Home> తెలంగాణ
Advertisement

Telangana: హవాలా ముఠా గుట్టురట్టు.. భారీగా సొమ్ము స్వాధీనం

తెలంగాణ ( Telangana ) రాజధాని హైదరాబాద్‌ నగరంలో హవాలా రాకెట్ ముఠా గుట్టురట్టైంది. ఈ మేరకు వెస్ట్ జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు భారీగా సొమ్మును స్వాధీనం చేసుకున్నారు.

Telangana: హవాలా ముఠా గుట్టురట్టు.. భారీగా సొమ్ము స్వాధీనం

Hawala money caught Hyderabad : హైదరాబాద్‌: తెలంగాణ ( Telangana ) రాజధాని హైదరాబాద్‌ నగరంలో హవాలా (Hawala money) రాకెట్ ముఠా గుట్టురట్టైంది. ఈమేరకు వెస్ట్ జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు భారీగా సొమ్మును స్వాధీనం చేసుకున్నారు. వెస్ట్‌జోన్‌లోని బంజారాహిల్స్ రోడ్ నెంబర్‌ 12లో ఓ కారులో నలుగురు వ్యక్తులు.. 3కోట్ల 75లక్షల డబ్బులను తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. నగదుతోపాటు.. ఈశ్వర్ దిలీప్ జీ, హరీష్ రామ్‌బాయ్, అజిత్ సింగ్, రాథోడ్ అనే నలుగుగు వ్యక్తులను అరెస్ట్‌ చేశారు. ఈ సందర్భంగా సీపీ అంజనీకుమార్‌ మాట్లాడుతూ.. స్వాధీనం చేసుకున్న హవాలా డబ్బును ఐటీశాఖకు అప్పగిస్తామని తెలిపారు. అయితే.. ఈ డబ్బులు ఎక్కడ నుంచి ఎక్కడికి తరలిస్తున్నారన్న విషయాన్ని దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు. విచారణలో మరిన్ని వివరాలు బయట పడే అవకాశం ఉందని సీపీ వెల్లడించారు. Also read: India China face off: ఇంకా అలానే సరిహద్దు వివాదం: రక్షణ మంత్రి రాజ్‌నాథ్

అయితే.. పట్టుబడిన వారంతా గుజరాత్ రాష్ట్రానికి చెందినవారని పేర్కొంటున్నారు. నిందితులంతా మహారాష్ట్ర ముంబై కేంద్రంగా పనిచేస్తారని సమాచారం. నగరంలో ఇంత పెద్ద మొత్తంలో హవాలా నగదు పట్టుబడటం చర్చనీయాంశంగా మారింది. Also read: Mimi Chakraborty: ఎంపీ, నటితో అసభ్యకరంగా ప్రవర్తించిన ట్యాక్సీ డ్రైవర్

Read More