Home> తెలంగాణ
Advertisement

Minister Etela Rajender : మంత్రి పదవి మీరు పెట్టిన భిక్షే: మంత్రి ఈటల రాజేందర్

మంత్రి పదవి మీరు పెట్టిన భిక్ష. మీరే హక్కుదారులు. నా కారులో మీరు పెట్రోలు పోస్తే నేను తిరుగుతున్నాను అనే విషయాన్ని ప్రతీక్షణం గుర్తుపెట్టుకొని పనిచేస్తున్నానని మంత్రి ఈటల వ్యాఖ్యానించారు. హుజురాబాద్‌లో "పట్టణ ప్రగతి" కార్యక్రమాన్ని ప్రారంభించిన సందర్భంగా మంత్రి ఈటల ఈ వ్యాఖ్యలు చేశారు.

Minister Etela Rajender : మంత్రి పదవి మీరు పెట్టిన భిక్షే: మంత్రి ఈటల రాజేందర్

హుజూరాబాద్: తనకు మంత్రి పదవిని అమ్మ ఇవ్వలేదని.. హుజురాబాద్ ప్రజలు ఓట్లు వేస్తేనే తనకు మంత్రి పదవి వచ్చిందని తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. ఈ పదవి మీరు పెట్టిన భిక్ష. మీరే హక్కుదారులు. నా కారులో మీరు పెట్రోలు పోస్తే నేను తిరుగుతున్నాను అనే విషయాన్ని ప్రతీక్షణం గుర్తుపెట్టుకొని పనిచేస్తున్నానని మంత్రి ఈటల వ్యాఖ్యానించారు. హుజురాబాద్‌లో "పట్టణ ప్రగతి" కార్యక్రమాన్ని ప్రారంభించిన సందర్భంగా మంత్రి ఈటల ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి ఈటల రాజేందర్ మాట్లాడుతూ.. 2009లో తాను హుజురాబాద్ ఎమ్మెల్యేగా వచ్చినప్పుడే చెప్పాను.. తాను ఎమ్మెల్యే అయ్యింది మోరీలు కట్టియ్యడానికి కాదు.. తెలంగాణ కోసం అని. ఒకప్పుడు రూ 20 లక్షల నిధుల కోసం ఇబ్బంది పడ్డాము. అయినా సరే ఆనాడు ఏం పని చేయకపోయినా ఓట్లు వేసి గెలిపించారు. అందుకే మీ రుణం తీర్చుకోవాలి అనే భావన గుండెల్లో బలంగా ఉండేది. 2014లో ఆర్థిక శాఖ మంత్రిని అయ్యాను. అదే విధంగా క్రమక్రమంగా నియోజకవర్గాన్ని అభివృద్ది చేసుకున్నాము అని అన్నారు. 

మురికి పని చేసే వారంతా దళిత బిడ్డలేనని.. వారికి జీతం ఇవ్వకపోతే ఎలా అనే ఉద్దేశంతో మన మున్సిపాలిటీల్లో రీవోల్వింగ్ ఫండ్ ఏర్పాటు చేశానని మంత్రి ఈటల గుర్తుచేసుకున్నారు. పందుల బెడద పోగొట్టడంతో పాటు అదే సమయంలో ఎరుకల వాళ్లకు పందుల పెంపకానికి ఇబ్బందులు లేకుండా ఉండేందుకు ప్రత్యేక షెడ్స్ ఏర్పాటు చేస్తున్నామని.. వెంటనే ఆ పనులు పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలి అని జిల్లా కలెక్టర్‌కు విజ్ఞప్తిచేశారు. 

ప్రతీ ఇంటికి ప్రతీ రోజు:
జమ్మికుంట పట్టణానికి గతంలో 20 రోజులకు ఒకసారి మంచి నీళ్ళు వచ్చేవని.. మంటి నీటి కోసం జమ్మికుంట వాసులు పడుతున్న తిప్పలు చూసి జమ్మికుంటకు రూ 40 కోట్లు, హుజురాబాద్‌కి రూ. 50 కోట్లు మంజూరు చేయించినట్టు తెలిపారు. ప్రతీ ఇంటికి ప్రతీ రోజు నీళ్లు వచ్చేలా చూడాలనే లక్ష్యంతోనే ఈ నిధులు మంజూరు చేయించినట్టు మంత్రి ఈటల స్పష్టంచేశారు. మీకు అవసరమైన నిధులను తెచ్చిపెట్టానని.. అలాగే ప్లాన్ చేసి ఖర్చుపెట్టాలని మంత్రి సంబంధిత అధికార యంత్రాంగానికి సూచించారు. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..

Read More