Home> తెలంగాణ
Advertisement

Kamareddy Road Accident: కామారెడ్డిలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు అక్కడికక్కడే మృతి...

Kamareddy Road Accident: కామారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆర్టీసీ బస్సు-కారు ఢీకొన్న ఘటనలో ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందారు. 

 Kamareddy Road Accident: కామారెడ్డిలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు అక్కడికక్కడే మృతి...

Kamareddy Road Accident: కామారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆర్టీసీ బస్సు-కారు ఢీకొన్న ఘటనలో ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మ‌రో చిన్నారికి తీవ్ర గాయాల‌య్యాయి. మాచారెడ్డి మండ‌ల ప‌రిధిలోని ఘ‌న్‌పూర్ గ్రామ శివారులో సోమవారం (మార్చి 29) ఉదయం ఈ ప్రమాదం జరిగింది. 

ప్రమాద సమాచారం అందిన వెంటనే పోలీసులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్నారు. గాయపడ్డ చిన్నారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. మృతదేహాలను పోస్టుమార్టమ్ నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు తెలుస్తోంది. ఆర్టీసీ బస్సు టైర్ పేలడంతో ఒక్కసారిగా అదుపు తప్పి కారును ఢీకొట్టినట్లు పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైంది. 

బస్సు ఢీకొట్టడంతో కారులో ప్రయాణిస్తున్న ఐదుగురు మృతి చెందారని పోలీసులు వెల్లడించారు. మృతులను రాధాకృష్ణ, కల్పన, సువర్ణ, శ్రీరామ్‌గా తెలిపారు. వీరంతా ఒకే కుటుంబానికి చెందినవారని పేర్కొన్నారు. కరీంనగర్ డిపో-1కి చెందిన ఆర్టీసీ పల్లె వెలుగు బస్సు సిరిసిల్ల నుంచి కామారెడ్డి వెళ్తుండగా ప్రమాదం జరిగినట్లు తెలిపారు. ప్రమాదానికి గురైన కారు నంబర్ 'TS 16 FB 4366'గా వెల్లడించారు. ఈ ప్రమాద ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. 

రెండు రోజుల క్రితం ఇదే కామారెడ్డి జిల్లాలోని రామేశ్వరంపల్లిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి చెందిన సంగతి తెలిసిందే. బైక్‌పై వెళ్తున్న యువకులను లారీ ఢీకొట్టడంతో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. ప్రమాదం తర్వాత యువకుల మృతదేహాలను లారీ రోడ్డుపై 20 మీటర్ల వరకు ఈడ్చుకెళ్లింది. ప్రమాద ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

Also Read: Will Smith: భార్యపై జోకులు.. స్టేజ్ పైనే హోస్ట్ చెంప పగలగొట్టిన స్టార్ హీరో! కేసు నమోదు.. (వీడియో)!

Also Read: Oscar Awards 2022: లాస్ ఏంజిల్స్‌లో ఘనంగా ఆస్కార్ అవార్డుల ప్రదానం, ఆస్కార్ అవార్డు విజేతల జాబితా ఇదే

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Read More