Home> తెలంగాణ
Advertisement

Muslim Reservations: ముస్లిం రిజర్వేషన్లు తీసి ఆ వర్గాలకిచ్చేస్తాం, అమిత్ షా వివాదాస్పద వ్యాఖ్యలు

Muslim Reservations: దేశంలో నాలుగో విడత ఎన్నికలకు మరో మూడ్రోజులే మిగిలింది. వివాదాస్పద అంశాలే ప్రాతిపదికగా ప్రచారం సాగుతోంది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా మరోసారి ముస్లిం రిజర్వేషన్లకు సంబంధించి కీలక వ్యాఖ్యలు చేశారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

Muslim Reservations: ముస్లిం రిజర్వేషన్లు తీసి ఆ వర్గాలకిచ్చేస్తాం, అమిత్ షా వివాదాస్పద వ్యాఖ్యలు

Muslim Reservations: ఎన్నికలు సమీపించేకొద్దీ ప్రచారం పీక్స్‌కు చేరుతోంది. ఈసారి ఎన్నికల్లో బీజేపీ తెలంగాణపై ఫోకస్ పెంచింది. అందుకే వివాదాస్పద అంశాలను ప్రచారంలో ప్రస్తావిస్తున్నారు బీజేపీ అగ్రనేతలు. ఇప్పుడు జరుగుతున్న ఎన్నికలు అభివృద్ధికి, జిహాద్‌కు మధ్య జరుగుతున్న ఎన్నికలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా వ్యాఖ్యానించారు. 

తెలంగాణలోని 17 లోక్‌సభ స్థానాలకు ఈ నెల 13న నాలుగో విడతలో భాగంగా ఎన్నికలు జరగనున్నాయి. ఈ సందర్భంగా తెలంగాణలో బీజేపీ అగ్రనేతలు వరుస ప్రచారాలతో హోరెత్తిస్తున్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలంగాణపై ప్రత్యేక దృష్టి సారించారు. ఈ ఎన్నికలు అభివృద్ధికి, జిహాద్‌కు మధ్య జరుగుతున్నవని పిలుపునిచ్చారు. జై శ్రీ రాం నినాదంతో ప్రసంగం ప్రారంభించిన అమిత్ షా మొదటి మూడు విడతల్లో బీజేపీ 200 సీట్లు సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణలో బీజేపీ 10 కంటే ఎక్కువ స్థానాలు గెలుస్తుందని తెలిపారు. దేశవ్యాప్తంగా ఈసారి 400 సీట్లు సాధిస్తామన్నారు. 

తెలంగాణలో కాంగ్రెస్-బీఆర్ఎస్, మజ్లిస్ పార్టీల మధ్య ట్రయాంగిల్ బంధముందని, ఈ మూడు పార్టీలు కలిసి రామనవమి ఊరేగింపు కూడా జరగనివ్వవని అమిత్ షా తెలిపారు. సెప్టెంబర్ 17న హైదరాబాద్ విమోచన దినోత్సవం కూడా జరుపుకోనివ్వరన్నారు. ఈ మూడు పార్టీలు కలిసి తెలంగాణలో షరియా, ఖురాన్ ఆధారిత పాలన సాగించాలని చూస్తున్నారని అమిత్ షా తెలిపారు. 

తెలంగాణలో బీజేపీకు 10 కంటే ఎక్కువ సీట్లు వస్తే ముస్లిం రిజర్వేషన్లు తొలగించి ఎస్సీ-ఎస్టీ-ఓబీసీలకు ఇస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలిపారు. రామమందిరం నిర్మాణం హామీని నెరవేర్చిన మోదీ ఆర్టికల్ 370రద్దు చేసి కశ్మీర్ మనదేనని చాటిచెప్పారన్నారు. దేశంలో తీవ్రవాదం, మావోయిజాన్ని దూరం చేశామన్నారు.  భువనగిరిలో జరిగిన బహిరంగ సభలో మాట్లాడిన అమిత్ షా పలు కీలకాంశాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. 

Also read: Bajaj Pulsar NS400Z: గంటకు 154 కిలోమీటర్ల వేగంతో కొత్త పల్సార్ బైక్, ధర ఫీచర్లు ఇలా

 స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Read More