Home> తెలంగాణ
Advertisement

Trs Fire on BandI Sanjay: సన్యాసుల సంఘానికి అధ్యక్షుడు సంజయ్.. వరంగల్ టీఆర్ఎస్ నేతల ఫైర్

Errabelli Dayaker Rao: కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా బహిరంగ సభపై  టీఆర్ఎస్ నేతలు తీవ్రంగా స్పందిస్తున్నారు. సీఎం కేసీఆర్ చేసిన ఆరోపణలకు కౌంటరిస్తున్నారు. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ పైనా విరుచుకుపడుతున్నారు.

Trs Fire on BandI Sanjay: సన్యాసుల సంఘానికి అధ్యక్షుడు సంజయ్.. వరంగల్ టీఆర్ఎస్ నేతల ఫైర్

Errabelli Dayaker Rao: కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా బహిరంగ సభపై  టీఆర్ఎస్ నేతలు తీవ్రంగా స్పందిస్తున్నారు. సీఎం కేసీఆర్ చేసిన ఆరోపణలకు కౌంటరిస్తున్నారు. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ పైనా విరుచుకుపడుతున్నారు. వరంగల్ లో మీడియా సమావేశం నిర్వహించిన ఆ జిల్లా టీఆర్ఎస్ నేతలు బీజేపీ పై తీవ్ర విమర్శలు చేశారు. బీజేపీ నాయకులు బ్లాక్ మెయిలర్స్ అన్నారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. అమిత్ షా గతంలో ఇచ్చిన హామీలను నిలబెట్టుకున్నారా అని ప్రశ్నించారు. బీజేపీ నేతల బోగస్ మాటలను తెలంగాణ ప్రజలు నమ్మబోరన్నారు దయాకర్ రావు.

మోడీ ప్రభుత్వం ఉపాధి హామీకి నిధులు తగ్గించిందని ఎర్రబెల్లి ఆరోపించారు.  నీచమైన కుట్రలతో తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన నిధులకు ఎగనామం పెడుతోందని మండిపడ్డారు. గిరిజన యూనివర్సిటీ, సైనిక్ స్కూల్, కాజీపేట కోచ్ ఫ్యాక్టరీకి భూములిచ్చినా  పనులు చేయలేదన్నారు దయాకర్ రావు. తెలంగాణకు ఒక్క మెడికల్ కాలేజీ ఇవ్వలేదని మండిపడ్డారు. బండి సంజయ్ పిచ్చిపిచ్చిగా మాట్లాడుతున్నారని ఫైరయ్యారు. పసుపు బోర్డు ఏమైందో చెప్పాలని మంత్రి దయాకర్ రావు బీజేపీ నేతలను నిలదీశారు. కేసీఆర్ ది త్యాగాల కుటుంబమన్న ఎర్రబెల్లి.. కేసీఆర్ తెలంగాణ గాంధీ అన్నారు.

అమిత్ షా వ్యాఖ్యలను ఖండిస్తున్నామన్నారు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి సుదర్శన్ రెడ్డి.  తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన వాటాలు తేవడంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విఫలమయ్యారని విమర్శించారు. కేంద్రమంత్రి కిషన్ రెడ్డికి దమ్ముంటే రాజీనామా చేయాలని సవాల్ చేశారు సుదర్శన్ రెడ్డి. కట్టిన ప్రాజెక్టులను నిర్వీర్యం చేసే కుట్ర చేస్తున్నారని మండిపడ్డారు. బాయిల్డ్ రైస్ కొనుగోలు చేసే బాధ్యత కేంద్రానిదే అన్నారు ఎమ్మెల్యే పెద్ది. ఆబద్దాల యూనివర్సిటీకి అమిత్ షా వీసీ అన్నారు. కేసీఆర్ ఎక్కడున్నా బుల్లెట్ దిగిందా లేదా అన్న చందంగా పనిచేస్తున్నారని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. ఒక్క ఛాన్స్ ప్లీజ్ అంటున్నారు... అధికారం ఇచ్చిన దగ్గర ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. సన్యాసుల సంఘానికి అధ్యక్షుడు సంజయ్ అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. బండి సంజయ్ ను పాదయాత్రలో ప్రజలు నిలదీశారని చెప్పారు. బీజేపీ నేతలు కేసీఆర్ పై ఇష్టమొచ్చినట్లుగా మాట్లాడితే ఊరుకునేది లేదని హెచ్చరించారు చల్లా ధర్మారెడ్డి.

READ ALSO: Amit Sha On Bandi Sanjay: బండి సంజయ్ ని ఆకాశానికెత్తిన అమిత్ షా.. సీఎం అభ్యర్థిగా సిగ్నల్ ఇచ్చినట్టేనా? 

READ ALSO: Gaddar Meets Amit Shah: బీజేపీ బహిరంగ సభలో ప్రత్యక్షమైన గద్దర్... అమిత్ షాను కలిసిన ప్రజా యుద్ధ నౌక... 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Read More