Home> తెలంగాణ
Advertisement

Telangana Assembly Live: తలసరి ఆదాయంలో తెలంగాణదే అగ్రస్థానం: మంత్రి హరీశ్ రావు

Telangana Assembly Monsoon Session 2023 Live Updates: శనివారం తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో కీలక అంశాలపై చర్చ జరగనుంది. నేడు ఉదయం  10 గంటలకు ఉభయ సభలు ప్రారంభమయ్యాయి. అసెంబ్లీ సమావేశాల లైవ్ అప్‌డేట్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
 

Telangana Assembly Live: తలసరి ఆదాయంలో తెలంగాణదే అగ్రస్థానం: మంత్రి హరీశ్ రావు
LIVE Blog

Telangana Assembly Monsoon Session 2023 Live Updates: తెలంగాణ అసెంబ్లీ వర్షాకాల సమావేశాల గురువారం ప్రారంభమవ్వగా.. కీలక బిల్లులపై చర్చ జరుగుతోంది. శుక్రవారం సభ్యుల మధ్య వాడివేడి చర్చలు జరిగాయి. భారీ వర్షాలు భారీ వర్షాలు, నష్టాలు, ప్రభుత్వ సాయంపై బీఆర్ఎస్, కాంగ్రెస్ ఎమ్మెల్యేల మధ్య వాదోపవాదాలు జరిగాయి. మంత్రులు కేటీఆర్‌, హరీశ్‌ రావు, ప్రశాంత్‌రెడ్డి.. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, శ్రీధర్‌బాబు మధ్య తీవ్ర వాగ్వివాదం జరిగింది. వరద సాయంపై సుదీర్ఘ జరిగింది. 

 

05 August 2023
15:13 PM

సింగరేణి గురించి అసెంబ్లీలో మాట్లాడుతున్న సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క

 

14:34 PM

గిరిజన సంక్షేమంపై లఘ చర్చలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మాట్లాడారు.

==> మణిపూర్‌లో రెండు గిరిజన తెగల మధ్య కొట్లాట పెట్టించి చలి కాచుకుంటున్నారని మండిపాటు
==> మణిపూర్ అల్లర్లను కట్టడి చేయడంలో కేంద్రం విఫలం
==> విభజించి పాలించి ఓట్లు దండుకోవాలని బీజేపీ చూస్తోంది
==> బ్రిటీషర్లు మెదలు పెట్టింది‌.. బీజేపీ ఫాలో అవుతుంది
==> కళ్యాణలక్షి, కేసీఆర్‌ కిట్‌, ఆరోగ్యలక్ష్మి పథకాలతో తెలంగాణ గిరిజన ఆడబిడ్డలకు ప్రయోజనం
==> 4 లక్షల 5 వేల ఎకరాలకు పోడు పట్టాలు పంపిణీ చేశాం..
==> లక్షా యాభై వేల మంది గిరిజనులకు పోడు పట్టాలు ద్వారా లబ్ధి 
==> ఆత్మగౌరవంతో కూడిన అభివృద్ధి.. కేసీఆర్ సర్కార్ నినాదం
==> గిరిజనులకు రూ.1336 కోట్లు కళ్యాణ లక్ష్మీ కోసం నిధులు ఖర్చు 
==> ఎస్టీలకు కేటాయించిన నిధులు ఎస్టీలకే ఖర్చు చేయటానికి కేసీఆర్ 2017లో ప్రత్యేక చట్టం తీసుకొచ్చారు
==> ఆదివాసీ భవన్‌తో పాటు.. కొమురం భీం పేరుతో జోడే ఘాట్‌ను అభివృద్ధి చేసుకున్నాం.
==> రూ.22 కోట్లతో హైదరాబాద్‌లో సేవాలాల్ బంజారా భవన్ నిర్మించుకున్నాం
==> తెలంగాణకు ట్రైబల్ సబ్ ప్లాన్ నిధులు కేంద్రం ఇవ్వటం లేదు

