Home> తెలంగాణ
Advertisement

Murder movie ఆపాలంటూ కోర్టులో పిటిషన్

తెలంగాణ నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో జరిగిన పెరుమాల్ల ప్రణయ్ పరువు హత్య ( Pranay murder ) తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించింది. అయితే ప్రేమ, వాస్తవ ఘటన ఆధారంగా  వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ( Ram Gopal Varma ) ‘మర్డర్’ ( MURDER Movie ) సినిమాను తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే.

Murder movie ఆపాలంటూ కోర్టులో పిటిషన్

Ram Gopal Varma's Murder Movie: హైదరాబాద్: తెలంగాణ నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో జరిగిన పెరుమాల్ల ప్రణయ్ పరువు హత్య ( Pranay murder ) తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించింది. అయితే ప్రేమ, వాస్తవ ఘటన ఆధారంగా  వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ( Ram Gopal Varma ) ‘మర్డర్’ ( MURDER Movie ) సినిమాను తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఈ మేరకు వర్మ మర్డర్ ట్రైలర్‌ (MURDER Trailer), ఓ పాటను కూడా ఇటీవలనే విడుదల చేశారు. Also read: RGV Murder song: పిల్లల్ని ప్రేమించడం తప్పా..?

అయితే ఈ చిత్రాన్ని ఆపాలంటూ హత్యకు గురైన ప్రణయ్ భార్య అమృత, ఆయన తండ్రి బాలస్వామి జూలై 29న నల్లగొండ జిల్లా కోర్టులో సివిల్ పిటిషన్‌న్ దాఖలు చేశారు. హత్యకేసు విచారణ దశలో ఉందని, సినిమా విడుదలయితే సాక్షులపై వ్యతిరేక ప్రభావం పడుతుందని.. కావున దానిని ఆపాలంటూ అమృత కోరారు. అయితే దీనిపై మంగళవారం విచారించిన న్యాయమూర్తి మర్డర్ సినిమా దర్శక, నిర్మాతలు రామ్ గోపాల్ వర్మ, నట్టి కరుణలకు ఈ మెయిల్, వాట్సప్ ద్వారా నోటీసులు పంపారు. ఈ మేరకు దీనిపై విచారణను ఆగస్టు 6వ తేదీకి వాయిదా వేశారు.

తన భర్త ప్రణయ్‌ హత్యతో రెండేళ్లుగా తీవ్ర మానసిక ఒత్తిడికి గురవుతున్నానని, కల్పిత స్టోరీలతో తమ జీవితాలతో ఆటలాడుకోవడం సరికాదని అమృత ఆగ్రహం వ్యక్తంచేశారు. ఆరవ తేదీన మర్డర్ సినిమా దర్శక, నిర్మాతలు కోర్టుకు హాజరవుతారని కూడా ఆమె ఒక ప్రకటనలో తెలిపారు.   Also read: RGV ‘మర్డర్’ మూవీ ట్రైలర్ వచ్చేసింది..

Read More