Home> తెలంగాణ
Advertisement

పొంగి ప్రవహిస్తోన్న మూసీ, చెరువులు, వాగులు, వంకలు

పొంగి ప్రవహిస్తోన్న మూసీ, చెరువులు, వాగులు, వంకలు

పొంగి ప్రవహిస్తోన్న మూసీ, చెరువులు, వాగులు, వంకలు

హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో గత రెండు, మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో మూసీలోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో మూసీ నది పొంగి ప్రవహిస్తోంది. బీబీనగర్, పోచంపల్లి మండలాల్లో పలు గ్రామాల మధ్య మూసీ నీరు లెవెల్ క్రాసింగ్‌ దాటి ప్రవహిస్తోంది. 

మరోవైపు యాదాద్రి భువనగిరి జిల్లాలోని రాజాపేట, యాదగిరిగుట్ట, మోటకొండూరు మండలాల్లో చెరువులు, వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. చెరువులు అలుగు పోస్తుండటంతో రైతన్నల్లో ఒకింత సంతోషం వ్యక్తమవుతోంది. ప్రస్తుత పంటలకు వర్షాల రాక ఆలస్యమైనప్పటికీ.. ఈ వర్షాల వల్ల చెరువుల్లోకి నీరు వచ్చి చేరితే.. కనీసం అలాగైనా అడుగంటిపోయిన భూగర్బజలాలు తిరిగి పుంజుకుంటాయేమోనని సగటు రైతన్న ఆశాభావం వ్యక్తంచేస్తున్నాడు.

Read More