Home> తెలంగాణ
Advertisement

Power tariff hike: తెలంగాణలో విద్యుత్ ఛార్జీల బాదుడు.. ఏప్రిల్​ నుంచే కొత్త రేట్లు

Power tariff hike: తెలంగాణలో విద్యుత్ ఛార్జీల పెంపునకు ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ (టీఎస్​ ఈఆర్​సీ) అనుమతినిచ్చింది. డిస్కాంల ద్రవ్యలోటును దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకుంది. కొత్త ఛార్జీల వివరాలు ఇలా ఉన్నాయి.

Power tariff hike: తెలంగాణలో విద్యుత్ ఛార్జీల బాదుడు.. ఏప్రిల్​ నుంచే కొత్త రేట్లు

Power tariff hike: ఇప్పటికే పెరిగిన నిత్యవసరాల ధరలు, పెట్రోల్, డీజిల్ రేట్లు సామాన్యుల జేబుకు చిల్లు పెడుతున్నాయి. పెరిగిన ధరల కారణంగా ఇప్పటికే తలలు పెట్టుకున్న సామాన్యులకు మరో పిడుగు లాంటి వార్త. ముఖ్యంగా తెలంగాణ ప్రజలకు బ్యాడ్​ న్యూస్​. త్వరలో విద్యుత్ ఛార్జీలు పెరగనున్నాయి.

రాష్ట్రంలో విద్యుత్​ ఛార్జీలు పెంపుపై తెలంగాణ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్​ (టీఎస్​ ఈఆర్​సీ) క్లారిటీ ఇచ్చింది. విద్యుత్​ ఛార్జీలను 14 శాతం మేర పెంచేందుకు అనుమతినచ్చినట్లు వెల్లడించింది. నిజానికి డిస్కాంలు 19 శాతం పెంపునకు ప్రతిపాదనలు పంపంగా.. 14 శాతానికి మాత్రమే అనుమతినిచ్చినట్లు తెలిపింది.

కొత్త ఛార్జీలు ఇలా..

ఇళ్ల అవసరాలకు వినియోగించే విద్యుత్​పై యూనిట్​కో 40-50 పైసల చొప్పున ధర పెరగనుంది. ఇక వాణిజ్య అవసరాలకు వాడే విద్యుత్​పై యూనిట్​కు రూపాయి చొప్పున ఛార్జీలు పెరగనున్నాయి. పెంచిన ఛార్జీలు ఏప్రిల్​ 1 నుంచి వర్తించనున్నాయి.

ఛార్జీల పెంపు ఎందుకు?

డిస్కౌంట్లు గత కొన్నాళ్లుగా భారీ ద్రవ్యలోటు సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నాయి. గత ఏడాది డిసెంబర్​లో వెల్లడైన వివరాల ప్రకారం రూ.10 వేల కోట్ల వరకు ద్రవ్యలోటు ఉన్నట్లు తెలిసింది. ఈ పరిణామాలన్నింటిని నేపథ్యంలో ఛార్జీల పెంపునకు ఓకే చెప్పింది టీఎస్​ ఈఆర్​సీ.

Also read: Kamareddy Crime: దారుణం... నిద్రిస్తున్న అక్కపై మరుగుతున్న నూనె పోసిన చెల్లెలు...

Also read: Bhoiguda fire mishap: బోయిగూడ ఘటనపై ప్రధాని దిగ్భ్రాంతి- మృతుల కుటుంబలకు పరిహారం ప్రకటన!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Read More