12:58 PM

వీవోఏ ఉద్యోగుల జీతాలు పెంచాలని ఎమ్మెల్యే సీతక్క రిక్వెస్ట్

 

 

12:08 PM

అసెంబ్లీలో మంత్రి హరీశ్ రావు ప్రసంగం

 

12:07 PM

సీఎం కేసీఆర్ నాయకత్వంలో తలసరి ఆదాయంలో తెలంగాణ అగ్రస్థానంలో ఉందని మంత్రి హరీశ్ రావు అన్నారు. ఎనిమిది రాష్ట్రాలు దాటి ముందుకు వచ్చామని అన్నారు. తెలంగాణ తలసరి ఆదాయం రూ.3.12 లక్షలు చేరడం ప్రభుత్వ పనితీరుకు నిదర్శనమని అన్నారు. దేశంతో పోల్చితే 20 శాతం అదనంగా మన మూలధన వ్యయం ఉందన్నారు. దేశంలో అతి తక్కువ అప్పులు తీసుకున్న రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటి అని చెప్పారు. అప్పులు తీసుకోవడంలో తెలంగాణ కింది నుంచి 5వ స్థానంలో ఉందని తెలిపారు.
 

10:30 AM

ప్రభుత్వానికి కనిపిస్తున్న ఆదాయ మార్గాలు రెండే ఉన్నట్లు కనిపిస్తున్నాయని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు.

- ఒకటి ప్రభుత్వ భూములు అమ్మకం
- రెండు మద్యం వ్యాపారం 

==> ఐటీ ఎగుమతుల్లో తెలంగాణ వాటా 44 శాతం అని చెబుతున్నారు.. కానీ తెలంగాణ ఉద్యోగుల వాటా ఎంత..? 
==> తెలంగాణ వచ్చిన తర్వాత పాలకులు మారారు తప్పా.. ప్రజల జీవన స్థితగతుల్లో ఎలాంటి మార్పు రాలేదు 
==> ఏపీలో పరిశ్రమలు ఏర్పాటు చేస్తే స్థానికులకు అవకాశాలు కల్పిస్తున్నారు..తెలంగాణలో మాత్రం అలాంటి పరిస్థితి లేదని అన్నారు.

 

10:25 AM

శాసనసభలో  ఈరోజు ఒకే అంశంపై స్వల్పకాలిక చర్చ నిర్వహించనున్నారు.

1) రాష్ట్రంలో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం తీసుకున్న చర్యలు మరియు రాష్ట్రంలో పల్లె ప్రగతి పట్టణ ప్రగతి ద్వారా వచ్చిన ఫలితాలు 

శుక్రవారం శాసనసభలో ప్రవేశపెట్టిన మరో మూడు బిల్లులను ఈరోజు చర్చించి ఆమోదించనున్నారు. 

1) ది తెలంగాణ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ బిల్ 2023ను  ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు శాసనసభలో చర్చకు ప్రవేశపెట్టి సభ ఆమోదం కోరనున్నారు.

2) ది ఫ్యాక్టరీస్ అమెండ్మెంట్ బిల్ 2023ను  కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి శాసనసభలో చర్చకు ప్రవేశపెట్టి సభ ఆమోదం కోరనున్నారు.

3) తెలంగాణ మైనార్టీ కమిషన్ సవరణ బిల్లు 2023ను మైనార్టీ వెల్ఫేర్ మంత్రి  కొప్పుల ఈశ్వర్ శాసనసభలో చర్చకు ప్రవేశపెట్టి సభ ఆమోదం కోరనున్నారు.

10:23 AM

శాసనసభలో కూడా తొలుత ప్రశ్నోత్తరాలకు సమయంలో  కేటాయించారు. ఇందులో 10 ప్రశ్నలు చర్చకు రానున్నాయి. 

