Home> తెలంగాణ
Advertisement

Aarogyasri scheme: నిరుపేదలకు గుడ్ న్యూస్.. ఆరోగ్యశ్రీ పరిధిలోకి కొత్త సేవలు

Aarogyasri scheme in Telangana: హైదరాబాద్ : తెలంగాణ ప్రజలకు వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ ( Minister Etela Rajender ) గుడ్ న్యూస్ చెప్పారు. ప్రస్తుతం  అమలు అవుతున్న ఆరోగ్య శ్రీ పథకంలోకి ( Aarogyasri Scheme in Telangana ) మరిన్ని సేవలను తీసుకురాబోతున్నట్టు మంత్రి ఈటల రాజేందర్ స్పష్టంచేశారు. 

Aarogyasri scheme: నిరుపేదలకు గుడ్ న్యూస్.. ఆరోగ్యశ్రీ పరిధిలోకి కొత్త సేవలు

Aarogyasri scheme in Telangana: హైదరాబాద్ : తెలంగాణ ప్రజలకు వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ ( Minister Etela Rajender ) గుడ్ న్యూస్ చెప్పారు. ప్రస్తుతం  అమలు అవుతున్న ఆరోగ్య శ్రీ పథకంలోకి ( Aarogyasri Scheme in Telangana ) మరిన్ని సేవలను తీసుకురాబోతున్నట్టు మంత్రి ఈటల రాజేందర్ స్పష్టంచేశారు. కిడ్నీ, హార్ట్, లివర్ ట్రాన్స్‌ప్లాంటేషన్‌ ( Kidney transplantation, Heart transplantation, Liver transplantation ) వంటి సేవలను కూడా ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకురావాలని మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయించిందని మంత్రి ఈటల తెలిపారు. Also read : Ram Vilas Paswan's death: కేంద్ర మంత్రి రామ్ విలాస్ పాశ్వాన్ కన్నుమూత

ప్రస్తుతానికి హైదరాబాద్‌లోని నిమ్స్, గాంధీ, ఉస్మానియా ఆస్పత్రుల్లోనే మూత్రపిండాలు, గుండె, కాలేయ మార్పిడి శస్ర్తచికిత్సలు జరుగుతున్నాయని.. మరింత మందికి సేవలు అందించే విధంగా ఈ సేవలను మెడికల్ కాలేజీల అనుబంధ ఆస్పత్రులకు విస్తరింపజేస్తామని మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. కిడ్నీ, హార్ట్ ట్రాన్స్‌ప్లాంటేషన్‌ వంటి ఖరీదైన చికిత్సలకు రూ. 30 లక్షల నుంచి రూ. 40 లక్షల వరకు ఖర్చు అవుతోందని.. ఇది పేదలకు చాలా భారంగా మారినందున వీటిని ఆరోగ్యశ్రీ పథకం పరిధిలోకి తీసుకొస్తున్నట్టు చెప్పారు.

Ayushman bharat ఆయుష్మాన్ భారత్ కంటే ఆరోగ్యశ్రీ ఉత్తమం: మంత్రి ఈటల
కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తోన్న ఆయుష్మాన్ భారత్ కంటే, తెలంగాణ సర్కార్ అమలు చేస్తోన్న ఆరోగ్య శ్రీ పథకమే మెరుగ్గా పనిచేస్తోందని మంత్రి ఈటల అభిప్రాయపడ్డారు. తెలంగాణలో 108, 104, 102 సర్వీసులకు ప్రభుత్వమే నిధులు వెచ్చిస్తోందని.. ఆరోగ్య శ్రీ కోసం ప్రభుత్వమే రూ. 1200 కోట్లు ( Aarogyasri budegt ) ప్రభుత్వం ఖర్చు చేస్తోందని అన్నారు. గురువారం హైదరాబాద్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడుతూ మంత్రి ఈటల రాజేందర్ ఈ వ్యాఖ్యలు చేశారు. Also read : 
Indian Railways: తెలుగు రాష్ట్రాల మధ్య పెరగనున్న రైళ్ల వేగం

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

Read More