Home> తెలంగాణ
Advertisement

హైదరాబాద్‌ వేదికగా మరో అంతర్జాతీయ సదస్సు

ఖనిజాల అన్వేషణలో వస్తున్న మార్పులు, సాంకేతిక అంశాలపై ప్రధానమైన చర్చ

హైదరాబాద్‌ వేదికగా మరో అంతర్జాతీయ సదస్సు

ఇటీవలే అంతర్జాతీయ పారిశ్రామికవేత్తల సదస్సుతో ప్రపంచ వ్యాప్తంగా వున్న ప్రముఖ పారిశ్రామికవేత్తలకు ఆతిథ్యం పలికిన హైదరాబాద్ ఇంకొద్ది రోజుల్లోనే మరో అంతర్జాతీయ సదస్సుకు వేదిక కాబోతోంది. ఫిబ్రవరి 14 నుంచి 17 వరకు హైటెక్స్‌లో నాలుగు రోజులపాటు మైనింగ్ టుడే-2018 సదస్సు జరగనుంది. ఖనిజాల అన్వేషణలో వస్తున్న మార్పులు, సాంకేతిక అంశాలపై ఈ సదస్సులో ప్రధానంగా చర్చ జరగనుంది. 

ప్రపంచ పారిశ్రామికవేత్తల సదస్సుని ప్రతిష్టాత్మకంగా నిర్వహించి వరల్డ్ లీడర్స్ చేత శభాష్ అనిపించుకున్న తెలంగాణ ప్రభుత్వం మళ్లీ ఈ సదస్సుని కూడా అంతే ఘనంగా నిర్వహించేందుకు ప్రస్తుతం ఏర్పాట్లు చేసుకుంటోంది. అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా, ఆసియా, ఆఫ్రికా నుంచి మైనింగ్ కంపెనీల ప్రతినిధులు ఈ సదస్సుకు హాజరుకానున్నారు. గవర్నర్ నరసింహన్‌తో కలిసి కేంద్ర మైనింగ్ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ ఈ సదస్సుని ప్రారంభించనున్నారు.

Read More