Home> తెలంగాణ
Advertisement

Minister KTR: మారనున్న హైదరాబాద్ రూపురేఖలు.. ఐదు బ్రిడ్జిల నిర్మాణ పనులకు మంత్రి కేటీఆర్ శంకుస్థాపన

Five Bridges over Musi and Isa Rivers: హైదరాబాద్ నగరంలో ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌కు మంత్రి కేటీఆర్ శ్రీకారం చుట్టారు. మూసి నది, ఈసా నదిలపై ఐదు వంతెనల బ్రిడ్జిల నిర్మాణ పనులకు సోమవారం శంకుస్థాపన చేశారు.

Minister KTR: మారనున్న హైదరాబాద్ రూపురేఖలు.. ఐదు బ్రిడ్జిల నిర్మాణ పనులకు మంత్రి కేటీఆర్ శంకుస్థాపన

Five Bridges over Musi and Isa Rivers: రాజధాని నగరానికి మధ్యలో ఉన్న మూసి, ఈసా నదిలపై ఐదు బ్రిడ్జిల నిర్మాణ పనులకు మంత్రి కేటీఆర్ సోమవారం ఉప్పల్ భగాయత్ శిల్పారామం సమీపంలోని మూసి పరివాహక ప్రాంతంలో భూమి పూజ చేశారు. రూ.168 కోట్ల వ్యయంతో హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ (HMDA) ఐదు బ్రిడ్జిలను నిర్మించనుంది. హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు (ఓఆర్ఆర్) లోపల పెరుగుతున్న రద్దీకి అనుగుణంగా ప్రజా రవాణా వ్యవస్థను మరింతగా మెరుగుపరచాలన్న లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం మూసి ఈసా నదులపై పలు వంతెనలను ప్రతిపాదించిన విషయం తెలిసిందే.

మూసి, ఈసా నదులపై 14 బ్రిడ్జిలు నిర్మించనున్నారు. అందులో హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్ మెంట్ అథారిటీ (హెచ్ఎండీఏ) ఆధ్వర్యంలో మూసినదిపైన మూడు చోట్ల, ఈసా నదిపై రెండు చోట్ల వంతెనల నిర్మాణ పనులను చేపడుతోంది. ఏడాదిన్నర కాలంలో మూసి వంతెనలు వినియోగంలోకి రానున్నాయి.   

రూ.168 కోట్ల వ్యయంతో  హెచ్ఎండీఏ నిర్మించే ఐదు వంతెనల నిర్మాణ ఇవే..

==> రూ.42 కోట్లతో ఉప్పల్ బాగాయత్ లే అవుట్ వద్ద 
==> రూ.35 కోట్లతో ప్రతాపసింగారం-గౌరెల్లి వద్ద
==> రూ.39 కోట్లతో మంచిరేవుల వద్ద
==> రూ.32 కోట్లతో బుద్వేల్ ఐటీ పార్క్-2 సమీపంలో ఈసా నదిపై
==> రూ.20 కోట్లతో బుద్వేల్ ఐటీ పార్క్-1 సమీపంలో ఈసా నదిపై హెచ్ఎండీఏ వంతెనలు నిర్మించనున్నది. 

ఉప్పల్ భగాయత్, ప్రతాపసింగారం ప్రాంతాల్లో సుమారు 210 మీటర్ల పొడవున నాలుగు వరుసల(ఫోర్ లైన్) వంతెన నిర్మాణం జరగనుంది. సోమవారం హెచ్ఎండీఏ ఐదు బ్రిడ్జిల శంకుస్థాపన కార్యక్రమంలో జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి, జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రాస్, హెచ్ఎండీఏ చీఫ్ ఇంజనీర్ బీఎల్ఎన్ రెడ్డి, సూపరింటెండెంట్ ఇంజనీర్ హుస్సేన్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ హరికృష్ణలతో పాటు స్థానిక ప్రజాప్రతినిధులు, హెచ్ఎండీఏ, జీహెచ్ఎంసి అధికారులు పాల్గొన్నారు.

Also Read: Suryakumar Yadav: ఇదేం బాదుడు సూర్య భాయ్.. వరుసగా నాలుగు సిక్సర్లతో ఆ బౌలర్‌కు చుక్కలు  

Also Read: Jio AirFiber: జియో ఎయిర్ ఫైబర్ లాంచ్, ఇంటర్నెట్ స్పీడ్, ఫ్రీ ఓటీటీ ఇతర ప్లాన్స్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Read More