Home> తెలంగాణ
Advertisement

Jagtial Govt Hospital: డెలివరి కోసం హాస్పిటల్‌కి వెళ్తే.. కడుపులో బట్ట పెట్టి కుట్లేశారు

Doctors Forgot Cloth in Pregnant Woman Stomach: నిజామాబాద్ జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో స్టెచర్ లేకపోవడంతో రోగిని ఈడ్చుకెళ్లిన ఘటన జాతీయ స్థాయిలో పతాక శీర్షికలకెక్కిన ఘటన ఇంకా మరువక ముందే జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రి వైద్యుల నిర్వాకం ఇలా బయటపడింది. ప్రసవం కోసం ఆస్పత్రికి వచ్చిన గర్భిణికి డెలివరి అనంతరం కడుపులో బట్ట పెట్టి కుట్లేసిన ఘటన ఇది. 

Jagtial Govt Hospital: డెలివరి కోసం హాస్పిటల్‌కి వెళ్తే.. కడుపులో బట్ట పెట్టి కుట్లేశారు

Doctors Forgot Cloth in Pregnant Woman Stomach: జగిత్యాల: మూడవ కాన్పు కోసం ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లిన ఓ మహిళకు ఆపరేషన్ చేసి ప్రసవం చేసిన సమయంలో వైద్యులు కడుపులో బట్ట మరిచిపోయి కుట్లు వేసిన ఘటన జగిత్యాల జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రిలో చోటుచేసుకుంది. కామారెడ్డి జిల్లా బాన్సువాడకు చెందిన నవ్య శ్రీ అనే మహిళను జగిత్యాలకు చెందిన ఓ యువకుడితో వివాహం చేశారు. ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాత నవ్యశ్రీ మూడవ కాన్పు కోసం జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో చేరారు. ఆపరేషన్ చేసి బిడ్డను తీసిన వైద్యులు ఆమె కడుపులో బట్టలు అలాగే ఉంచేసి కుట్లు వేశారు. 14 నెలల తర్వాత కడుపులో ఉన్న బట్ట కారణంగా ఇన్ఫెక్షన్ కావడంతో రక్తస్రావం జరిగి ఆ మహిళ భరించలేని కడుపునొప్పితో తీవ్ర ఇబ్బందుల బారినపడింది. 

కడుపునొప్పితో బాధపడుతూ నిజామాబాద్ హాస్పిటల్లో చూపించుకోగా అక్కడ స్కానింగ్ చేసిన వైద్యులు..  ఆమె కడుపులో బట్ట ఉన్నట్టుగా గుర్తించారు. నవ్య శ్రీ భర్త తనకు తెలిసిన వైద్యుల సహకారంతో వేములవాడ నందిని ప్రైవేటు ఆసుపత్రిలో ఆపరేషన్ చేసి ఆమె కడుపులో ఉన్న బట్టను తొలగించారు. దీంతో పాటు కడుపులో ఇన్ఫెక్షన్ కారణంగా చెడిపోయిన భాగాలను సరిచేశారు. ప్రస్తుతం ఆమె బాన్సువాడ పట్టణంలో పుట్టింట్లో తల్లి వద్ద కోలుకుంటోంది. 

జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రి వైద్యుల నిర్లక్ష్యం కారణంగా అనేక ఇబ్బందులు పడ్డ ఆ మహిళ సుమారు లక్ష రూపాయల వరకు ఆస్పత్రిలో ఖర్చు చేసుకోవాల్సిన దుస్థితి ఏర్పడింది. ముగ్గురు పిల్లలతో ఇబ్బందులు పడుతున్న ఆ మహిళకు ప్రస్తుతం పుట్టింటివారే అన్నీ తామై సపర్యలు చేస్తున్నారు. జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రి వైద్యుల కారణంగా నష్టపోయిన తమకు నష్ట పరిహారం ఇప్పించాలని నవ్య శ్రీ తల్లిదండ్రులు కోరుతున్నారు. 

ఇది కూడా చదవండి : Minister Singireddy Niranjan Reddy: తనకు ఆ ఆస్తుల ఎలా వచ్చాయో చెప్పిన మంత్రి నిరంజన్ రెడ్డి

నిజామాబాద్ జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో స్టెచర్ లేకపోవడంతో రోగిని ఈడ్చుకెళ్లిన ఘటన జాతీయ స్థాయిలో పతాక శీర్షికలకెక్కిన ఘటన ఇంకా మరువక ముందే జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రి వైద్యుల నిర్వాకం ఇలా బయటపడింది. ఇలాంటి నిర్లక్ష్యపు ఘటనల వల్ల ప్రభుత్వాసుపత్రుల్లో పనిచేసే వైద్యులు, సిబ్బందికి చెడ్డ పేరు రావడమే కాదు.. మొత్తానికి ప్రభుత్వాస్పత్రి అంటేనే అమ్మో అనే జంకే పరిస్థితి ఏర్పడుతోంది.

ఇది కూడా చదవండి : BJP MLA Raghunandan Rao: కృష్ణా నది తీరం కబ్జా చేసి.. 165 ఎకరాల్లో మంత్రి ఫామ్ హౌజ్..

ఇది కూడా చదవండి : Teenmar Mallanna New Party: జైలు నుంచి విడుదలైన తీన్మార్ మల్లన్న.. కొత్త పార్టీ పేరు ప్రకటన

Read More