Home> తెలంగాణ
Advertisement

Hyderabad Road Accident: హైదరాబాద్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. యువకుడి మృతి

Hyderabad Road Accident: నగరంలో శుక్రవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఓ యువకుడు అక్కడికక్కడే మృతి చెందగా, మరో యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి. అమీర్‌పేట చౌరస్తాలో ఈ ఘటన జరిగింది. ఇద్దరు యువకులు బైకుపై వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది.

Hyderabad Road Accident: హైదరాబాద్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. యువకుడి మృతి

Hyderabad Road Accident: హైదరాబాద్‌ నగరంలో శుక్రవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఓ యువకుడు అక్కడికక్కడే మృతి చెందగా, మరో యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి. అమీర్‌పేట చౌరస్తాలో ఈ ఘటన జరిగింది. ఆ వివరాలిలా ఉన్నాయి.. ఇద్దరు యువకులు బైకుపై కూకట్‌పల్లి వైపు బయల్దేరారు. అతి వేగంగా వెళ్లడంతో అంబేడ్కర్‌ చౌరస్తా దగ్గరకు రాగానే ద్విచక్రవాహనం అదుపు తప్పింది.

హైదరాబాద్‌లోని అమీర్‌పేటలో జరిగిన ఈ ఘటనలో ఓ యువకుడి తల మెట్రోరైలు స్టేషన్‌ రైలింగ్‌లో ఇరుక్కుపోయింది. ఈ రోడ్డు ప్రమాదం (Road Accident)లో అతడు అక్కడికక్కడే మృతి చెందాడు. బైకుపై వెళ్తున్న మరో యువకుడికి తీవ్రగాయాలు కాగా, చికిత్స నిమిత్తం దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు. వీరి దారికి ఏదైనా అడ్డు వచ్చిందా, లేక ఏదైనా వాహనం తాకిందా అనేదానిపై స్పష్టత రావాల్సి ఉంది.

Also Read : Gold Price Today: మరోసారి తగ్గిన బంగారం, వెండి ధరలు

స్థానికుల నుంచి సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు. మెట్రో రైలు రెయిలింగ్ నుంచి యువకుడి మృతదేహాన్ని కిందకి దింపి పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

Also Read : Boy Flying in The air with a Kite: గాలిపటంతో 30 అడుగుల వరకు ఎగిరిన బాలుడు.. ఆ తర్వాత ఏమైంది!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

  • మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook
Read More