Home> తెలంగాణ
Advertisement

Telangana Mlc Elections: పీవీ కుమార్తె సురభి వాణికి ఎంఐఎం మద్దతు ఉండదా..కారణాలేంటి

Telangana Mlc Elections: తెలంగాణలో ఇప్పుడు ఎమ్మెల్సీ వేడి రాజుకుంది. రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. మాజీ ప్రధాని పీవీ నర్శింహారావు కుమార్తె సురభి వాణిదేవికి మజ్లిస్ పార్టీ మద్దతు ఉంటుందా లేదా అనేది ఆసక్తిగా మారింది.
 

Telangana Mlc Elections: పీవీ కుమార్తె సురభి వాణికి ఎంఐఎం మద్దతు ఉండదా..కారణాలేంటి

Telangana Mlc Elections: తెలంగాణలో ఇప్పుడు ఎమ్మెల్సీ వేడి రాజుకుంది. రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. మాజీ ప్రధాని పీవీ నర్శింహారావు కుమార్తె సురభి వాణిదేవికి మజ్లిస్ పార్టీ మద్దతు ఉంటుందా లేదా అనేది ఆసక్తిగా మారింది.

తెలంగాణ(Telangana)రాష్ట్రంలో హైదరాబాద్-మహబూబ్ నగర్-రంగారెడ్డి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో(Graduate Mlc Election) మజ్లిస్ పార్టీ మద్దతు ఎవరికిస్తుందనేది ఆసక్తిగా మారింది. ఆధికార టీఆర్ఎస్‌కు ఎంఐఎంకు మధ్య మైత్రిబంధం ఇంకా కొనసాగుతూనే ఉంది. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో(Ghmc Elections) ఎవరికి వారు ఒంటరిగా పోటీ చేసినప్పటికీ..మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికలో మాత్రం ఎంఐఎం పార్టీ అనూహ్యంగా టీఆర్ఎస్ పార్టీ(TRS Party)కు మద్దతిచ్చి తమ సత్తా మరోసారి చాటింది. మరి ఇప్పుడు కూడా అదే బంధం కొనసాగుతుందన్న గ్యారంటీ లేదు. పట్టభద్రుల ఎన్నికలో ఈసారి ముస్లిం ఓట్లు కీలకంగా మారనున్నాయి. కారణమేమంటే పెద్దసంఖ్యలో మైనార్టీ వర్గానికి చెందిన పట్టభద్రులు ఎమ్మెల్సీ ఓటర్లుగా నమోదు చేసుకున్నారు. ఎన్నికల బరిలో మజ్లిస్ పార్టీ బరిలో లేకపోవడంతో ఏదో ఒక పార్టీకు సహకరించక తప్పని పరిస్థితి. పార్టీపరంగా ఇప్పటివరకూ ఎలాంటి సంకేతాలు కూడా లేవు. 

టీఆర్ఎస్ పార్టీతో మైత్రీ బంధం ఉంది కాబట్టి కచ్చితంగా టీఆర్ఎస్ అభ్యర్ధినిగా రంగంలో దిగిన పీవీ కుమార్తె సురభి వాణిదేవి(Pv Daughter Surabhi vanidevi)కి ఎంఐఎం మద్దతు ప్రకటిస్తుందని అనుకునే అవకాశం లేదు. ఎందుకంటే పీవీ కుమార్తె స్థానంలో మరెవరైనా పోటీలో ఉండే కచ్చితంగా ఎంఐఎం (MIM) మద్దతిచ్చేది. ఇప్పుడు పీవీ కుమార్తె కావడమే పునరాలోచనకు కారణంగా ఉంది. అయోధ్యలోని బాబ్రీ మసీదు కూల్చివేతకు అప్పటి ప్రధాని పీవీ నర్శింహారావే ( Ex pm pv narsimha rao)కారణమని మజ్లిస్ పార్టీ ఎప్పుడూ ఆరోపిస్తూ ఉంది. అలాంటి వ్యక్తి కుమార్తెకు మద్దతిచ్చే ప్రసక్తే ఉండదనేది పార్టీ వర్గాల ఆలోచన. ఎందుకంటే మైనార్టీ వర్గంలో ఇప్పటికీ పీవీ అంటే కొంత వ్యతిరేకత ఉంది. అందుకే మజ్లిస్ పార్టీ మద్దతు ఈసారి ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎవరికనేది ఆసక్తి కల్గిస్తోంది. 

Also read: Telangana Eamcet 2021: తెలంగాణలో ఎంసెట్ పరీక్షల షెడ్యూల్ విడుదల

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Read More