Home> తెలంగాణ
Advertisement

Save child: మూడేళ్ల చిన్నారికి కిడ్నీ ఇన్ఫెక్షన్​- సాయంకోసం తల్లిదండ్రుల కన్నీటి వినతి

Save child: అనారోగ్యంతో బాధపడుతున్న కూతురిని కాపాడుకునేందుకు తల్లిదండ్రులు దాతల సహాయం కోరుతున్నారు. ఉన్న డబ్బంతా ఇప్పటిపకే ఖర్చు చేయడంతో.. దాతలు సహాయం చేస్తే తమ కూతురు ప్రాణాలు దక్కుతాయని కన్నీటితో వేడుకుంటున్నారు.

Save child: మూడేళ్ల చిన్నారికి కిడ్నీ ఇన్ఫెక్షన్​- సాయంకోసం తల్లిదండ్రుల కన్నీటి వినతి

Save child: అమ్మా-నాన్న, అమ్ములు, సద్గున్ ఇది వారి కుటుంబం జగిత్యాల అర్బన్ మండలం గోపాల్ రావు పేటకు చెందిన  చిరంజీవి సారంగాపూర్ పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్​గా పని చేస్తున్నాడు. వచ్చే జీతంతో ఇల్లు కిరాయికి కట్టి కుటుంబంతో సంతోషంగా గడుపుతున్నారు. భార్య పెరు జ్యోష్న.. ఉన్నంతలో ఎంత సంతోషంగా గడుపుతుంది ఈ కుటుంబం. అయితే కుటుంబం సంతోషం చూసి దేవుడికి కన్నుగిట్టిందేమో.. అనుకోని కష్టాలు ఎదురయ్యాయి.

ఇంతకీ ఏం జరిగిందంటే..

అమ్ములుకు ఇటీవల జ్వరం వచ్చింది. సాధారణ జ్వరమేకదా అని తమకు తెలిసిన వైద్యుడి వద్ద చికిత్స ఇప్పించారు తల్లిదండ్రులు. అయితే ఇటీవల ఇంటి ముందు అన్న సద్గురు, నాన్న చిరంజీవిలతో కలిసి సరదాగా ఆడుకుంటున్న అమ్ములు ఒక్కసారిగా కాళ్లు చేతులు నొప్పులతో ఏడుస్తూ.. అమ్మ నాన్న కాళ్లు చేతులునొస్తున్నాయటూ ఏడవటం మొదల పెట్టింది. కూతురి బాధ తట్టుకోలేని తల్లిదండ్రులు వెంటనే ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. జ్వరమే కదా రెండు రోజులకు తగ్గుతుందని చెప్పారు వైద్యులు. కానీ రాత్రి ఒక్కసారిగా కడుపు నొప్పి రావడంతో హుటాహుటిన కరీంనగర్ ఆస్పత్రికి తీసుకెళ్లి  టెస్టులు చేయించారు. అందులో చిన్నారి కిడ్నీ లివర్ ఇన్ఫెక్షన్ అయ్యిందని తెలిసింది. దీనితో ఆ పాపను హైదరాబాద్ లోని కిమ్స్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. డాక్టర్స్ పాప పరిస్థితి సీరియస్​గా ఉందన్నారు. వారం రోజుల పాటు డయాలసిస్ చేయాలని సూచించారు.

రోజుకు రూ.లక్ష వరకు ఖర్చు...

ప్రస్తుతం  అమ్ములు కిమ్స్ ఆసుపత్రిలో వెంటిలేటర్​పై ట్రీట్మెంట్ తీసుకుంటోంది. ఎవరు పిలిచినా పలకడం లేదు. రోజూ లక్షల విలువ చేసే వైద్యం. చిరంజీవికి పోలీస్ డిపార్ట్​మెంట్​ నుంచి వచ్చిన హెల్త్ కార్డ్ సుమారు రూ.5 లక్షల వరకు ఉపయోగపడుతుందని వైద్యులు పేర్కొన్నారు. అది కూడా వారం రోజుల నుండి ట్రీట్మెంట్ మాత్రమే సరిపోయింది. ప్రస్తుతం చేతిలో చిల్లిగవ్వ లేకపోవడంతో.. కూతురిని ఎలా కాపాడుకోవాలోనని సతమతమవుతున్నారు. ఉన్న డబ్బంతా ఖర్చు చేయడంతో ఇప్పుడు ఏం చేయాలో దిక్కు తోచని స్థితిలో ఉన్నారు. దాతలు ఎవరైనా సహాయం చేసి.. తమ ఇంటి మహాలక్ష్మిని కాపాడాలని తల్లిదండ్రులు కోరుతున్నారు. దాతలు సహాయం సహాయం చేయాల్సిన బ్యాంక్​ వివరాలను వెల్లడించారు.

సహాయం చేయాలనుకుంటే..

నేరుగా యూపీఐ ద్వారా (గుగుల్ పే, ఫోన్​ పే వంటివి).. 8309738470 కు డబ్బులు పంపొచ్చు.

బ్యాంక్ ద్వారా అయితే..

  • KOTHAPELLY JYOTHSNA
  • అకౌంట్ నంబర్​: 085010100212718
  • ఐఎఫ్​ఎస్​ఈ కోడ్​: UBIN0808504
  • యూనియన్ బ్యాంక్ మెడిపెల్లి..మండలం బ్రాంచ్

Also read: TS RTC: 10 రోజుల వ్యవధిలోనే మరోసారి పెంచిన బస్సు చార్జీలు.. ప్రయాణికుల ఆగ్రహం

Also read: KTR America Tour: కేటీఆర్ ఆమెరికా టూర్ సక్సెస్.. తెలంగాణకు రూ. 3315 కోట్ల పెట్టుబడులు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Read More