Home> తెలంగాణ
Advertisement

బీఆర్‌ఎస్‌కు షాక్.. బీజేపీలో చేరిన పాలకుర్తి జడ్పీటసీ కందుల సంధ్యారాణి

తెలంగాణ రాజకీయాల్లో పెను మార్పులు చోటు చేసుకుంటున్నాయి. నేతలు పార్టీలు మారుతూనే ఉన్నారు. ఈ రోజు పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గంలోని పాలకుర్తి జడ్పీటసీ సభ్యురాలు కందుల సంధ్యారాణి బిజెపిలో చేరారు. 

బీఆర్‌ఎస్‌కు షాక్.. బీజేపీలో చేరిన పాలకుర్తి జడ్పీటసీ కందుల సంధ్యారాణి

ZPTC Kandula Sandhya Rani Joined in BJP: రానున్న ఎన్నికల నేపథ్యంలో తెలంగాణ రాజకీయ పార్టీలు సమరానికి రెడీ అవుతున్నారు. కొన్ని రాజకీయ పార్టీలలోని అసమ్మతి నేతలు పార్టీలు మారుతున్నారు. పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గంలోని పాలకుర్తి జడ్పీటసీ సభ్యురాలు కందుల సంధ్యారాణి, వారి అనుచరులు ఈ రోజు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యాలయంలో కేంద్రమంత్రి  కిషన్ రెడ్డి, ఈటల రాజేందర్, వివేక్ వెంకటస్వామి గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీలో చేరారు 

ఈ సందర్భంగా బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి గారు మాట్లాడుతూ.. భారతీయ జనతా పార్టీలోకి చేరిన పాలకుర్తి జడ్పీటీసీ సభ్యురాలు కందుల సంధ్యారాణి ఆహ్వానిస్తూ శుభాకాంక్షలు.. రానున్న ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ కేవలం డబ్బులపై ఆధారపడింది. రాష్ట్ర అభివృద్ధిపై బీఆర్ఎస్ నాయకులు నోరు మెదపటం లేదు. నెరవేర్చిన హామీలు ఏంటనేవి ప్రజలకు వివరించి ఎన్నికల్లో పోటీపడాలి. బీఆర్ఎస్ ఇచ్చిన హామీలు ఏవీ నెరవేర్చకుండా ప్రజలను మభ్యపెడుతున్నారు. పేదలకు డబుల్ బెడ్ రూమ్స్ పంపిణీ, రుణమాఫీ, దళిత బంధు, గిరిజన బంధు, దళితులకు 3 ఎకరాల భూమి వంటి హామీలను నెరవేర్చకుండానే అబద్దాలు ఆడుతూ ప్రజలను మభ్యపెడుతున్నారు. మహిళా పొదుపు సంఘాలకు పావలా వడ్డీ రుణాలు ఇవ్వడం లేదు. విద్యార్థులకు ఫీజు రీయింబర్స్ మెంట్ చెల్లించడం లేదు. ఆరోగ్య శ్రీ అటకెక్కించారు. విద్య, వైద్య రంగానికి బడ్జెట్ లో నిధులను తగ్గించారు. బీఆర్ఎస్ సర్కారు అన్ని రంగాల్లో వైఫల్యం చెందిందని కిషన్ రెడ్డి మండిపడ్డారు. 

రాష్ట్రంలో యువత, ప్రజలు నిశ్శబ్ధ వాతావరణంలో రానున్న ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి ఓటు వేసి.. బీఆర్ఎస్ కు బుద్ధి చెప్తారు. తమ నిర్లక్ష్యం, అసమర్థతతో ఉద్యోగాలు భర్తీ చేయకుండా, పేపర్ లీకేజీలకు కారణమై యువత, నిరుద్యోగులను వెన్నుపోటు పొడిచిన వ్యక్తి కేసీఆర్. రాహుల్ గాంధీ ఏ మొహం పెట్టుకుని తెలంగాణకు వస్తున్నారు..? కాంగ్రెస్ పాలనలో నీళ్లు, నిధులు, నియామకాల్లో అన్యాయం జరిగింది. కాబట్టే తెలంగాణ ఉద్యమం కొనసాగింది. 1969 ఉద్యమంలో 369 మంది విద్యార్థులను నిర్ధాక్షిణ్యంగా కాల్చిచంపిన పాపం కాంగ్రస్ పార్టీది.

Also Read: Allu Arjun: అసలు పుష్ప సినిమా కథ నేషనల్ అవార్డు టీం వారికి పూర్తిగా అర్థమైందా?

తెలంగాణ రాష్ట్రాన్ని ఇవ్వడంలో కాంగ్రెస్ ఆలస్యం చేయడం కారణంగా 1200 మంది విద్యార్థులు బలిదానమయ్యారు. తెలంగాణ వెనుకబాటుకు, ఉద్యోగాల కల్పనలో నిర్లక్ష్యం, సాగునీటి వాటా దక్కకపోవడానికి కారణం కాంగ్రెస్ పార్టీయే. కాంగ్రెస్ పార్టీ చరిత్ర మొత్తం అవినీతిమయమే. కాంగ్రెస్ నాయకులకు తెలంగాణలో పర్యటించే నైతిక హక్కు లేదు. కాంగ్రెస్, బీఆర్ఎస్ కుటుంబ పార్టీలే. తెలంగాణలో కుటుంబ, అవినీతి పార్టీల పీడ వదలాలి. బీఆర్ఎస్ పాలనలో కేసీఆర్ కుటుంబం, మాఫియా తెలంగాణను దోచుకుంది. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలకు తగిన బుద్ధి చెప్పాలని, ఓడించాలని తెలంగాణ సమాజం భావిస్తున్నారని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. 

కేంద్రంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం నీతివంతమైన పాలనను అందిస్తోంది. ప్రధాని నరేంద్ర మోదీ గారు చేసేదే చెప్తారు.. చెప్పిందే చేస్తారు.. గ్యారెంటీల పేరుతో కర్ణాటకలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ.. ఏ హామీని నెరవేర్చకుండా ప్రజలను మోసం చేసింది. కర్ణాటకలో కాంగ్రెస్ సర్కారు గత 4 నెలల్లోనే పన్నుల పేరుతో వేలకోట్ల రూపాయలు ప్రజల నుంచి దండుకుంది. వందల కోట్ల రూపాయలను తెలంగాణకు పంపించేందుకు ట్యాక్స్ లు, వాటాల పేరుతో కర్ణాటక ప్రజల నుంచి వసూలు చేస్తోంది. దేశం కోసం, బడుగు బలహీన వర్గాల ప్రజల కోసం నరేంద్ర మోదీ ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరిస్తాం. మద్దతు కూడగట్టి ప్రజల ఆశీస్సులతో బిజెపి జెండా ఎగురవేస్తాం. సకలజనుల తెలంగాణను సాధిస్తామని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. 

Also Read: పండుగ సీజన్‌ సేల్‌ ప్రారంభం..43, 55, 65 అంగుళాల టీవీలపై 50% వరకు తగ్గింపు!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Read More