Home> తెలంగాణ
Advertisement

Lovers Suicide: పెళ్లికి పెద్దలు నో.. పురుగుల మందు తాగిన ప్రేమజంట

ఆ ప్రేమికులు మనస్తాపానికి లోనయ్యారు. ఏం చేయాలో అర్ధం కాలేదు. కఠిన నిర్ణయం (Lovers Suicide Attempt) తీసుకున్నారు. తమకు చావే శరణ్యమంటూ పురుగుల మందు తాగేశారు.

Lovers Suicide: పెళ్లికి పెద్దలు నో.. పురుగుల మందు తాగిన ప్రేమజంట

తమ ప్రేమ పెళ్లికి పెద్దలు నో చెప్పారంటూ ఆ ప్రేమికులు మనస్తాపానికి లోనయ్యారు. ఏం చేయాలో అర్ధం కాలేదు. కఠిన నిర్ణయం తీసుకున్నారు. తమకు చావే శరణ్యమంటూ పురుగుల మందు తాగేశారు. ప్రస్తుతం ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఈ ఘటన వనపర్తి జిల్లాలో చోటుచేసుకుంది. 

వనపర్తి జిల్లాలోని రేవల్లి మండలం గాంధీనగర్‌కు చెందిన యువకుడు నాగరాజు అదే గ్రామానికి చెందిన ఓ యువతిని ప్రేమించాడు. ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న ఆ యువతి గత కొంతకాలం నుంచి ఇంటి దగ్గర ఉంటోంది. ఆ యువతి కూడా నాగరాజును ప్రేమించింది. పెళ్లికి సైతం సిద్ధమైంది. తమ నిర్ణయాన్ని పెద్దల వద్ద ప్రస్తావించారు. తాము ప్రేమించుకున్నామని, ఒకరిపై మరొకరరిపై చాలా ప్రేమ అని తమకు వివాహం జరిపించాలని పెద్దలను కోరారు.

అందుకు వారు నిరాకరించడంతో మనస్తాపానికి గురయ్యారు. చనిపోవాలని నిర్ణయించుకున్న ఆ ప్రేమ జంట పొలాలకు పిచికారి చేసే పురుగుల మందు తీసుకెళ్లి సేవించారు. ఇది గమనించిన కుటుంబసభ్యులు హుటాహుటిన వారిని వనపర్తి జిల్లా ఆస్పత్రికి తరలించారు. వైద్యులు వారికి చికిత్స అందిస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

Read More