Home> తెలంగాణ
Advertisement

Munugode By Election Results: మునుగోడు మొనగాడు ఎవరో..? అందరిలోనూ ఉత్కంఠ.. ఓట్ల లెక్కింపు ఇలా..

Munugode Bypoll Counting: మునుగోడు ప్రజలు వారి తీర్పునిచ్చారు. అభ్యర్థుల భవితవ్యం ఈవీఎంలలో నిక్షిప్తమై ఉంది. మరికొన్ని గంటల్లో ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది. 

Munugode By Election Results: మునుగోడు మొనగాడు ఎవరో..? అందరిలోనూ ఉత్కంఠ.. ఓట్ల లెక్కింపు ఇలా..

Munugode Bypoll Counting: తెలంగాణ ప్రజలు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్న సమయం వచ్చేసింది. మరికొన్ని గంటల్లో మునుగోడు అసెంబ్లీ భవితవ్యం తేలిపోనుంది. కోమటిరెడ్డి రాజగోపాల్ కాంగ్రెస్‌కు రాజీనామా చేసి.. బీజేపీలో చేరి ఎన్నికల బరిలో నిలిచారు. దీంతో మునుగోడుకు ఉప ఎన్నికలు అనివార్యం అయ్యాయి. బీజేపీ తరపున రాజగోపాల్ రెడ్డి బరిలో నిలవగా.. టీఆర్ఎస్‌ నుంచి కుసుకుంట్ల ప్రభాకర్, కాంగ్రెస్ నుంచి పాల్వాయి స్రవంతి పోటీ చేశారు. ప్రచారం పర్వం.. పోలింగ్ ముగియడంతో ఇప్పుడు అందరూ ఫలితాల కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఎగ్జిట్ పోల్ సర్వేలన్నీ అధికార పార్టీ వైపే మొగ్గు చూపినా.. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు విజయంపై ధీమాతో ఉన్నాయి. ఓట్ల లెక్కింపు ఆదివారం ఉదయం 8.00 గంటల నుంచి ప్రారంభమవుతుంది.

లెక్కింపు ప్రక్రియ ఇలా..

  • నియోజకవర్గంలోని మొత్తం ఓటర్ల సంఖ్య 2,41,805.
  • పోల్ అయిన మొత్తం ఓట్లు 2,25,192. ఇందులో పోస్టల్ బ్యాలెట్ ద్వారా వచ్చిన ఓట్లను కలపలేదు. ఈవీఎంలలో జరిగిన పోలింగ్ శాతం 93.13.   
  • మొత్తం 686 మంది పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కు వినియోగించుకున్నారు.
  • నల్గొండలోని అర్జాల బావిలోని తెలంగాణ స్టేట్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ గోడౌన్లలో కౌంటింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు.
  • ఓట్ల లెక్కింపు తేది 06.11.2022న ఉదయం 08.00 గంటలకు ప్రారంభమవుతుంది.
  • పోల్ చేయబడిన EVMS (A&B కేటగిరీ) ఉన్న స్ట్రాంగ్ రూమ్‌ను ఆదివారం ఉదయం 7.30 గంటలకు ఎన్నికల కమిషన్ పరిశీలకులు, పోటీలో ఉన్న అభ్యర్థులు లేదా వారి ఎలక్షన్ ఏజెంట్ల సమక్షంలో తెరుస్తారు.
  • ఎన్నికల కమిషన్ సూచనల మేరకు ముందుగా పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు చేపడతారు.
  • పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు కోసం మొత్తం 2 టేబుల్స్ ఏర్పాటు చేశారు.
  • పోస్టల్ బ్యాలెట్‌తో పాటు సర్వీస్ ఓటర్ల ఓట్లను ఎన్నికల కమిషన్ ఈటీపీబీఎస్ సాఫ్ట్‌వేర్ ద్వారా  లెక్కిస్తారు.
  • 8.30 నుంచి ఈవీఎంల లెక్కింపు చేపట్టనున్నారు.
  • ఓట్ల కౌంటింగ్    మొత్తం 21 టేబుల్స్‌లో జరగనుంది.
  • మొత్తం 298 పోలింగ్ స్టేషన్లు ఉన్నాయి. ఓట్ల లెక్కింపు 21 టేబుల్లలో మొత్తం 14 రౌండ్లు (14 పూర్తి రౌండ్లు, 294 పోలింగ్ స్టేషన్లు), 15వ రౌండ్‌లో 4 టేబుల్లలో ఓట్లు లెక్కిస్తారు.

Also Read: England Vs Sri Lanka: టీ20 వరల్డ్‌కప్ నుంచి ఆసీస్‌ ఔట్.. లంకేయులు చిత్తు.. ఇంగ్లాండ్ సెమీస్‌కు..!

Also Read: ఎవరూ ఊహించని విధంగా షాకింగ్ ఎలిమినేషన్.. ఇక వారంతా హ్యాపీ!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

Read More