఇప్పటివరకు 29 లక్షల మంది రైతులకు ప్రభుత్వం రూ.1,050 కోట్లు జమ చేసిందని వెల్లడించారు. మిగిలిని రైతులకు నగదు జమ చేయడానికి రూ.13,500 కోట్ రుణం తీసుకునేందుకు కేంద్ర ప్రభుత్వ అనుమతి కోరగా.. రూ.9 వేల కోట్ల రుణానికి అనుమతి ఇచ్చిందని వివరించారు. ఈ రుణంలో రూ.2 వేల కోట్లు ఈనెలలో వచ్చే అవకాశం ఉందన్నారు. ఈ నిధులతో రైతుబంధు జమ చేస్తామన్నారు.

ఈసారి గతం మాదిరి చెల్లింపులు
మంత్రి ప్రకటనతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. రేపటి నుంచి నిధులు జమ చేస్తుండడంతో రైతులు తమ వ్యవసాయ పనులు ప్రారంభించేందుకు సిద్ధమవుతున్నారు. వాస్తవంగా డిసెంబర్‌లోనే జమ కావాల్సిన నిధులు ఇప్పటివరకు జమ కాకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఎప్పుడెప్పుడా అని రైతుబంధు నిధుల కోసం ఎదురుచూస్తున్నారు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఇచ్చినట్టు ఏడాదికి రూ.12 వేలు రెండు దశల్లో రైతుబంధు నగదు జమ చేస్తోంది. ప్రస్తుతానికి గత ప్రభుత్వం మాదిరే ఇప్పుడు రైతుబంధు డబ్బులు ప్రభుత్వం జమ చేయనుంది.  యాసంగి సీజన్‌కు ఇచ్చిన హామీ ప్రకారం రూ.16 వేలు చెల్లించే అవకాశం ఉంది.

Also Read: Rat found in Online Food: ఆన్‌లైన్‌లో ఫుడ్ ఆర్డర్.. చచ్చిన ఎలుకను తిన్న యువకుడు 

Also Read: Upcoming Best OLED TVs 2024: Samsung, LGకి షాక్‌..డెడ్‌ చీప్‌ ధరకే AI ప్రాసెసర్‌తో మార్కెట్‌లోకి Panasonic OLED టీవీలు..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

 

Read More