Home> తెలంగాణ
Advertisement

Hyderabad Rains: హైదరాబాద్‌లో కుండపోత వర్షం..మరో రెండు గంటలపాటు బీఅలర్ట్..!

Hyderabad Rains: హైదరాబాద్‌లో కుండపోత వర్షం కురుస్తోంది. దాదాపు మూడు గంటల నుంచి ఏకధాటిగా వర్షం పడుతోంది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

Hyderabad Rains: హైదరాబాద్‌లో కుండపోత వర్షం..మరో రెండు గంటలపాటు బీఅలర్ట్..!

Hyderabad Rains: భాగ్యనగరంలో వర్షం దంచికొడుతోంది. సాయంత్రం 5 గంటల నుంచి వాన పడుతోంది. నగరంలోని పలు ప్రాంతాల్లో పరిస్థితి ఇలాగే ఉంది. ఉరుములు, మెరుపులతో కూడి వర్షం కురుస్తోంది. సోమాజిగూడ, ఖైరతాబాద్, జూబ్లీహిల్స్, పంజాగుట్ట, బంజారాహిల్స్, ఎస్‌ఆర్ నగర్, అమీర్ పేట్, కోఠి, కూకట్‌పల్లి, ఎల్బీనగర్, దిల్ సుఖ్ నగర్, వనస్థలిపురంలో భారీ వర్షం పడింది. పంజాగుట్ట, లక్డీకపూల్, నాంపల్లి, ట్యాంక్‌ బండ్‌లో కుండపోత పడుతోంది.

fallbacks

శంషాబాద్, గండిపేట్, కిస్మత్ పూర్, జాగీర్, అత్తాపూరర్, మణికొండ, కాటేదాన్, నార్సింగి, లంగర్ హౌస్, గోల్కొండ, కార్వాన్, మెహదీపట్నం, జియాగూడ తదితర ప్రాంతాల్లో ఏకధాటిగా వర్షం పడుతోంది. రోడ్లపై భారీగా వర్షపు నీరు చేరడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ట్రాఫిక్ జామ్ అయ్యింది. పలు చోట్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడుతోంది. నాంపల్లి, మెహదిపట్నంలో అరగంటలో 5 సెంటీమీటర్ల భారీ వర్షపాతం నమోదు అయ్యింది.

fallbacks

మెహదీపట్నం, టోలీచౌకి, అత్తాపూర్, మాసబ్ ట్యాంక్, నాంపల్లి, అఫ్జల్ గంజ్‌, హిమాయత్ నగర్, నారాయణగూడ, ముషీరాబాద్‌లో అత్యధిక భారీ వర్షం కురిసింది. ఆఫీసుల నుంచి ఇళ్లకు వెళ్లే సమయంలో వర్షం కురవడంతో ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పలు ప్రాంతాల్లో వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. ప్రధాన రోడ్లన్నీ చెరువులను తలపిస్తున్నాయి. ఎర్రగడ్డ, మూసాపేట్ మార్గంలో భారీగా ట్రాఫిక్ జాం అయ్యింది. ఫతేనగర్, బల్కంపేట్ మార్గంలో ట్రాఫిక్‌ అంతరాయం ఏర్పడింది.

fallbacks

వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. మరో 2 గంటలపాటు పరిస్థితి ఇలాగే కొనసాగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. 2 గంటలపాటు ప్రయాణాలు వాయిదా వేసుకోవాలంటున్నారు. 

fallbacks

Also read:Plance Collide: ఆకాశంలో రెండు విమానాల క్రాష్ లైవ్‌లో చూశారా ఎప్పుడైనా.. వీడియో వైరల్

Also read:Minister KTR: అమెరికా ఎంఐటీలా బాసర ట్రిపుల్ ఐటీని తీర్చిదిద్దుతాం: మంత్రి కేటీఆర్..!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

Read More