Home> తెలంగాణ
Advertisement

Drug Mafia: డ్రగ్స్ హబ్ గా హైదరాబాద్? పోలీసుల కనుసన్నల్లోనే మత్తు మాఫియా?

హైదరాబాద్ డ్రగ్స్ హబ్ గా మారిందా? మత్తులో యువత చిత్తవుతుందా? పోలీసుల కనుసన్నల్లోనే డ్రగ్స్ మాఫియా నడుస్తోందా? అంటే తాజాగా హైదరాబాద్ లో వెలుగుచూసిన ఘటనతో నిజమే అనిపిస్తోంది. 

Drug Mafia: డ్రగ్స్ హబ్ గా హైదరాబాద్? పోలీసుల కనుసన్నల్లోనే మత్తు మాఫియా?

Drug Mafia: హైదరాబాద్ డ్రగ్స్ హబ్ గా మారిందా? మత్తులో యువత చిత్తవుతుందా? పోలీసుల కనుసన్నల్లోనే డ్రగ్స్ మాఫియా నడుస్తోందా? అంటే తాజాగా హైదరాబాద్ లో వెలుగుచూసిన ఘటనతో నిజమే అనిపిస్తోంది. రెండు రోజుల క్రితమే డ్రగ్స్ కు బానిసై బీటెక్ విద్యార్థి మరణించిన ఘటన వెలుగులోనికి వచ్చింది. డ్రగ్స్ కు చిత్తై విద్యార్థి చనిపోవడం కలకలం రేపగా.. తాజాగా వీఐపీ జోన్ బంజారా హిల్స్ లో  పోలీస్ స్టేషన్ పక్కనే ఉన్న హోటల్ లో పార్టీ నిర్వహించడం కలకలం రేపుతోంది. టాస్క్ ఫోర్స్ దాడిలో 150 మంది పట్టుబడటం అందరిని షాక్ కు గురి చేసింది. 

రాడిసన్ బ్లూ హోటల్ లోని పుడింగ్ మిగ్ పబ్ లో తెల్లవారే వరకు నిర్వహిస్తూ యాజమాన్యం హంగామా సృష్టిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ దాడుల్లో టాప్ సింగర్  రాహుల్ సింప్లిగంజ్ సహా పలువురు ప్రముఖులను టాస్క్ ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ర్యాడిసన్ బ్లూ హోటల్ లోని పబ్ ని అధికారులు సీజ్ చేశారు. గతంలో కూడా రాహుల్ పై ఓ పబ్ లో దాడి జరిగింది. మరోసారి పబ్ సంఘటనలోనే రాహుల్ దొరికిపోవడం సంచలనంగా మారింది. 150 మందికి పైగా ఈ కేసులో వున్నట్టు తెలుస్తోంది. పోలీస్ స్టేషన్ పక్కనే ఉన్న హోటల్ లో ఈ తతగమంతా జరగడం మరింత సంచలనంగా మారింది. పోలీసులు సపోర్టుతోనే యథేచ్చగా పబ్ నిర్వహిస్తున్నారని తెలుస్తోంది.

డ్రగ్స్ కట్టడికి ఇటీవలే నార్కోటిక్స్ ఎన్ ఫోర్స్ మెంట్ వింగ్, నార్కోటిక్స్ ఇన్వెస్టిగేషన్ సూపర్ విజన్ వింగ్ పేరిట రెండు ప్రత్యేక విభాగాలను హైదరాబాద్ పోలీసులు ప్రారంభించారు. హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో రెండు విభాగాలు పని చేస్తున్నాయి. నార్కోటిక్స్ ఎన్ ఫోర్స్ మెంట్ వింగ్ లో డీసీపీ, ఇద్దరు ఇన్సిపెక్టర్లు, నలుగురు ఎస్సైలు, 20 మంది కానిస్టేబుళ్లు ఉన్నారు. డ్రగ్ ట్రాఫికింగ్, పొరుగు రాష్ట్రాల్లో డ్రగ్స్ పట్టివేత, నిందితుల సమాచార సేకరణపై నిఘా పెట్టింది. నార్కోటిక్స్ ఇన్వెస్టిగేషన్ సూపర్ విజన్ వింగ్ లో ఏసీపీతో పాటు ఇన్సిపెక్టర్, ఎస్సై, ఆరుగురు సిబ్బంది ఉన్నారు. అయినా సిటీ పరిధిలో డ్రగ్స్ రవాణా యథేచ్చగా సాగుతూనే ఉంది.  ప్రత్యేక వింగ్ లు ఏర్పాటు చేసినా స్థానిక పోలీసులు మాత్రం అక్రమదారులకు వత్తాసు పలుకుతున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. అందుకే హైదరాబాద్ లో డ్రగ్స్ మాఫియా చెలరేగిపోతుందని తెలుస్తోంది. 

ముఖ్యమంత్రి ఆదేశాలతో డ్రగ్స్ పై ఉక్కుపాదం మోపుతున్నారు పోలీసులు.  హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలోని వివిధ జోన్లలో అవగాహన కార్యక్రమాలు చేపట్టింది. ఫిబ్రవరి 12న హోంమంత్రి, హైదరాబాద్ సీపీ , పలువురు ఉన్నతాధికారులు సమావేశంలోపాల్గొన్నారు. సీఎం ఆదేశాలతో పోలీసులు హోటళ్లు, పబ్ లపై దాడులు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే రాడిసన్ బ్లూ హోటల్ లోని ఫుడింగ్ మిగ్ హబ్ పై టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడి చేయగా ప్రముఖులు పట్టుబడ్డారు. రాడిసన్ హోటల్ లో పట్టుబడిన వారంతా ప్రముఖులే కావడం పోలీసులను షాక్ కు గురి చేస్తోంది.

Also Read: Malaika Arora Accident: బాలీవుడ్ నటి మలైకా అరోరా కారుకు ప్రమాదం.. గాయాలతో ఆస్పత్రిలో చేరిక!

Also Read: Viral Video: నడిరోడ్డులో యువతిని కొట్టుకుంటూ వెళ్లిన ఫుడ్ డెలివరీ బాయ్.. వీడియో వైరల్!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook 

Read More