Home> తెలంగాణ
Advertisement

Telangana unlock, HMRL, TSRTC timings: మెట్రో రైళ్లు, టిఎస్ఆర్టీసీ బస్సుల టైమింగ్స్ మార్పు

Hyderabad Metro rail Timings: హైదరాబాద్: తెలంగాణలో లాక్ డౌన్ ఎత్తివేసిన నేపథ్యంలో ప్రయాణికుల సౌకర్యార్థం జూన్ 20, ఆదివారం నుంచి హైదరాబాద్ మెట్రో రైలుతో పాటు టిఎస్ఆర్టీసీ బస్సు సేవల సమయాల్లో మార్పులు చోటుచేసుకున్నాయి. ప్రయాణికుల (Passengers సౌకర్యార్థం ఉదయం నుంచి రాత్రి వరకు రవాణా సదుపాయాలు అందుబాటులో ఉండేలా హెచ్ఎంఆర్ఎల్, టిఎస్ఆర్టీసీ (HMRL, TSRTC) నిర్ణయం తీసుకున్నాయి.

తెలంగాణలో అన్‌లాక్ నేపథ్యంలో ప్రయాణికుల సౌకర్యార్థం జూన్ 20, ఆదివారం నుంచి హైదరాబాద్ మెట్రో రైలు సమయాల్లో మార్పులు చేసినట్టు అధికారులు తెలిపారు. ప్రయాణికులకు మెట్రో సేవలు అందుబాటులో ఉండేలా ఉదయం 7 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు మెట్రో రైళ్లు తిరుగుతాయని హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ (HMRL) ప్రకటించింది. ఉ.7 గంటలకు మొదటి మెట్రో రైలు బయలు దేరనుండగా... చివరిగా రాత్రి 9 గంటలకు స్టేషన్స్ నుంచి బయలుదేరే మెట్రో రైలు రాత్రి 10 గంటలకు టెర్మినస్ చేరుకుంటుందని హెచ్ఎంఆర్ఎల్ తెలిపింది. 

Also read: Telangana unlock: నేటి నుంచే తెలంగాణలో అన్‌లాక్.. Corona guidelines తప్పనిసరి

TSRTC bus timings: టిఎస్ఆర్టీసీ బస్సుల టైమింగ్స్‌లో మార్పులు 
అలాగే టిఎస్ఆర్టీసీ సేవల్లోనూ మార్పులు చోటుచేసుకున్నాయి. లాక్‌డౌన్‌కి ముందు తరహాలో తెల్లవారి జాము నుంచి ప్రారంభం అయ్యే బస్సు సర్వీసులు రాత్రి వరకు అందుబాటులో ఉంటాయని, రద్దీ అధికంగా ఉండే ప్రధానమైన మార్గాల్లో యధావిధిగా 24 గంటలు సేవలు అందుబాటులో ఉంటాయని టిఎస్ ఆర్టీసీ (TSRTC) వెల్లడించింది. అన్‌లాక్ నేపథ్యంలో ప్రయాణికుల సౌకర్యార్థం ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆర్టీసీ తెలిపింది. అయితే, ఏపీ, కర్ణాటక వంటి పొరుగు రాష్ట్రాల్లో ఇప్పటికీ ఆంక్షలు కొనసాగుతున్నందున అంతర్రాష్ట్ర సర్వీసులకు ప్రస్తుతానికి బ్రేకులు పడినట్టేనని తెలుస్తోంది.

Also read : Schools reopening in Telangana: స్కూల్స్ పునఃప్రారంభంపై కేబినెట్ భేటీలో నిర్ణయం

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Read More