Home> తెలంగాణ
Advertisement

Double bedroom flats : వాళ్లకే ముందుగా డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు.. ఆ తర్వాతే సొంత జాగల్లో : మంత్రి ఈటల

గుడిసెల్లో ఉండేవారికి, ప్లాస్టిక్ కవర్లనే నివాసంగా ఏర్పాటు చేసుకుని ఉంటున్న వారికే ముందుగా డబుల్ బెడ్ రూం ఇళ్లు మంజూరు చేస్తామని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. 500 డబుల్ బెడ్ రూం ఇళ్లు పంపిణీ కోసం సిద్ధమవుతున్నాయని మంత్రి చెప్పారు.

Double bedroom flats : వాళ్లకే ముందుగా డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు.. ఆ తర్వాతే సొంత జాగల్లో : మంత్రి ఈటల

హుజూరాబాద్ : గుడిసెల్లో ఉండేవారికి, ప్లాస్టిక్ కవర్లనే నివాసంగా ఏర్పాటు చేసుకుని ఉంటున్న వారికే ముందుగా డబుల్ బెడ్ రూం ఇళ్లు మంజూరు చేస్తామని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. హుజూరాబాద్ పరిధిలో 500 డబుల్ బెడ్ రూం ఇళ్లు పంపిణీ కోసం సిద్ధమవుతున్నాయని మంత్రి చెప్పారు. అలాగే సొంత జాగల్లో ఇల్లు కట్టుకోవాలనుకునే వారికి కూడా అవకాశం ఇవ్వాల్సిందిగా సీఎం కెసిఆర్‌ని విజ్ఞప్తి చేస్తున్నామని.. త్వరలోనే సీఎం కేసీఆర్ నిర్ణయం వెల్లడిస్తారని ఆశిస్తున్నట్టు మంత్రి ఈటల పేర్కొన్నారు. హుజురాబాద్‌లో "పట్టణ ప్రగతి" కార్యక్రమాన్ని ప్రారంభించిన సందర్భంగా మంత్రి ఈటల ఈ విషయాన్ని వెల్లడించారు. హైదరాబాద్‌లో ఉన్న మాదిరిగా 2 కోట్లు ఖర్చుపెట్టి స్మశాన వాటిక నిర్మాణం చేసుకున్నాము. ఇంతకు ముందు ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉన్న మార్చురీల్లో శవాలను ఎలుకలు పీక్కు తిన్న సందర్భాలున్నాయని.. చచ్చిన తరువాత ఎవ్వరికైనా అలాంటి దుస్థితి ఎదురుకావొద్దనే ఉద్దేశంతో ఆస్పత్రికి 4 ఫ్రీజర్లు ఏర్పాటు చేసినట్టు చెప్పారు. 

పుట్టక ముందు నుండి చచ్చి పోయిన తరువాత వరకు మనిషికి ఏమేం కావాలో అవన్నీ ఏర్పాటు చేస్తున్న ప్రభుత్వం మనదని ఈ సందర్భంగా మంత్రి ఈటల రాజేందర్ చెప్పుకొచ్చారు. అయితే, ప్రజలు కూడా తమ భాద్యతలు మరువొద్దని... రాష్ట్రాభివృద్ధికి ప్రతీ ఒక్కరూ సహకరించాలవి మంత్రి ఈటల విజ్ఞప్తి చేశారు. గ్రామానికి వచ్చిన నాయకుల మీద, అధికారుల మీద లొల్లి పెట్టకుండా.. వచ్చిన అధికారులను కూర్చోపెట్టి, సామరస్యంగా మాట్లాడి వారిచేత పనులు చేయించుకోండి అని మంత్రి ప్రజలకు సూచించారు. 

నడిచే ఎద్దునే పొడుస్తారు.. పని చేసే వాడి దగ్గరికే ప్రజలు వస్తారు:
ప్రతీ కౌన్సిలర్ ప్రతీ రోజు ఉదయం వార్డుల్లో తిరిగి ప్రజా సమస్యలు తెలుసుకుని వాటి పరిష్కారానికి కృషి చేయాలని ప్రజాప్రతినిధులకు తేల్చిచెప్పారు. నడిచే ఎద్దునే పొడుస్తారు.. పని చేసే వాడి దగ్గరికే ప్రజలు వస్తారని మంత్రి వ్యాఖ్యానించారు. ప్రజాప్రతినిధులు సైతం ప్రజలకు అందుబాటులో ఉండాలని.. అప్పుడే ప్రజలు సైతం నాయకుల వెంట నడుస్తారని చెప్పే క్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..

Read More