Home> తెలంగాణ
Advertisement

హైద్రాబాద్‌పై అమెరికన్‌ శాటిలైట్‌ నిఘా !

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ముద్దుల కుమార్తె.. ఇవాంకా ట్రంప్ హైదరాబాద్ రానున్నవేళ ఆమెకు అసాధారణ భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు.  హైదరాబాద్ లో ప్రత్యేక డ్రోన్లు, నిఘా కెమెరాలు ఉంచి ఇవాంకా పర్యటనను, ఆమె పరిసర ప్రాంతాల్ని పర్యవేక్షిస్తుంటారు.

హైద్రాబాద్‌పై అమెరికన్‌ శాటిలైట్‌ నిఘా !

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ముద్దుల కుమార్తె.. ఇవాంకా ట్రంప్ హైదరాబాద్ రానున్నవేళ ఆమెకు అసాధారణ భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. తీవ్రవాద సంస్ధల నుంచి ఆమెకు ముప్పు పొంచి ఉన్నది కనుకే.. ఇటుంవటి అసాధారణ భద్రతా ఏర్పాట్లు చేస్తున్నట్లు పోలీస్ వర్గాలు పేర్కొంటున్నాయి. ఆమె పర్యటనలో ఏ చిన్న పొరపాటుకు తావులేకండా అమెరికా సీక్రెట్ సర్వీస్  కూడా పర్యవేక్షిస్తుంది.ఇదిలా ఉండగా.. ఇవాంకా కోసం మూడు లీమోజిన్ కార్లు త్వరలో హైదరాబాద్ కు చేరనున్నాయి. తుపాకీ, మందుపాతర, జీవ, రసాయన, రాకెట్ దాడుల నుంచి రక్షించే అత్యాధునిక సదుపాయాలు ఈ కార్లలో అందుబాటులో ఉంటాయి. ఇవాంకా అన్ని కార్యక్రమాలకు ఈ కారునే ఉపయోగించనున్నారు.

అవసరాలు తీర్చేందుకు.. 

ఇవాంకా అవసరాలు తీర్చేందుకు ఇప్పటికే  ముంబై, చెన్నై, ఢిల్లీ అమెరికా రాయబార కార్యాలయాల నుండి 100 మందికి పైగా ఉద్యోగులు హైదరాబాద్ చేరుకున్నారు. వీరిలో 20 మంది వంటోళ్లు ఉన్నారు. ఆమె ప్రభుత్వం ఇచ్చే విందు తప్ప మిగితా అన్ని సమయాల్లో వీరు ఇచ్చే ఆహారాన్నే తీసుకుంటారు. ఆమెకోసం ఏకంగా అమెరికా నుంచే వంట దినుసులు తెప్పిస్తున్నారని సమాచారం.

నిఘా నీడల్లో.. 

ఇవాంకా పర్యటన అంతా శ్వేత సౌధం నుంచే గమనిస్తుంది అమెరికా భద్రతా దళం. హైదరాబాద్ లో ప్రత్యేక డ్రోన్లు, నిఘా కెమెరాలు ఉంచి ఇవాంకా పర్యటనను, ఆమె పరిసర ప్రాంతాల్ని పర్యవేక్షిస్తుంటారు. ఏకంగా హైదరాబాద్ పైనే ప్రవేట్ గా శాటిలైట్ ను లాంచ్ చేసారని వినికిడి. భద్రత దృష్ట్యా ఇప్పటికే ఇవాంకా బస చేసే వెస్టిన్ హోటల్ సిబ్బంది వివరాలు అమెరికాకు వెళ్లాయట. ఏదైనా జరక్కూడనిది జరిగితే.. ఎలా రియాక్ట్ అవ్వాలో కూడా వైట్ హౌస్ నుంచే ఆదేశాలు ఇవ్వనున్నారు. ఇవాంకా కోసం విధుల్లో పాల్గొనేవారందికీ గుర్తింపు కార్డులు తప్పనిసరి.

Read More