Home> తెలంగాణ
Advertisement

TS TET 2022: తెలంగాణ టెట్ పై రగడ.. వాయిదా వేయాలని రేవంత్ రెడ్డి డిమాండ్

TS TET 2022: తెలంగాణ టీచర్‌ ఎలిజిబిలిటీ టెస్ట్ ఈనెల 12న జరగనుంది. ఆదివారం జరగనున్న పరీక్ష కోసం అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. అయితే ఎగ్జామ్ కు సిర్వం సిద్ధం కాగా.. ఎగ్జామ్ ను వాయిదా వేయాలనే డిమాండ్లు వస్తున్నాయి.

TS TET 2022: తెలంగాణ టెట్ పై రగడ.. వాయిదా వేయాలని రేవంత్ రెడ్డి డిమాండ్

TS TET 2022: తెలంగాణ టీచర్‌ ఎలిజిబిలిటీ టెస్ట్ ఈనెల 12న జరగనుంది. ఆదివారం జరగనున్న పరీక్ష కోసం అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. అయితే ఎగ్జామ్ కు సిర్వం సిద్ధం కాగా.. ఎగ్జామ్ ను వాయిదా వేయాలనే డిమాండ్లు వస్తున్నాయి. టెట్ ను వాయిదా వేయాలని ఇప్పటికే కొందరు అభ్యర్థులు ఆందోళన చేయగా.. తాజాగా సీన్ లోకి తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఎంటరయ్యారు. ఆదివారం జరగనున్న టెట్ ను వాయిదా వేయాలని డిమాండ్ చేశారు. టెట్ ను ఎందుకు వాయిదా వేయాలో కారణాలు చెబుతూ రేవంత్ రెడ్డి ట్వీట్ చేశారు.

టెట్ పరీక్ష జరగనున్న జూన్ 12నే రైల్వే రిక్రూట్ మెంట్ బోర్డు ఎగ్జామ్ జరగనుంది. టెట్ రాసే అభ్యర్థుల్లో చాలా మంది ఆర్ఆర్బీ పరీక్షకు కూడా అప్లయ్ చేశారు. రెండు పరీక్షలు ఒకే రోజు జరుగుతుండటంతో సమస్యగా మారింది. రెండింటిలో ఏదో ఒకటే రాసే అవకాశం ఉంది. రెండు పరీక్షలకు ప్రిపేర్ అయిన విద్యార్థులు ఏది రాయాలో అర్ధం కాక తలలు పట్టుకుంటున్నారు. అందుకే టెట్ ను వాయిదా వేయాలని డిమాండ్లు వస్తున్నాయి. ఇదే విషయం చెబుతూ రేవంత్ రెడ్డి ట్వీట్ చేశారు. రైల్వే రిక్రూట్ మెంట్ బోర్డు జాతీయ స్థాయిలో నిర్వహిస్తారని.. టెట్ రాష్ట్ర స్థాయిలో నిర్వహించే పరీక్షని రేవంత్ రెడ్డి చెప్పారు. జాతీయ స్థాయి పరీక్షను ఆపేయం వీలు కాదు కాబట్టి.. రాష్ట్ర స్థాయిలో జరిగే టెట్ ను వాయిదా వేయాలని అయన డిమాండ్ చేశారు. టెట్ ను మరోరోజు నిర్వహించాలని సూచించారు.

 

టెట్ ను వాయిదా వేయాలని కొన్ని రోజుల క్రితం కొందరు అభ్యర్థులు మంత్రి కేటీఆర్ కు ట్విట్టర్ వేదికాగ విన్నవించారు. అభ్యర్థుల ట్వీట్లను విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డికి రీట్వీట్ చేశారు కేటీఆర్. పరీక్ష వాయిదాపై ఆలోచన చేయండని ట్వీట్ చేశారు. దీనిపై వెంటనే మంత్రి సబిత క్లారిటీ ఇచ్చారు. టెట్ ను వాయిదా వేయడం కుదరదని చెప్పారు. అయినా టెట్ వాయిదా వేయాలంటూ డిమాండ్లు వస్తూనే ఉన్నాయి. తెలంగాణ టీచర్‌ ఎలిజిబిలిటీ టెస్ట్‌ 2022లో రెండు పేపర్లకు భారీగా దరఖాస్తులు వచ్చాయి. మొత్తం 3 లక్షల 79 వేల 101 మంది పరీక్ష రాయనున్నారు. చాలా మంది అభ్యర్థులు రెండు పరీక్షలు రాయనున్నారు. గతంలో పేపర్ 1 టీటీసీ పూర్తి చేసిన వాళ్లు మాత్రమే రాసేవాళ్లు. ఈసార పేపర్‌ 1 పరీక్ష రాసేందుకు బీఈడీ అభ్యర్ధులకు అవకాశం ఇచ్చారు. దీంతో బీఈడీ అభ్యర్థులు రెండు పరీక్షలు రాయనున్నారు.

Read also: Chandrababu Fire: వివేకా కేసులో సాక్షులను చంపేస్తున్నారు.. చంద్రబాబు సంచలన ఆరోపణలు

Read also: Bandi Sanjay on CM Kcr: కుట్రలో భాగంగానే ఆర్టీసీ ఛార్జీల మోత..సీఎం కేసీఆర్‌పై బండి సంజయ్‌ ఫైర్..! 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

Read More