Home> తెలంగాణ
Advertisement

ముఖ్యమంత్రి పీఏగా రవితేజ

డిస్కో రాజా చిత్రంతో అభిమానుల ముందుకు వచ్చిన మాస్ మహారాజ రవితేజ  దురదృష్టవశాత్తు ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి ప్రదర్శన ఇవ్వకపోవడంతో నిలవలేకపోయింది. ఈ మాస్ మహారాజా రవితేజ ప్రేక్షకుల కోసం కొత్త కొత్తగా, విభిన్నంగా పాత్రలతో అభిమానుల్ని మెప్పించాలని 

ముఖ్యమంత్రి పీఏగా రవితేజ

హైదరాబాద్ : డిస్కో రాజా చిత్రంతో అభిమానుల ముందుకు వచ్చిన మాస్ మహారాజ రవితేజ  దురదృష్టవశాత్తు ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి ప్రదర్శన ఇవ్వకపోవడంతో నిలవలేకపోయింది. ఈ మాస్ మహారాజా రవితేజ ప్రేక్షకుల కోసం కొత్త కొత్తగా, విభిన్నంగా పాత్రలతో అభిమానుల్ని మెప్పించాలని కోరుకుంటాడు. అందువల్ల, మాస్ మహారాజా ఏ రకమైన కథలను ఎంచుకోవాలన్న మీమాంసలో ఉన్నట్టు తెలుస్తోంది. 

భిన్నమైన స్క్రిప్ట్‌లను ఎంచుకోవడం రవితేజకి కఠినంగా ఉన్నప్పటికీ, తదుపరి చిత్రం రమేష్ వర్మ దర్శకత్వంలో రాబోతుందని సినీ వర్గాలు తెలిపాయి. డైరెక్టర్ రమేష్ వర్మ తో ఇప్పటికే వీరా చిత్రంలో నటించిన సంగతి తెలిసిందే. దర్శకుడు రమేష్ వర్మ రాక్షసుడుతో హిట్ కొట్టి పాసిటివ్ గా ఉన్నాడు.

ఆసక్తికరమైన, సంచలన విషయం ఏమిటంటే, రవితేజ రాబోయే చిత్రంలో ఒక ముఖ్యమంత్రికి వ్యక్తిగత సహాయకుడిగా రవితేజ నటిస్తున్నారని తెలిపారు. ఈ చిత్రం చాలా ఉత్కంఠభరితమైన అంశాలతో కూడిన రాజకీయ నాటకం అని ప్రచారం జరుగుతుంది. మరోవైపు, గోవిచంద్ మలినేని దర్శకత్వం వహించిన క్రాక్ చిత్రం షూటింగ్‌లో రవితేజ ఇప్పటికే బిజీగా ఉన్నారు. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..

Read More