Home> తెలంగాణ
Advertisement

ED TARGET KCR: హైద‌రాబాద్ ఈడీకి పవర్ ఫుల్ ఆఫీసర్.. సీఎం కేసీఆర్ కు బిగుస్తున్న ఈడీ ఉచ్చు! గులాబీలో గుబులు..

ED TARGET KCR: హైదరాబాద్ ఈడీకి కొత్త అధికారిని నియమించింది కేంద్రం. తెలుగు రాష్ట్రాలపై మంచి పట్టున్న పవర్ ఫుల్ అధికారిని నియమించడంతో సీఎం కేసీఆర్ టార్గెట్ గా కేంద్రం స్కెచ్ వేసిందనే ప్రచారం సాగుతోంది.

ED TARGET KCR: హైద‌రాబాద్ ఈడీకి పవర్ ఫుల్ ఆఫీసర్.. సీఎం కేసీఆర్ కు బిగుస్తున్న ఈడీ ఉచ్చు! గులాబీలో గుబులు..

ED TARGET KCR:  తెలంగాణలో కొన్ని రోజులుగా ఈడీ దాడులు జరుగుతున్నాయి. పలువురు అవినీతి వ్యాపారుల ఆటకట్టించింది. వరుస ఈడీ దాడులతో తెలంగాణలో ఏదో జరగబోతుందనే ప్రచారం జరిగింది. టీఆర్ఎస్ సర్కార్ అవినీతిని బయటికి తీస్తామని.. కేసీఆర్ జైలుకు వెళ్లడం ఖాయమని తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ పాటు ఆ పార్టీ జాతీయ నేతలు పదేపదే చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే కీలక పరిణామం చోటు చేసుకుంది. హైదరాబాద్ ఈడీకి కొత్త అధికారిని నియమించింది కేంద్రం. తెలుగు రాష్ట్రాలపై మంచి పట్టున్న పవర్ ఫుల్ అధికారిని  నియమించడంతో సీఎం కేసీఆర్ టార్గెట్ గా కేంద్రం స్కెచ్ వేసిందనే ప్రచారం సాగుతోంది. కొంతా కాలంగా బీజేపీ నేతలు చెబుతున్నట్లుగా కేసీఆర్ కు ఈడీ ఉచ్చు బిగుస్తుందా అన్న అనుమానాలు పొలిటికల్ సర్కిళ్లలోనూ వినిపిస్తున్నాయి.

ఇటీవలే దినేష్ పరుచూరి సహా ముగ్గురు అధికారులను ఇన్ కం ట్యాక్స్‌ నుంచి ఈడీకి బ‌దిలీ చేసింది కేంద్రం.  దినేష్ ను ఈడీ హైదరాబాద్ బాస్ గా నియమిస్తారనే వార్తలు వచ్చాయి. తాజాగా అదే నిజమైంది. ముగ్గురు అధికారుల‌కు పోస్టింగులు ఇచ్చిన కేంద్రం..
దినేష్ ప‌రుచూరిని హైద‌రాబాద్ అడిష‌న‌ల్ డైరెక్ట‌ర్ గా నియ‌మించింది. ప్రస్తుత హైద‌రాబాద్ జోన్  జాయింట్ డైరెక్ట‌ర్ ని ముంబైకి ట్రాన్ ఫర్ చేసింది. ముంబై జోన్ ఈడీ బాస్ యోగేష్ శ‌ర్మ‌ని హెడ్ క్వార్టర్ బ‌దిలీ చేసింది. ఈ నియమకాలే ఇప్పుడు తెలంగాణలో సంచలనంగా మారాయి. తెలుగు రాష్ట్రాలపై ఈడీ స్పెషల్ ఫోకస్ పెట్టిందని .. అందుకే పవర్ ఫుల్ అధికారిగా పేరున్న దినేష్ పరుచూరిని అపాయింట్ చేసిందని తెలుస్తోంది.  2009 ఐఆర్ఎస్ కేడర్ అధికారి అయిన దినేష్ కు తెలుగు రాష్ట్రాలతో మంచి సంబంధాలు ఉన్నాయి. ఏపీ, తెలంగాణలో ఆయన ఇన్ కమ్ ట్యాక్స్ ఆఫీసర్ గా పని చేశారు.

