Home> తెలంగాణ
Advertisement

Rain alert: బంగాళాఖాతంలో మరో అల్పపీడనం.. భారీ వర్షాలు కురిసే అవకాశం

తెలంగాణలోని చాలా జిల్లాల్లో ఇప్పటికే ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో ( Heavy rain ) నదులు, వాగులు వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. జలాశయాల్లోకి వరద నీరు ఉప్పొంగుతుండటంతో అనేక జలాశయాలు నిండు కుండను తలపిస్తున్నాయి.

Rain alert: బంగాళాఖాతంలో మరో అల్పపీడనం.. భారీ వర్షాలు కురిసే అవకాశం

హైదరాబాద్: తెలంగాణలోని చాలా జిల్లాల్లో ఇప్పటికే ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో ( Heavy rain ) నదులు, వాగులు వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. జలాశయాల్లోకి వరద నీరు ఉప్పొంగుతుండటంతో అనేక జలాశయాలు నిండు కుండను తలపిస్తున్నాయి. ఇదిలావుండగా తాజాగా ఈ నెల 23న వాయువ్య బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ( Low pressure ) ఏర్పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. మరోవైపు ఉత్తర బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర అల్పపీడనంగా మారడంతో గురువారం కూడా పలు జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురువనున్నట్టు హైదరాబాద్ వాతావరణ కేంద్రం డైరెక్టర్ నాగరత్నం తెలిపారు. అంతేకాకుండా శుక్రవారం కూడా తేలికపాటి జల్లులు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది. ఈ అల్ప పీడనం పశ్చిమదిశగా ప్రయాణించి వాయుగుండంగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ఈ వర్షాకాలంలో ఇప్పటికే సాధారణ వర్షపాతం కంటే 44 శాతం అధిక వర్షపాతం నమోదైంది. ఈ వర్షా కాలంలో నమోదైన వర్షాపాతం నివేదికను తెలంగాణ వ్యవసాయ శాఖ ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించింది. Also read : Gajendra Singh Shekhawat: మ‌రో కేంద్ర మంత్రికి క‌రోనా పాజిటివ్‌

ఇదిలావుంటే, మరోవైపు తీవ్ర అల్ప పీడనం ప్రభావంతో ఒడిషాలోని ( Odisha ) పది జిల్లాలకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ఒకదాని తర్వాత మరొకటిగా ఏర్పడుతున్న అల్పపీడనం ప్రభావంతో గత కొద్ది రోజులుగా ఒడిషాలోని అనేక ప్రాంతాలు వరద ముప్పు ( Odisha floods ) బారినపడ్డాయి. Also read : Coronavirus: కరోనావైరస్ నుంచి కూరగాయలు, ఆకు కూరలు, పండ్లను శుభ్రపరచడం ఎలా ?

Read More