Home> తెలంగాణ
Advertisement

MIM Corporator Threatens Police: మరీ ఇంత అరాచకమా.. పోలీసులకే పబ్లిగ్గా ధమ్కీ ఇచ్చిన ఎంఐఎం కార్పొరేటర్

Musheerabad MIM Corporator Threatens Police: హైదరాబాద్: నగరంలో కొందరు కార్పొరేటర్లు హద్దులుమీరి రెచ్చిపోతున్నారు. శాంతి భద్రతలను అదుపులోకి తీసుకొచ్చే క్రమంలో తమ బాధ్యతలను నిర్వర్తిస్తూ విధి నిర్వహణలో ఉన్న పోలీసులకే పబ్లిగ్గా ధమ్కీలు ఇస్తున్నారు.

MIM Corporator Threatens Police: మరీ ఇంత అరాచకమా.. పోలీసులకే పబ్లిగ్గా  ధమ్కీ ఇచ్చిన ఎంఐఎం కార్పొరేటర్

Musheerabad MIM Corporator Threatens Police: హైదరాబాద్: నగరంలో కొందరు కార్పొరేటర్లు హద్దులుమీరి రెచ్చిపోతున్నారు. శాంతి భద్రతలను అదుపులోకి తీసుకొచ్చే క్రమంలో తమ బాధ్యతలను నిర్వర్తిస్తూ విధి నిర్వహణలో ఉన్న పోలీసులకే పబ్లిగ్గా ధమ్కీలు ఇస్తున్నారు. తమను ప్రశ్నించడానికి వీల్లేదంటూ ఖాకీలపై వీరంగం వేస్తున్నారు. కార్పొరేటర్ల తీరుతో ఏం చేయలో అర్థం కాని దుస్థితిలో పోలీసులు సైతం నిస్సహాయంగా ఉండిపోతున్నారు. తాజాగా ముషిరాబాద్ నియోజకవర్గంలో ఓ ఎంఐఎం కార్పొరేటర్ పోలీసు శాఖకు సవాలు విసురుతున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

ఆ వీడియోలో తన ఇలాకాలో పోలీసులు అడుగు పెట్టొద్దని హుకుం జారీ చేస్తున్నాడు స్థానిక కార్పొరేటర్. అర్ధరాత్రి పదుల సంఖ్యలో అనుచరులను వెంటేసుకుని తిరుగుతూ.. పోలీసులపై వీరంగం వేశాడు. పోలీసుల విధులకు ఆటంకం కల్గించడమే కాకుండా వారిపై బిగ్గరగా అరుస్తూ దుర్భాషలాడాడు. వారించబోయిన పోలీసును కించపరుస్తూ.. ''నువ్వు వంద రూపాయల మనుషివే.. ఆఖరికి నువ్వు కూడా మాట్లాడుతున్నావా'' అంటూ అవహేళన చేస్తూ మాట్లాడాడు. రంజాన్ మాసంలో రాత్రంతా విచ్చలవిడిగా తిరుగుతాం. నగరమంతా ఎక్కడైనా మాకు తినే పదార్థాలు ఉండాలంటూ పోలీసులకు ఆదేశాలిచ్చాడు కార్పొరేటర్. ఇంత జరిగినా సదరు కార్పొరేటర్‌పై పోలీసులు ఇంత వరకు కేసు నమోదు చేయలేదు. 

ఎంఐఎం కార్పొరేటర్‌పై కేసు నమోదుకు పోలీసులు భయపడుతున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. స్థానిక పోలీసు అధికారులపై ఉన్నతాధికారుల నుంచి వత్తిళ్లు వస్తున్నాయని తెలుస్తోంది. గతంలో లేడీ ఎస్ఐపై ఈ కార్పొరేటరే దురుసుగా వ్యవహరించాడు. అప్పుడు కూడా అతనిపై పోలీసులు ఏం చర్యలు తీసుకోలేదు. పోలీసుల (Hyderabad police) నిర్లక్ష్య వైఖరి వల్లే కార్పొరేటర్లు రెచ్చిపోతున్నారని జనాలు అభిప్రాయపడుతున్నారు. 

Also read : Cantonment road close issue: కంటోన్మెంట్ వాసులకు గుడ్ న్యూస్... కేటీఆర్ చొరవతో రోడ్ల మూసివేత సమస్యకు పరిష్కారం దిశగా అడుగులు...

Also read : Revanth Reddy: అయిపోయిన సినిమాకు టికెట్స్ అమ్ముకున్నట్టు ఉంది కేసీఆర్ తీరు: రేవంత్ రెడ్డి

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Read More