1) హరితవనాల పెంపు

2) రాష్ట్రంలో పామాయిల్ తోటల పెంపకం

3) నూతన వైద్య కళాశాల ఏర్పాటు

4) సింగరేణి బొగ్గు గనుల వేలం

5) తలసరి ఆదాయం పెరుగుదల

6) మిషన్ భగీరథ పథకం కోసం రుణాలు

7) గ్రామ పంచాయతీలుగా తండాలు, గిరిజన ఆదివాసి గూడెములు.

8) నూతన వ్యవసాయ కళాశాలల ఏర్పాటు

9) దెబ్బతిన్న రహదారులు మరియు  కల్వర్టులకు మరమ్మతులు.

10) అనంత పద్మనాభ స్వామి దేవాలయ పునర్నిర్మాణం

10:22 AM

ఈరోజు శాసనమండలిలో  గవర్నర్  తిప్పి పంపిన నాలుగు బిల్లును మండలిలో ఈరోజు ప్రవేశపెట్టి ఆమోదించనున్నారు. 

ఈ బిల్లులను నిన్న శాసనసభలో మరోసారి ప్రవేశపెట్టి ఆమోదించారు. 

1) తెలంగాణ మున్సిపల్ చట్ట సవరణ బిల్లు 2022ను  రీ కన్సిడరేషన్ కోసం సభలో ప్రవేశ పెట్టనున్న మంత్రి కేటీఆర్

2) తెలంగాణ పబ్లిక్ ఎంప్లాయిమెంట్ రెగ్యులేషన్ చట్ట సవరణ బిల్లు 2022 రీకన్సిడరేషన్ కోసం సభలో ప్రవేశపెట్టనున్న రాష్ట్ర మంత్రి తన్నీరు హరీష్ రావు 

3) తెలంగాణ స్టేట్ ప్రైవేట్ యూనివర్సిటీస్ ఎస్టాబ్లిష్‌మెంట్ అండ్ రెగ్యులేషన్ అమెండ్మెంట్  బిల్ 2022ను సభలో రికన్సిడరేషన్  కోసం ప్రవేశపెట్టనున్న విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి 

4) తెలంగాణ పంచాయతీరాజ్ చట్ట సవరణ బిల్లు 2023ను రిఫరెన్స్ కోసం సభలో ప్రవేశపెట్టనున్న పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు  
 

10:19 AM

మండలంలో మూడు అంశాలపై పేపర్స్ టేబుల్ చేయనున్నారు.

1) మంత్రి గంగుల కమలాకర్, తెలంగాణ స్టేట్ ఫుడ్ కమిషన్ వార్షిక నివేదిక 2021-22

2) మంత్రి జగదీశ్ రెడ్డి, తెలంగాణ స్టేట్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ వార్షిక నివేదిక 2021-22

3) మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి తెలంగాణ స్టేట్ స్టేట్ గవర్నమెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ ఆఫ్ ది ఇయర్ 2019-20 వార్షిక నివేదికను మండలిలో టేబుల్ చేయనున్నారు. 

10:18 AM

మూడోరోజు  తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు

శనివారం ఉదయం 10 గంటలకు ఉభయ సభలు ప్రారంభమయ్యాయి.

శాసనమండలి శాసనసభలో  ఉదయం తొలుత ప్రశ్నోత్తరాలకు సమయం కేటాయించారు. 

శాసనమండలిలో ప్రశ్నోత్తరాల సమయంలో. 