fallbacks

గ‌తంలో ఏపీ, తెలంగాణ ఆదాయ‌పు ప‌న్ను శాఖ‌ రిజ‌న‌ల్ అధికారిగా బాధ్య‌త‌లు నిర్వ‌హించారు దినేష్ పరుచూరి. తెలుగు రాష్ట్రాలకు సంబంధించి అన్ని విషయాలపై దినేష్‌ కు పట్టు ఉందంటున్నారు. దినేష్ రాకతో కొత్త స్కాంలు బయటికి వస్తాయనే ప్రచారం సాగుతోంది. సీఎం కేసీఆర్, టీఆర్ఎస్ టార్గెట్ గానే దినేష్ ను హైదరాబాద్ ఈడీ బాస్ గా నియమించారనే ప్రచారం ఢిల్లీ వర్గాల్లో సాగుతోంది. ఇప్పటికే హైదరాబాద్ లో ఈడీ స్పెషల్ టీమ్ లు రంగంలోకి దిగాయని అంటున్నారు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో  అధికారమే లక్ష్యంగా బీజేపీ పావులు కదుపుతోంది. టీఆర్ఎస్ ను ఓడించాలంటే కేసీఆర్ ఆర్థిక మూలాలపై దెబ్బకొట్టాలనే వ్యూహంలో కేంద్రం పెద్దలు ఉన్నారంటున్నారు. 2019 ఎన్నికల్లో చంద్రబాబును టార్గెట్ చేసినట్లుగానే కేసీఆర్ ను అష్ట దిగ్భందనం చేసేందుకు స్కెచ్ వేశారంటున్నారు. కేంద్రం పెద్దల డైరెక్షన్ లోనే ఈడీ టీమ్ లు తెలంగాణలో తిరుగుతున్నాయని చెబుతున్నారు.

కేసీఆర్ తో  సంబంధాలున్న పారిశ్రామికవేత్తలపై ఈడీ నిఘా పెట్టిందని తెలుస్తోంది. ఈడీ దాడులతో వాళ్లంతా ఏం జరుగుతుందోనన్న ఆందోళనలో ఉన్నారంటున్నారు. కేసీఆర్ కు ఉచ్చు బిగిసేలా కేంద్రం అన్ని అస్త్రాలు బయటికి తీస్తుందని, గత ఎనిమిది ఏళ్లుగా జరిగిన ఆర్థిక లావాదేవీలపైనా ఈడీ ఆరా తీస్తుందని చెబుతున్నారు. కొత్త అడిషనల్ డైరెక్టర్ గా దినేష్ రావడంతో ఈడీ దూకుడు మరింత పెరుగుతుందని భావిస్తున్నారు. తెలంగాణ బీజేపీ నేతలు కూడా త్వరలోనే సంచలనం జరగబోతుందని.. కేసీఆర్ కు చుక్కలు కనిపించబోతున్నాయని చెబుతూ వస్తున్నారు. వాళ్ల మాటలకు అనుగుణంగానే పరిణామాలు జరుగుతుండటంతో.. రాబోయే రోజుల్లో సీఎం కేసీఆర్ కేంద్రంగా సంచలన పరిణామాలు జరగబోతున్నాయనే చర్చ సాగుతోంది. చూడాలి మరీ.. హెదరాబాద్ లో ఈడీ ఏం చేయబోతుందో... ఎవరిని కటకటాల్లోకి పంపిస్తోందో..

Read also: Raksha Bandhan Gift ideas: రాఖీ పండగకు తక్కువ బడ్జెట్‌లో అక్కా, చెల్లెళ్లకు గిఫ్ట్స్

Read also: Teacher Photos in Bikini: రెచ్చగొట్టేలా టీచరమ్మ బికినీ ఫోటోలు.. ఉద్యోగం హుష్‌కాకీ

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

 

Read More