Home> తెలంగాణ
Advertisement

హైదరాబాద్‌కి భారత్‌లోనే తొలి వన్‌ప్లస్ రిసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ సెంటర్

హైదరాబాద్‌లో భారత్‌లోనే తొలి వన్‌ప్లస్ రిసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ సెంటర్

హైదరాబాద్‌కి భారత్‌లోనే తొలి వన్‌ప్లస్ రిసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ సెంటర్

హైదరాబాద్‌: ప్రపంచవ్యాప్తంగా పేరున్న స్మార్ట్ ఫోన్స్‌లో ఒకటైన వన్‌ప్లస్ మొబైల్స్ సంస్థ భారత్‌లో తొలిసారిగా ఓ రిసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ సెంటర్‌ని ఏర్పాటు చేయాలని నిర్ణయంచుకుంది. అందులో భాగంగానే భారత్‌లోని పలు అగ్రశ్రేణి నగరాలను పరిశీలించిన వన్‌ప్లస్ సంస్థ అంతిమంగా హైదరాబాద్‌లో తమ పరిశోధన కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నట్టు ప్రకటించింది. రానున్న మూడేళ్లలో ఈ తరహా కేంద్రాల్లోనే హైదరాబాద్ కార్యాలయాన్ని అగ్రభాగాన నిలిపేలా తీర్చిదిద్దనున్నట్టు ఈ సందర్భంగా వన్‌ప్లస్ తమ ప్రకటనలో పేర్కొంది. కృత్రిమ మేధస్తు పరిజ్ఞానంతోపాటు భారత వినియోగదారుల అవసరాలకు అనుగుణమైన టెక్నాలజీ ఆవిష్కరణకు హైదరాబాద్ కేంద్రం కృషిచేస్తుందని వన్‌ప్లస్ స్పష్టంచేసింది. 

హైదరాబాద్‌లో స్టార్టప్ సంస్థలకు అనుకూలమైన వాతావరణం ఉండటంతోపాటు ప్రతిభావంతులకు లోటులేదనే ఉద్దేశంతోనే తాము హైదరాబాద్‌ని తమ కార్యాలయ చిరునామాగా ఎంపిక చేసుకున్నట్టు వన్‌ప్లస్ సంస్థ తెలిపింది.

Read More