1) జీహెచ్ఎంసీ ప్రాంతంలో ఫ్లై ఓవర్లు, లింకు రోడ్ల నిర్మాణం 

2) ఎస్సీలకు ప్రీ, పోస్ట్ మెట్రిక్ స్కాలర్‌షిప్‌ 

3) జీహెచ్ఎంసీ పరిధిలో ఇళ్ల స్థలాల క్రమబద్ధీకరణ, రిజిస్ట్రేషన్

4) చేపల పెంపకం, ఉత్పత్తి

5) పారిశ్రామిక సముదాయాల ఏర్పాటు

6) అత్యంత వెనుకబడిన తరగతుల (ఎంబీసీలు) వారికి ఆర్థిక సహాయం

7) హైదరాబాదులోని పాతబస్తీలో రహదారుల నిర్మాణం 

8) బీసీ కుల వృత్తిదారులకు ఆర్థిక సహాయం 

9) దళిత బంధు పథకం 

10) గొర్రె యూనిట్ల పంపిణీ  

14:44 PM

"ధరణి వద్దు.. చెక్ డ్యామ్‌లు వద్దు అంటారు.. 24 గంటల కరెంట్ వద్దు అంటారు.. వీళ్లేంది అధ్యక్షా..! వద్దు అనేవారే కాంగ్రెస్‌ను ఆదరిస్తారు. లేదంటే మమ్మల్ని ఆదరిస్తారు. ధరణి వద్దు అంటారు కానీ అదే ధరణితో ఇవాళ ఒక్క కోటిపై చిలుకు రైతులకు రైతు బీమా వర్తిస్తుంది. మరి ధరణి వద్దు అంటే ఈ రైతు బీమా ఎలా వస్తుంది..? శ్రీధర్ బాబు గారు చెక్ డ్యామ్‌లు వద్దు అని ఆన్ రికార్డ్‌గా అన్నారు కావాలి అంటే చెక్ చేయండి సార్. ధరణి వలన రైతుల భూములు రైతులకే ఉంటాయి. ముఖ్యమంత్రి కూడా వాళ్ళ భూములను మార్చలేరు." అని అసెంబ్లీలో మంత్రి హరీష్‌ రావు అన్నారు.

13:53 PM

వాడివేడి వాదనలు

అసెంబ్లీలో భారీ వర్షాలతో నష్టపోయిన రైతులకు న్యాయం చేయాలని కాంగ్రెస్ నేతల డిమాండ్ చేశారు. ప్రభుత్వ తీరుపై  సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, శ్రీధర్ బాబు ఆగ్రహం చేశారు. మంత్రులు హరీశ్ రావు, వేముల ప్రశాంత్ రెడ్డి ఎదురుదాడికి దిగారు. కాంగ్రెస్‌కు సడెన్‌గా రైతులపై ప్రేమ ఎందుకని ఫైర్ అని అన్నారు. 3 గంటలు కరెంట్ చాలు అన్నారని.. మీరా చెప్పేది..? అని ప్రశ్నించారు.

12:52 PM

==> అసెంబ్లీ వద్ద ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. అసెంబ్లీ ముట్టడికి ఎన్‌ఎస్‌యూఐ నేతలు యత్నించారు. విద్యారంగ సమస్యలను వెంటనే పరిష్కరించాలని వారు డిమాండ్‌ చేశారు. ఎన్‌ఎస్‌యూఐ నేతలను పోలీసులు అడ్డుకుని.. పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
 

12:13 PM

అసెంబ్లీలో మంత్రి కేటీఆర్ ప్రసంగం

 

11:16 AM

తెలంగాణలో కులగజ్జి, మత పిచ్చి లేదు: మంత్రి కేటీఆర్

==> స్టేబుల్ గవర్నెన్స్ కేసీఆర్ నాయకత్వంలో ఉంది 
==> బెంగుళూర్‌ను వెనక్కి నెట్టి ఐటీలో, ఉద్యోగ కల్పనలో తెలంగాణ నెంబర్ వన్‌గా ఉంది 
==> ప్రతిపక్షాలు కూడా ఐటీ అభివృద్ధిని అభినందించాల్సిందే.. 
==> 44 శాతం ఉత్పత్తి హైదరాబాద్ నుంచే..
==> రజినీకాంత్ లాంటి వ్యక్తి కూడా హైదరాబాద్ గురించి చెప్పారు
==> కానీ కొంత మంది ఇంకా కళ్లు తెరవడం లేదు 
==> 1987లోనే ఇంటర్ గ్రాఫ్ పేరుతో ఐటీ ఏర్పడింది 
==> మేమే తెచ్చాం అని చెప్పుకునే వారు తెలుసుకోవాలి
==> ఈటలకు కూడా తెలవాలి. 

