Home> తెలంగాణ
Advertisement

MP Satyavathi Rathod: హన్మకొండ యువతి దాడిలో గాయపడిన యువతికి అండగా మంత్రి సత్యవతి రాథోడ్

MP Satyavathi Rathod:  ప్రేమోన్మాదిదాడి ఘటనపై తెలంగాణ ప్రభుత్వం స్పందించింది. దాడిపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు. గిరిజన, స్త్రీశిశుసంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్. ఎంజీఎం అధికారులతో మాట్లాడి అనూష ఆరోగ్య పరిస్థితిపై వివరాలను అడిగి తెలుసుకున్నారు. బాధితురాలికి మెరుగైన వైద్యం అందించాలన్నారు.

MP Satyavathi Rathod: హన్మకొండ యువతి దాడిలో గాయపడిన యువతికి అండగా మంత్రి సత్యవతి రాథోడ్

MP Satyavathi Rathod:  రోజు రోజు దేశంలో ప్రేమోన్మాదులు రెచ్చిపోతున్నారు. ప్రేమోన్మాదుల ఉచ్చులో చిక్కి అమాయకపు యువతులు బలవుతున్నారు.  మరికొందరు ఉన్మాదులు ప్రేమించి మోజు తీరిన తరువాత యువతులను దారుణంగా చంపుతున్నారు. ఏ రకంగా చూసిన ఈ ఉన్మాదుల చేత చిక్కి యువతులు మంచి భవిష్యత్‌ను కోల్పోతున్నారు. తెలంగాణలో గతంలో జరిగిన పుష్ప యువకుడిపై చేసిన దాడి మరవక ముందే మరో ఘటన వెలుగు చూసింది.

హనుమకొండలోని ఓ ప్రేమోన్మాదులు రెచ్చిపోయి గాంధీనగర్‌కు చెందిన ఓ ఎంసీఏ విద్యార్థినిపై  కత్తితో దాడి చేసి గొంతుకోశాడు. ఈ దారుణంలో అనూష(23) తీవ్ర గాయాలపాలైంది.  ప్రస్తుతం అనూష పరిస్థితి స్థిరంగా ఉన్నా.. గొంతు కోయడంతో తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు అందించిన వివరాల ప్రకారం..మొండ్రాయి గ్రామానికి  చెందిన అజార్‌ గత కొన్ని నెలల నుంచి  అనూషను ప్రేమించమని వెంట పడేవాడట. ఇటివలే ఆమె ప్రేమను నిరాకరించింది. దీంతో అజార్‌  ఈ దారుణానికి ఒడిగట్టాడు.

స్పందించిన మంత్రి సత్యవతి రాథోడ్:

ప్రేమోన్మాదిదాడి ఘటనపై తెలంగాణ ప్రభుత్వం స్పందించింది. దాడిపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు. గిరిజన, స్త్రీశిశుసంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్. ఎంజీఎం అధికారులతో మాట్లాడి అనూష ఆరోగ్య పరిస్థితిపై వివరాలను అడిగి తెలుసుకున్నారు. బాధితురాలికి మెరుగైన వైద్యం అందించాలన్నారు.  ప్రభుత్వం తరపున ఎలాంటి సాయం కావాలన్నా అందిస్తామని తెలిపారు. దాడిచేసిన ప్రేమోన్మాదిపై కఠినచర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించారు.

 

Also Read: Man Attacked MCA Student: ప్రేమోన్మాది ఘాతుకం ..యువతి ఇంటికి వెళ్లి కత్తితో గొంతుకోసిన యువకుడు..!

Also Read: MS Dhoni Record: ఐపీఎల్‌లో ఎంఎస్ ధోనీ అరుదైన రికార్డు.. ఒకే ఒక్కడు!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Read More