Home> తెలంగాణ
Advertisement

Telangana Rain Alert: ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్.. మూడు రోజులు వర్షాలే వర్షాలు..!

Telangana Weather Updates: తెలంగాణలో మరో మూడు రోజులు వర్షాలు కురవనున్నాయి. పలు జిల్లాలకు అధికారులు రెడ్ అలర్ట్ జారీ చేశారు. ఇక నేడు ఉదయం నుంచి హైదరాబాద్‌లో వర్షాలు కురవడంతో నగర వాసులు ఉపశమనం చెందారు. తెలంగాణ వెదర్ అప్‌డేట్స్ ఇలా..
 

Telangana Rain Alert: ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్.. మూడు రోజులు వర్షాలే వర్షాలు..!

Telangana Weather Updates: మరాత్వాడ నుంచి అంతర్గత కర్ణాటక మీదుగా దక్షిణ తమిళనాడు వరకు కొనసాగిన ద్రోణి శనివారం దక్షిణ అంతర్గత కర్ణాటక నుంచి ఉత్తర తమిళనాడు వరకు సగటు  సముద్ర మట్టానికి 0.9 కి.మీ. ఎత్తులో కొనసాగుతోందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఉపరితల ఆవర్తనం ఈరోజు బలహీన పడిందని చెప్పారు. దీని ప్రభావంతో నేడు, రేపు తెలంగాణ రాష్ట్రంలో కొన్ని జిల్లాలలో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కొన్ని చోట్ల, ఎల్లుండి అక్కడ అక్కడ కురిసే అవకాశం ఉందన్నారు. ఈరోజు, రేపు, ఎల్లుండి రాష్ట్రంలో ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 30 నుంచి 40 కి.మీ. వేగంతో వీచే ఈదురుగాలులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు అక్కడ అక్కడ కురిసే అవకాశం ఉందన్నారు.

Also Read: Meat Shops Closed Tomorrow: రేపు చికెన్, మటన్‌ షాపులు బంద్.. అతిక్రమిస్తే కఠినచర్యలే..!  

వారం రోజులుగా తెలంగాణలో అక్కడక్కడ వర్షాలు కరుస్తుండడంతో వాతావరణం చల్లబడింది. శనివారం ఉదయం నుంచి హైదరాబాద్‌లో వర్షం కురవడంతో పలు ఏరియాలు తడిసి ముద్దయ్యాయి. రాష్ట్రంలో మరో  మూడు రోజులు పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. పలు జిల్లాలకు రెయిన్ అలర్ట్  ప్రకటించారు. హైదరాబాద్, ఉమ్మడి రంగారెడ్డి, ఉమ్మడి వరంగల్, ఉమ్మడి మెదక్, సిద్ధిపేట, యాదాద్రి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి జిల్లాల్లో వర్షం కురిసే అవకాశముందని అంచనా వేశారు. రేపటి వరకు రాష్ట్రంలో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే ఛాన్స్ ఉందన్నారు అధికారులు.

ఇవాళ హైదరాబాద్‌ నగరంలో కురిసిన వర్షంతో ఒక్కసారిగా వాతావరణం మారింది. ఎల్బీనగర్‌, వనస్థలిపురం, హిమాయత్ నగర్‌ తదితర ప్రాంతాల్లో వర్షం కురిసింది. హైదరాబాద్‌లో అనేక ప్రాంతాల్లో వర్షం కురియడంతో ఎండవేడిమి, ఉక్కపోత నుంచి నగర వాసులకు ఉపశమనం కలిగింది. ఉపరితల ఆవర్తనం, ద్రోణి కారణంగా రాష్ట్రానికి వర్ష సూచన ఉన్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. మరోవైపు అకాల వర్షాలతో అన్నదాతలు ఇబ్బందులు పడుతున్నారు. వరి, మామిడి తోటలకు నష్టం వాటిల్లుతోంది. కల్లాల్లో ఆరబెట్టిన ధాన్యం పూర్తిగా తడిపిపోయింది. 

రేపు ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్..

==> హైదరాబాద్, ఉమ్మడి ఆదిలాబాద్, ఉమ్మడి కరీంనగర్, ఉమ్మడి రంగారెడ్డి, నిజామాబాద్, జయశంకర్ భూపాలపల్లి, యాదాద్రి భువనగిరి, మెదక్, సంగారెడ్డి.

ఎల్లుండి ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్..
 
==> హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి, వికారాబాద్, భువనగిరి, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్‌నగర్.

Also Read: Weight loss Tips: ఈ 6 కూరగాయల్లో నీరు అధికం.. ఇలా తింటే ఈజీగా బరువు తగ్గిపోతారు.. 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Read More