Home> తెలంగాణ
Advertisement

KTR Letter To Revanth: ఆటో డ్రైవర్లు చస్తుంటే కనికరం లేదా సీఎం రేవంత్‌ రెడ్డి? మాజీ మంత్రి కేటీఆర్‌ లేఖ

Auto Workers Free Bus: అధికారం కోల్పోయిన తర్వాత బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్‌ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. కాంగ్రెస్‌ ఇచ్చిన మేనిఫెస్టోపై నిలదీస్తూనే ఉన్నారు. తాజాగా మరో అంశంపై కేటీఆర్‌ కాంగ్రెస్‌ను నిలదీశారు. అయితే ఈసారి రేవంత్‌ రెడ్డికి లేఖరూపంలో విజ్ఞప్తి చేయడం విశేషం.

KTR Letter To Revanth: ఆటో డ్రైవర్లు చస్తుంటే కనికరం లేదా సీఎం రేవంత్‌ రెడ్డి? మాజీ మంత్రి కేటీఆర్‌ లేఖ

KTR Questioned Revanth Reddy: తెలంగాణలో ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించడంతో ఆటో డ్రైవర్ల ఉపాధిపై తీవ్ర ప్రభావం పడింది. ఆటో కార్మికుల బతుకు దినదిన గండంగా మారింది. తమ బతుకు కష్టమవడంతో ఇటీవల ప్రజా భవన్‌ ముందు ఓ ఆటో డ్రైవర్‌ తన ఆటోను దగ్ధం చేసుకున్న విషయం తెలిసిందే. ఆటో డ్రైవర్ల దీనస్థితిపై బీఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ స్పందించారు. ప్రభుత్వ ఉదాసీన వైఖరిని ప్రశ్నిస్తూ కేటీఆర్‌ లేఖ రాశారు. ఆటో డ్రైవర్లను ఆదుకోరా అని రేవంత్‌ రెడ్డిని లేఖలో ప్రశ్నించారు.

15 మంది ఆటోడ్రైవర్లు ఆత్మహత్య చేసుకున్నారని కేటీఆర్‌ ఆవేదన వ్యక్తం చేశారు. ఉపాధి లేక ప్రజాభవన్ ముందే ఆటోను తగలబెట్టుకున్నా కనికరించరా? అని నిలదీశారు. ఆత్మహత్య చేసుకున్న ఆటో డ్రైవర్ల కుటుంబాలకు  ప్రభుత్వం వెంటనే  10 లక్షల నష్ట పరిహారం చెల్లించాలని డిమాండ్‌ చేశారు. ఉచిత బస్సుతో ఉపాధి కోల్పోయిన ప్రతి ఆటో డ్రైవర్ కుటుంబానికి  నెలకు రూ.10 వేల ఆర్థిక సహాయాన్ని అందించాలని లేఖలో కోరారు. ప్రజాపాలన తెస్తామని అడ్డగోలు హామీలతో అధికారంలోకి వచ్చిన మీ ప్రభుత్వం ప్రజా వ్యతిరేకిగా మారిపోయిందని విమర్శించారు. అనాలోచిత విధానాలతో, ఒక హామీ అమలుచేసే హడావుడిలో మరో వర్గాన్ని తీవ్రంగా దెబ్బతీస్తున్న తీరు మీ పాలనా వైఫల్యాన్ని కళ్లకు కడుతోందని దెప్పి పొడిచారు. దీనికి నిలువెత్తు నిదర్శనమే ఆటోడ్రైవర్ల సంక్షోభం అని గుర్తుచేశారు.

తమ పాలనలో సబ్బండవర్గాలు సంతోషంగా ఉంటే.. కేవలం మీ 55 రోజుల పరిపాలనలో సమాజంలోని అనేక వర్గాలు ఆగమవుతున్నాయని కేటీఆర్‌ వివరించారు. ఆటో డ్రైవర్లు మీ వల్ల రోడ్డున పడ్డారని గుర్తుచేశారు. ఆటో డ్రైవర్లు అన్నమో రామచంద్ర అంటుంటే వారి ఆవేదన మీకు పట్టదా అని లేఖలో ప్రశ్నించారు. ఉచిత బస్సు పథకంతో ఆటో డ్రైవర్లు పడుతున్న దీన పరిస్థితులను లేఖలో కేటీఆర్‌ వివరించారు. ఆటో కార్మికుల బలవన్మరణాలపై ఆవేదన వ్యక్తం చేశారు. మానవతా దృక్పథంతో స్పందించి ఆటో కార్మికులను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని లేఖలో కోరారు.

అన్నం పెట్టిన ఆటో ఆకలి మంటల్లో కాలిపోయిన ఉదంతాన్ని చూసిన తరువాతైనా పరిస్థితి అర్థం చేసుకోవాలని కేటీఆర్‌ సూచించారు. రాష్ట్రంలోని 6.50 లక్షలాది మంది ఆటోడ్రైవర్ల పక్షాన ప్రశ్నిస్తున్నట్లు తెలిపారు. ఎన్నికల ప్రచారంలో రాహుల్ గాంధీ ఆటోలో ప్రయాణాన్ని కేటీఆర్‌ ప్రస్తావించారు. ప్రజాభవన్ అని పేరు మారిస్తే సరిపోదని.. ఆచరణలో చిత్తశుద్ధి ఉంటేనే ప్రజలు హర్షిస్తారని గుర్తు చేశారు. ప్రజాభవన్ ముందే ఆటోకు ఒక డ్రైవర్ నిప్పుపెట్టుకున్నా మీరు ఇప్పటివరకు స్పందించకపోవడం అత్యంత దురదృష్టకరమని కేటీఆర్‌ పేర్కొన్నారు. వెంటనే ఆటోడ్రైవర్లను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. స్పందించకపోతే ఆరున్నర లక్షల మంది  ఆటోడ్రైవర్లతో కలిసి ఉద్యమం చేస్తామని హెచ్చరించారు.

Also Read: King Cobra on Fan: ఒళ్లు గగుర్పొడిచే వీడియో.. ఇంట్లో ఫ్యాన్‌పై తిరుగుతూ కింగ్‌ కోబ్రా హల్‌చల్‌

Also Read: Drunker Ambulance Call: తాగుబోతు అతి తెలివి.. నడవలేక అంబులెన్స్‌కు ఫోన్‌ చేసి పిలుపు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Read More