Home> తెలంగాణ
Advertisement

Munugode Exit Polls: మునుగోడు ఎగ్జిట్ పోల్స్ ఫలితాల్లో 2 ప్రధాన పార్టీలకు షాక్

Munugode Bypolls Exit Polls : మునుగోడు ఉప ఎన్నికల పోలింగ్ ముగిసిన నేపథ్యంలో మునుగోడు ఎన్నికలపై ఎగ్జిట్ పోల్ సర్వేల ఫలితాలు వెల్లడి అయ్యాయి. మునుగోడు ఎన్నికల ఫలితాల కంటే ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. టీఆర్ఎస్ పార్టీ vs బీజేపి vs కాంగ్రెస్ పార్టీ అన్నట్టు కొనసాగిన ఈ త్రికోణ పోరులో ఎగ్జిట్ పోల్స్ ప్రకారం ఓటరు దేవుళ్లు ఎటువైపు ఉన్నారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

Munugode Exit Polls: మునుగోడు ఎగ్జిట్ పోల్స్ ఫలితాల్లో 2 ప్రధాన పార్టీలకు షాక్

Munugode Bypolls Exit Polls : తెలంగాణలో రాజకీయ పార్టీలను ఉరుకులు పరుగులు పెట్టించి, రాజకీయాలను వేడెక్కించిన మునుగోడు ఉప ఎన్నికల్లో ఎగ్జిట్ పోల్స్ ఎవరి వైపు ఉండనున్నాయనే ఉత్కంఠ అన్ని రాజకీయ పార్టీల్లోనే కాదు.. ఓటర్లలోనూ నెలకొని ఉంది. ఈ నేపథ్యంలో మునుగోడు ఉప ఎన్నికల సరళిపై విడుదలైన ఎగ్జిట్ పోల్స్‌ ఫలితాల్లో ఒక్క పొలిటికల్ లేబొరేటరీ ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు మినహా మిగతా అన్ని ఫలితాలు టీఆర్ఎస్ పార్టీకే అనుకూలంగా ఉన్నాయని తెలుస్తోంది. అత్యధిక శాతం ఎగ్జిట్ పోల్స్ ఫలితాల్లో బీజేపి రెండో స్థానంలో ఉండగా.. కాంగ్రెస్ పార్టీ మూడో స్థానంతో సరిపెట్టుకుంది. 

తెలంగాణ జర్నలిస్ట్ అధ్యయన వేదిక ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు
టీఆర్ఎస్ పార్టీకి - 40.9 శాతం ఓట్లు
బీజేపికి - 31 శాతం ఓట్లు
కాంగ్రెస్ పార్టీ 23 శాతం ఓట్లు కైవసం చేసుకోనున్నట్టు తెలంగాణ జర్నలిస్ట్ అధ్యయన వేదిక ఎగ్జిట్ పోల్స్ ఫలితాల్లో వెల్లడైంది.

పొలిటికల్ లేబొరేటరీ ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు
టీఆర్ఎస్ పార్టీకి - 37 శాతం ఓట్లు
బీజేపికి - 42 శాతం ఓట్లు
ఇతరులకు 21 శాతం ఓట్లు లభించనున్నట్టు పొలిటికల్ లేబొరేటరీ ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు స్పష్టంచేస్తున్నాయి.

త్రిషూల్ ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు 
టీఆర్ఎస్ పార్టీకి - 47 శాతం ఓట్లు
బీజేపికి - 31 శాతం ఓట్లు
కాంగ్రెస్ పార్టీకి 18 శాతం ఓట్లు రానున్నట్టు త్రిషూల్ ఎగ్జిట్ పోల్స్ చెబుతున్నాయి.

థర్డ్‌ విజన్‌ రీసెర్చ్‌- నాగన్న ఎగ్జిట్‌పోల్స్‌ సర్వే 
టీఆర్‌ఎస్‌ పార్టీ - 48-51 శాతం ఓట్లు
బీజేపీ - 31-35 శాతం ఓట్లు 
కాంగ్రెస్‌ పార్టీ - 13-15 శాతం ఓట్లు 
బీఎస్పీ- 5-7 శాతం ఓట్లు 
ఇతరులకు 2-5 శాతం ఓట్లు పోల్ అవుతాయని థర్డ్‌ విజన్‌ రీసెర్చ్‌- నాగన్న ఎగ్జిట్‌పోల్స్‌ సర్వే అభిప్రాయపడింది.

ఎస్‌ఏఎస్‌ గ్రూప్‌ ఎగ్జిట్‌పోల్‌ సర్వే
టీఆర్‌ఎస్‌ పార్టీ - 41-42 శాతం ఓట్లు 
బీజేపీ- 35-36 శాతం ఓట్లు 
కాంగ్రెస్‌ పార్టీ- 16.5-17.5 శాతం ఓట్లు 
బీఎస్పీ- 4-5 శాతం ఓట్లు 
ఇతరులు- 1.5-2 శాతం ఓట్లు నమోదు కానున్నట్టు ఎస్‌ఏఎస్‌ గ్రూప్‌ ఎగ్జిట్‌ పోల్‌ సర్వే వెల్లడించింది.

నేషనల్‌ ఫ్యామిలీ ఒపీనియన్‌ ఎగ్జిట్‌ పోల్‌
టీఆర్‌ఎస్‌ పార్టీ- 42.11 శాతం ఓట్లు 
బీజేపీ - 35.17 శాతం ఓట్లు
కాంగ్రెస్‌ పార్టీ- 14.07 శాతం ఓట్లు
బీఎస్పీ- 2.95 శాతం ఓట్లు 
ఇతరులు 5.70 శాతం ఓట్లు సొంతం చేసుకోనున్నట్టు నేషనల్‌ ఫ్యామిలీ ఒపీనియన్‌ ఎగ్జిట్‌ పోల్‌ సర్వే పేర్కొంది.

 

ఇదిలావుంటే, మునుగోడు ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు టీఆర్ఎస్ పార్టీకి ఆనందాన్నివ్వగా.. బీజేపి, కాంగ్రెస్ పార్టీకి షాక్ ఇచ్చాయి. రేసులో ముందున్న టీఆర్ఎస్ పార్టీకి, బీజేపికి మధ్యనే ఒకింత భారీ వ్యత్యాసం కనిపిస్తుండగా.. ఇక రెండో స్థానంలో, మూడో స్థానంలో ఉన్న బీజేపి, కాంగ్రెస్ పార్టీ మధ్యన ఆ గ్యాప్ మరింత ఎక్కువగా ఉండటం స్పష్టంగా కనిపిస్తోంది. ఏదేమైనా ఇది సర్వేల ఫలితాలు మాత్రమే అనే విషయం వారికి కొంత ఊరటనిస్తుండగా.. అసలు మునుగోడు ఎన్నికల ఫలితాలు ఈ నెల 6న వెలువడనున్నాయి. ఈ సస్పెన్స్ వీడాలంటే అప్పటివరకు ఓపిక పట్టాల్సిందే.

Also Read : CM KCR Press meet: టీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో బేరసారాల దృశ్యాలు.. బిగ్ స్క్రీన్‌పై బీజేపికి సినిమా చూపించిన కేసీఆర్ 

Also Read :  KA Paul: కే.ఏ. పాల్ వీడియో చూసి నవ్వుతున్న జనం

Also Read : KCR Press meet: మునుగోడు ఉప ఎన్నికపై కేసీఆర్ ప్రెస్ మీట్.. గెలుపు ఓటములపై ఆసక్తికర వ్యాఖ్యలు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Read More