 

11:01 AM

ఐటీ ఎగుమతులు భారీ పెరిగాయి: మంత్రి కేటీఆర్

రాష్ట్రంలో ఐటీ ఎగుమ‌తులు భారీగా పెరుగుతున్నాయన్నారు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్. తెలంగాణ‌లో మ‌తాల పంచాయ‌తీ లేదని.. కులాల మ‌ధ్య కొట్లాట లేవని అన్నారు.  ద‌మ్మున్న నాయ‌కుడు కేసీఆర్ ఉండ‌టంతోనే రాష్ట్ర అభివృద్ధిలో దూసుకుపోతుందన్నారు. గతేడాది తెలంగాణ సర్కార్ ఐటీ రంగంలో 57 వేల 707 కోట్ల ఐటీ ఎగుమతులు సాధించిందని తెలిపారు. కొత్త రాష్ట్రం వచ్చాక 6 లక్షలకు పైగా ఐటీ ఉద్యోగాలు వచ్చాయని తెలిపారు. రాష్ట్రంలో భూముల రేట్లు బాగా పెరిగాయన్న మంత్రి కేటీఆర్.. ఇవాళ ఎక‌రం ధ‌ర 100 కోట్లు ప‌లుకుతోందని గుర్తు చేశారు. 

10:44 AM

అసెంబ్లీలో మంత్రి కేటీఆర్ ప్రసంగం

 

 

09:22 AM

సభలో ప్రవేశపెట్టే బిల్లులు

1) ది తెలంగాణ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ బిల్ 2023ను ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు ప్రవేశపెడతారు. 

2) ది ఫ్యాక్టరీస్ అమెండ్మెంట్ బిల్ 2023ను కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి ప్రవేశపెడతారు. 

3) తెలంగాణ మైనార్టీ కమిషన్ చట్ట సవరణ బిల్లు 2023ను మంత్రి కొప్పుల ఈశ్వర్ ప్రవేశపెడతారు.

గతంలో శాసనసభ శాసనమండలి ఆమోదించిన నాలుగు బిల్లులను తిప్పి పంపిన గవర్నర్.. వాటిని మరోసారి సభలో ప్రవేశపెట్టి చర్చించి గవర్నర్ ఆమోదానికి పంపమన్నారు.

4) తెలంగాణ మున్సిపల్ చట్ట సవరణ బిల్లు 2022ను రీ కన్సిడరేషన్ కోసం సభలో మంత్రి కేటీఆర్ ప్రవేశపెడతారు.

5) తెలంగాణ పబ్లిక్ ఎంప్లాయిమెంట్ రెగ్యులేషన్ చట్ట సవరణ బిల్లు 2022ను రీకన్సిడరేషన్ కోసం సభలో రాష్ట్ర మంత్రి తన్నీరు హరీష్ రావు ప్రవేశపెడతారు

6) తెలంగాణ స్టేట్ ప్రైవేట్ యూనివర్సిటీస్ ఎస్టాబ్లిష్‌మెంట్ అండ్ రెగ్యులేషన్ అమెండ్‌మెంట్  బిల్ 2022ను సభలో రీకన్సిడరేషన్  కోసం విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రవేశపెడతారు

7) తెలంగాణ పంచాయతీరాజ్ చట్ట సవరణ బిల్లు 2023ను రీకన్సిడరేషన్ కోసం సభలో పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ప్రవేశపెడతారు. 

గవర్నర్ తిరస్కరణ గురై వెనక్కి వచ్చిన నాలుగు బిల్లును వెంటనే సభలో ఆమోదానికి కోరనున్న ఆయా శాఖల మంత్రులు

09:19 AM

రెండో రోజు సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వం ఏడు కీలక బిల్లులను సభలో ప్రవేశపెట్టనుంది.

