Home> తెలంగాణ
Advertisement

Mallareddy: మల్లారెడ్డి ఇంటి వద్ద అర్ధరాత్రి హైడ్రామా.. ఐటీ అధికారులపై మంత్రి ఫిర్యాదు..

IT Rides On MallaReddy: రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి, ఆయన బంధువుల ఇళ్లలో ఆదాయ పన్ను శాఖ అధికారులు చేపట్టిన తనిఖీలు ముగిశాయి. దీనికి సంబంధించి బుధవారం అర్ధరాత్రి హైడ్రామా చోటుచేసుకుంది. మంత్రి మల్లారెడ్డికి, ఐటీ అధికారుల మధ్య వాగ్వాదం జరిగింది.
 

Mallareddy: మల్లారెడ్డి ఇంటి వద్ద అర్ధరాత్రి హైడ్రామా.. ఐటీ అధికారులపై మంత్రి ఫిర్యాదు..

IT Rides On MallaReddy: రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి సంస్థలపై ఐటీ శాఖ చేపట్టిన సోదాలు ఉద్రిక్త పరిస్థితులకు దారి తీశాయి.  అర్ధరాత్రి దాటిన తర్వాత మంత్రి మల్లారెడ్డి ఇంటి వద్ద హైడ్రామా చోటు చేసుకుంది. తన కుమారుడు మహేందర్ రెడ్డిపై ఒత్తిడిచేసి ఆదాయపన్ను శాఖ అధికారులు కొన్ని కాగితాలపై సంతకాలు పెట్టించుకున్నారని మల్లారెడ్డి బోయినపల్లి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. 

మంత్రి మల్లారెడ్డి, అతని బంధువుల ఇళ్లలో ఐటీ శాఖ అధికారులు చేపట్టిన తనిఖీలు ముగిశాయి. బుధవారం రాత్రి ఆదాయపనున్న శాఖ అధికారులు తమ సోదాలను ముగించారు. అనంతరం మల్లారెడ్డి కుమారుడితో పంచనామాపై సంతకం పెట్టించుకున్నారు. ఈనేపథ్యంలో బుధవారం అర్థరాత్రి ఐటీ అధికారులకు, మంత్రి మల్లారెడ్డికి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. దీంతో మంత్రి హుటాహుటిన బయులుదేరి ఆస్పత్రికి వెళ్లి కుమారుడి నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు.  

ఈసందర్భంగా ఐటీ అధికారి రత్నాకర్ పై పోలీసులకు ఫిర్యదు చేశారు. వైద్య కళాశాలలకు మూడేళ్లలో వంద కోట్ల రూపాయల విరాళాలు తీసుకున్నట్లు తన కుమారుడితో బలవంతంగా సంతకం చేయించుకున్నారని మల్లారెడ్డి ఆరోపించారు. మల్లారెడ్డిపై ఐటీ అధికారులు దిండిగల్ పోలీసు స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చారు. తమ అధికారిని మల్లారెడ్డి నిర్బంధించారని..అతని నుంచి ల్యాప్ టాప్ కూడా లాక్కున్నారని వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మల్లారెడ్డి, ఆయన బంధువుల ఇళ్లలో 65 టీమ్ లతో 400 మంది అధికారులు 2 రోజుల పాటు తనిఖీలు నిర్వహించారు. ఐటీ అధికారులు ఈ సోదాల్లో రూ.10 కోట్ల 50 లక్షలు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది.  

Also Read: Mla Raghunandan Rao: అయ్యా దుబ్బాక ఎమ్మెల్యేను నేను.. ఆయనకు కొంచెం చెప్పండి.. కేసీఆర్‌కు రఘునందన్ రావు లేఖ 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

TwitterFacebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

 

Read More