Home> తెలంగాణ
Advertisement

Hyderabad: భోజనం అవసరమైతే ఈ నెంబర్‌కి ఫోన్ చేయండి: సీఎస్ సోమేష్ కుమార్

తెలంగాణలో ఏ ఒక్కరూ ఆకలితో ఉండకూడదన్న సంకల్పంతో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఆదేశాల మేరకు 300 అన్నపూర్ణ సెంటర్ల ద్వారా దాదాపు 2 లక్షల మందికి ప్రతీ రోజు ఉదయం సాయంత్రం భోజనాన్ని అందిస్తున్నామని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ తెలిపారు. 

Hyderabad: భోజనం అవసరమైతే ఈ నెంబర్‌కి ఫోన్ చేయండి: సీఎస్ సోమేష్ కుమార్

హైదరాబాద్: తెలంగాణలో ఏ ఒక్కరూ ఆకలితో ఉండకూడదన్న సంకల్పంతో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఆదేశాల మేరకు 300 అన్నపూర్ణ సెంటర్ల ద్వారా దాదాపు 2 లక్షల మందికి ప్రతీ రోజు ఉదయం సాయంత్రం భోజనాన్ని అందిస్తున్నామని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ తెలిపారు. శుక్రవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, మున్సిపల్ శాఖ ముఖ్యకార్యదర్శి అర్వింద్ కుమార్, జి.హెచ్.యం.సి కమీషనర్ లోకేష్ కుమార్‌తో కలిసి టోలిచౌకిలోని అన్నపూర్ణ కేంద్రాన్ని సందర్శించారు. Also read : తెలంగాణలో 1000కి చేరువలో పాజిటివ్ కేసుల సంఖ్య

fallbacks

ఈ సందర్భంగా సి.యస్ సోమేష్ కుమార్ మాట్లాడుతూ.. ''జి.హెచ్.యం.సి, 9 మున్సిపల్ కార్పొరేషన్లలలో 300 అన్నపూర్ణ కేంద్రాల ద్వారా భోజనాన్ని అందిస్తున్నామని, మరో 50 కేంద్రాలను పెంచడానికి చర్యలు తీసుకుంటున్నాం'' అని అన్నారు. ఉదయం 10.30 నుండి గంటన్నర పాటు , సాయంత్రం 5 గంటలకు మరోకసారి భోజనాన్ని అందించేలా వేళలు మార్చామని అన్నారు. ప్రతీ రోజు దాదాపు 2 లక్షల మందికి భోజనం అందించేలా చర్యలు తీసుకున్నామన్నారు. అవసరమైతే ఇంకా ఎక్కువ సెంటర్లు పెంచటానికి సిద్దంగా ఉన్నామని చెప్పారు. Also read : ఏపీలో తాజాగా 62 కరోనా కేసులు, ఇద్దరి మృతి

fallbacks

ప్రతీ సర్కిల్‌లో ఒక ప్రత్యేక వాహనాన్ని సిద్ధంగా ఉన్న రెడిమేడ్ కుకుడ్ పుడ్‌ను అవసరం ఉన్న చోటకు తీసుకెళ్లేలా చర్యలు తీసుకున్నామని తెలిపారు. ఎక్కడైన భోజనం అవసరం ఉంటే జి.హెచ్.యం.సి కాల్ సెంటర్ నెం.21111111 కాల్ చేయాలని కోరారు. జి.హెచ్.యం.సి యాప్ ద్వారా కూడా ఆహారం కోసం రిక్వెస్ట్ చేయవచ్చని అన్నారు. Also read : అర్నాబ్ గోస్వామిపై రేవంత్ రెడ్డి ఫిర్యాదు

fallbacks

అవసరం ఉన్న ప్రతీ ఒక్కరికి భోజనం అందించే విషయమై మున్సిపల్ ముఖ్యకార్యదర్శి అర్వింద్ కుమార్ , జి.హెచ్.యం.సి కమీషనర్ లోకేష్ కుమార్‌లతో ప్రతి రోజు సమీక్షిస్తున్నామని తెలిపారు. భోజనం విషయమై ప్రభుత్వానికి తగిన సహకారం, అవసరమైన సలహాలు, సూచనలు  అందించాలని సి.యస్ కోరారు. ఎక్కడైన సమస్య ఉంటే వెంటనే ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలని అన్నారు. అన్నపూర్ణ క్యాంటిన్ ద్వారా భోజనం అందిస్తున్న తీరు పట్ల సంతృప్తి వ్వక్తం చేశారు. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here.. 

Read More