ఇందులో నాలుగు బిల్లులు గతంలో ఉభయ సభలలో చర్చించి ఆమోదించి గవర్నర్ సంతకం కోసం పంపితే .. వెనక్కి వచ్చిన బిల్లులు ఉన్నాయి. 

09:18 AM

శాసనసభలో రెండు అంశాలపై స్వల్పకాలిక చర్చ నిర్వహించనున్నారు.

1) రాష్ట్రంలో అధిక వర్షపాతం వల్ల కలిగే ఇబ్బందులు ప్రభుత్వం చేపట్టిన చర్యలపై చర్చ.

2) రాష్ట్రంలో విద్య వైద్య రంగాల బలోపేతం కోసం ప్రభుత్వం చేపట్టిన చర్యలు సాధించిన పురోగతిపై చర్చ. 

09:16 AM

శాసనసభలో సమావేశాలు రెండో రోజు మరణించిన ఐదుగురు మాజీ ఎమ్మెల్యేలకు స్పీకర్ సంతాప ప్రకటన చేయనున్నారు. మాజీ ఎమ్మెల్యేలు విజయ రామారావు, కొమిరెడ్డి రాములు, కొత్తకోట దయాకర్ రెడ్డి, సోలిపేట రామచంద్ర రెడ్డి, చిలుకూరి రామచంద్రారెడ్డిలకు సంతాపం తెలపనున్నారు.

09:14 AM

శాసనసభలో కూడా తొలుత ప్రశ్నోత్తరాలకు సమయంలో  కేటాయించారు. ఇందులో 10 ప్రశ్నలు చర్చకు రానున్నాయి..

1) ఐటీ ఎగుమతులు

2) రాష్ట్రంలో గురుకుల పాఠశాలు కళాశాలు

3) చార్మినార్ పాదచారుల రోడ్డు అభివృద్ధి ప్రాజెక్టు

4) ఆరోగ్య లక్ష్మి పథకం.

5) హైదరాబాద్ నగర పాలక సంస్థ పరిధిలో వ్యూహాత్మక రహదారుల అభివృద్ధి పనులు.

6) భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ

7) వెనుకబడిన తరగతులకు చెందిన కులవృత్తుల సామాజిక వర్గాలకు ఆర్థిక సహాయం.

8) గొర్రెల జనాభా పెరుగుదల.

9) సమీకృత జిల్లా కార్యాలయ భవన సముదాయాలు.

10) దేశంలో ప్రముఖ విద్యాసంస్థల్లో బీసీ విద్యార్థులకు పూర్తి ఫీజు చెల్లింపు.
 

09:13 AM

శాసన మండలిలో వీటిపై స్వల్పకాలిక చర్చలు

1) తెలంగాణలో సంక్షేమ రంగంలో పేదరికం నిర్మూలన కోసం తీసుకున్న చర్యలు.. సాధించిన పురోగతిపై చర్చించనున్నారు. 

09:12 AM

శాసనమండలిలో ప్రశ్నోత్తరాల సమయంలో ఈ ప్రశ్నలు చర్చకు రానున్నాయి. 

1) హరితహారం కార్యక్రమం.

2) నూతన వైద్య కళాశాల మంజూరు

3) పంటల బీమా పథకం

4) పల్లె ప్రగతి కార్యక్రమం

5) ఆసరా పింఛను పథకం

6) హైదరాబాదులోని పాతబస్తీలో అప్రకటిత విద్యుత్ కోతను. 

7) వ్యవసాయ రంగ అభివృద్ధి

8) గురుకులాలకు భవనాలు బిజెపి ఏవి ఎన్ రెడ్డి
 
9) కేసీఆర్ న్యూట్రిషన్ కిట్స్

10) బీరప్ప స్వామి ఆలయాలకు ఆర్థిక సహాయం ప్రశ్నలు చర్చకు రానున్నాయి.

Read More