Home> తెలంగాణ
Advertisement

తెలంగాణకు వర్ష సూచన

తెలంగాణకు వర్ష సూచన

తెలంగాణకు వర్ష సూచన

హైదరాబాద్: భగభగమండుతున్న ఎండల నుంచి ఉపశమనం కలిగించేలా తెలంగాణలో నేడు, రేపు అక్కడక్కడ ఈదురు గాలులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. వర్షాలు కురిసే సమయంలో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. అయితే, వర్షాలు కురవని ప్రాంతాల్లో మాత్రం ఎప్పటిలాగే వడగాల్పులు వీస్తాయని తెలిపింది. 

ఇదిలావుంటే, మరోవైపు కోస్తాంధ్రలో 1500 మీటర్ల ఎత్తున ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని, ఒడిశా నుంచి తెలంగాణ, రాయలసీమ, తమిళనాడు మీదుగా శ్రీలంక వరకు 900 మీటర్ల ఎత్తున ఉపరితల ద్రోణి కొనసాగుతోందని వాతావరణ శాఖ వెల్లడించింది.

Read More