Home> తెలంగాణ
Advertisement

IT RAIDS: కేటీఆరే టార్గెట్! ఫినిక్స్ రియల్ ఎస్టేట్ సంస్థలో ఐటీ సోదాలు

IT RAIDS: హైదరాబాద్ లో మరోసారి ఐటీ సోదాలు కలకలం రేపుతున్నాయి. హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న రియల్ ఎస్టేట్ కంపెనీ ఫీనిక్స్ కార్యాలయంపై ఐటీ అధికారులు దాడులు చేశారు. కంపెనీకి చెందిన 10 ప్రాంతాల్లో  సోదాలు జరుగుతున్నాయి.

IT RAIDS: కేటీఆరే టార్గెట్! ఫినిక్స్ రియల్ ఎస్టేట్ సంస్థలో ఐటీ సోదాలు

IT RAIDS: హైదరాబాద్ లో మరోసారి ఐటీ సోదాలు కలకలం రేపుతున్నాయి. హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న రియల్ ఎస్టేట్ కంపెనీ ఫీనిక్స్ కార్యాలయంపై ఐటీ అధికారులు దాడులు చేశారు. కంపెనీకి చెందిన 10 ప్రాంతాల్లో  సోదాలు జరుగుతున్నాయి. పలుచోట్ల వెంచర్స్, రియల్ ఎస్టేట్ ఇన్ ఫ్రాలో పెట్టుబడులు పెట్టింది ఫీనిక్స్. సంస్థ చైర్మెన్ , డైరెక్టర్ల నివాసాల్లోనూ ఐటీ అధికారుల సోదాలు జరుగుతున్నాయి. మాదాపూర్ లోని ఐటీ సెజ్ లోనూ తనిఖీలు కొనసాగుతున్నాయి. ఫినిక్స్  సంస్థ చైర్మెన్ చుక్కపల్లి సురేష్ కు రాజకీయ ప్రముఖులు, ఉన్నతాధికారులతో మంచి సంబంధాలు ఉన్నాయని తెలుస్తోంది. ఈ సంస్థలో చాలా మంది రాజకీయ ప్రముఖులు పెట్టుబడులు పెట్టారని సమాచారం. ఐటీని ఎగ్గొట్టారనే ఆరోపణలు రావడంతో సోదాలు జరుగుతున్నాయని చెబుతున్నారు.

ఫీనిక్స్ సంస్థలో సోదాలు తెలంగాణ మంత్రి, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ టార్గెట్ గానే జరుగుతున్నాయనే వార్తలు వస్తున్నాయి. ఫీనిక్స్ చైర్మెన్ చుక్కపల్లి సురేష్ కు కేటీఆర్ తో అత్యంత సన్నిహిత సంబంధాలు ఉన్నాయంటున్నారు. ఫీనిక్స్ సంస్థలో కేటీఆర్ భారీగా పెట్టుబడులు పెట్టారని తెలుస్తోంది. ఫీనిక్స్ కు ప్రయోజనం కలిగేలా రూల్స్ కు విరుద్ధంగా ప్రభుత్వం పలు నిర్ణయాలు తీసుకుందనే ఆరోపణలు ఉన్నాయి. ఫీనిక్స్ గ్రూప్ దాదాపు లక్షా 50 వేల కోట్ల వ్యాపారం చేస్తుందని తెలుస్తోంది. హైదరాబాద్ నగరంలోని వందలాది ఎకరాల భూములను ప్రభుత్వం ఫీనిక్స్ గ్రూప్ అప్పనంగా అప్పగించిందని సమాచారం.దీనిపై కేంద్రానికి ఫిర్యాదులు రావడంతో ఆరా తీసిన పెద్దలు భారీగా అక్రమాలు జరుగుతున్నాయని నిర్దారించారని తెలుస్తోంది. ఫీనిక్స్ సంస్థలో ఐటీ సోదాలతో అధికార టీఆర్ఎస్ పార్టీలో కలకలం రేపిందని అంటున్నారు.

Read also: TARGET KTR: ఫీనిక్స్ తో కేటీఆర్ ఫినిష్! పూర్తి ఆధారాలతో రంగంలోకి ఐటీ.. గులాబీ పార్టీలో కలవరం

Read also: TRS VS BJP: బీజేపీ నేతల్లారా ఇండ్లలో చెప్పి బయటికి రండి! టీఆర్ఎస్ మంత్రుల వార్నింగ్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

 

Read More