Home> తెలంగాణ
Advertisement

Hyderabad Metro: భద్రతా ప్రమాణాల్లో నంబర్‌ వన్‌ హైదరాబాద్ మెట్రో.. గోల్డెన్ పీకాక్ అవార్డు సొంతం

Hyderabad Metro Wins Golden Peacock Award: ప్రజా రవాణాలో కీలకమైన హైదరాబాద్‌ మెట్రో రైలు సత్తా చాటింది. భద్రతా ప్రమాణాల అంశంలో దేశంలోనే నంబర్‌ వన్‌గా నిలిచి గోల్డెన్‌ పీకాక్‌ అవార్డు కొల్లగొట్టింది.

Hyderabad Metro: భద్రతా ప్రమాణాల్లో నంబర్‌ వన్‌ హైదరాబాద్ మెట్రో.. గోల్డెన్ పీకాక్ అవార్డు సొంతం

Golden Peacock Award: దేశంలో మరోసారి హైదరాబాద్‌ మెట్రో రైల్‌ సత్తా చాటింది. ప్రయాణికులకు అత్యుత్తమ సేవలు అందిస్తున్న హైదరాబాద్‌ మెట్రోకు ప్రతిష్టాత్మక అవార్డు వరించింది. అత్యుత్తమ భద్రతా ప్రమాణాలు పాటిస్తున్న మెట్రోగా హైదరాబాద్‌ మెట్రో నిలవడంతో గోల్డెన్‌ పీకాక్‌ పురస్కారం దక్కింది. కర్ణాటక రాజధాని బెంగళూరులో జరిగిన కార్యక్రమంలో అవార్డు పొందినట్లు మెట్రో అధికారులు వెల్లడించారు. ఉద్యోగుల భద్రత, సంక్షేమం విషయంలో తమ నిబద్ధతకు నిదర్శనం ఈ అవార్డు అని మెట్రో అధికారులు తెలిపారు.

Also Read: KCR: కేసీఆర్‌ సంచలన ప్రకటన.. వాళ్లు పోతేపోనీ మిమ్మల్నే ఎమ్మెల్యేలుగా చేసుకుంటాం

 

బెంగళూరులో ఇటీవల ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ డైరెక్టర్స్‌ (ఐఓడీస్‌) 25వ ఇంటర్నేషనల్‌ కాన్ఫరెన్స్‌ ఆన్‌ ఎన్విరాన్‌మెంటల్‌ మేనేజ్‌మెంట్‌ అండ్‌ క్లైమేట్‌ చేంజ్‌ కార్యక్రమం నిర్వహించారు. ఈ సమావేశంలో హైదరాబాద్‌ మెట్రో రైలుకు గోల్డెన్‌ పీకాక్‌ అవార్డు అందుకుంది. అత్యుత్తమ భద్రతా ప్రమాణాలను పాటించడంలో గల నిబద్ధతకు గాను ట్రాన్స్‌పోర్టేషన్‌ (రైల్వేస్‌) కేటగిరిలో ఆక్యుపేషనల్‌ హెల్త్‌, సేఫ్టీకి సంబంధించి గోల్డెన్‌ పీకాక్‌ అవార్డు అందిందని మెట్రో అధికారులు తెలిపారు. అవార్డు రావడంపై మెట్రో అధికారులు ఓ ప్రకటన విడుదల చేశారు.

Also Read: Revanth Reddy vs KCR: మోదీ కాళ్లు పట్టుకున్న కేసీఆర్‌ ముక్కు నేలకు రాయాలి: రేవంత్‌ ఆగ్రహం

 

'మా ఉద్యోగుల భద్రత, సంక్షేమం విషయంలో మాకు ఉన్న నిబద్ధతకు ఈ అవార్డు నిదర్శనంగా నిలుస్తుంది. ఇది మాకు ఎంతో స్ఫూర్తి ఇస్తూ.. భద్రతలో అత్యున్నత ప్రమాణాలను నెలకొల్పే దిశగా నిరంతరం కృషి చేసేలా ప్రోత్సాహకరంగా ఉండగలదు' అంటూ టీఎంఆర్‌హెచ్‌ఎల్‌ ఎండీ, సీఈఓ కేవీబీ రెడ్డి తెలిపారు. ఈ అవార్డుకు మొత్తం 778 దరఖాస్తులు తీవ్ర పోటీ జరిగినా కూడా మన హైదరాబాద్‌ మెట్రోకు అవార్డు రావడం విశేషం. అత్యుత్తమ భద్రతా ప్రమాణాలు పాటించే దిగ్గజ సంస్థగా హైదరాబాద్‌ మెట్రో నిలిచింది. కాగా హైదరాబాద్‌ మెట్రోలో 126 మంది ఉద్యోగులు ప్రత్యక్షంగా ఉపాధి పొందుతున్నారు. ఔట్‌ సోర్సింగ్‌, కాంట్రాక్ట్‌ ఉద్యోగులు ఇలా అన్ని విభాగాలు కలిపి మొత్తం 2,600 మందికి పైగా ఉద్యోగులు పని చేస్తున్నారు. 

సిబ్బంది, భద్రత విషయంలో గోల్డెన్‌ పీకాక్‌ అవార్డు ఇస్తుంటారు. అవార్డు రావడానికి సహకరించిన ఉద్యోగులు, సిబ్బందికి కేవీబీ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. ఈ అవార్డు దక్కిన ప్రోత్సాహంతో అత్యుత్తమ భద్రతా ప్రమాణాలను కొనసాగించడంలో తాము నిరంతరం కృషి చేస్తామని ఆయన పేర్కొన్నారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిFacebookTwitter

Read More