Home> తెలంగాణ
Advertisement

Huzurabad Bypoll 2021 Results: ఉత్కంఠ రేపిన హుజూరాబాద్ ఉపఎన్నిక కౌంటింగ్ మరి కాస్సేపట్లో

Huzurabad Bypoll 2021 Results: తీవ్ర ఉత్కంఠ రేపిన హుజూరాబాద్ ఉపఎన్నిక ఫలితం ఇవాళ తేలనుంది. ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్లలో నిక్షిప్తమైన ప్రజాతీర్పు వెలువడనుంది. ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభమై..నాలుగైదు గంటల్లో ట్రెండ్ తేలిపోనుంది.

Huzurabad Bypoll 2021 Results: ఉత్కంఠ రేపిన హుజూరాబాద్ ఉపఎన్నిక కౌంటింగ్ మరి కాస్సేపట్లో

Huzurabad Bypoll 2021 Results: తీవ్ర ఉత్కంఠ రేపిన హుజూరాబాద్ ఉపఎన్నిక ఫలితం ఇవాళ తేలనుంది. ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్లలో నిక్షిప్తమైన ప్రజాతీర్పు వెలువడనుంది. ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభమై..నాలుగైదు గంటల్లో ట్రెండ్ తేలిపోనుంది.

దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల అసెంబ్లీ, లోక్‌సభ ఉపఎన్నికలకు అక్టోబర్ 30వ తేదీన పోలింగ్ జరిగింది. దీనికి సంబంధించిన ఓట్ల లెక్కింపు ప్రక్రియ మరి కాస్సేపట్లో ప్రారంభం కానుంది. ముఖ్యంగా తెలంగాణ హుజూరాబాద్ ఉపఎన్నిక(Huzurabad Bypoll Results)తీవ్ర ఉత్కంఠ రేపింది. ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభమై..4-5 గంటల్లో గెలిచేది ఎవరనే ట్రెండ్ తేలిపోతుంది. మాజీ మంత్రి, అధికార పార్టీ నేత ఈటెల రాజేందర్(Etela Rajender)రాజీనామాతో ఇక్కడ ఎన్నిక అనివార్యమైంది. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన ఈటెల రాజేందర్ బీజేపీ తరపున పోటీ చేయగా..టీఆర్ఎస్ తరపున కొత్తగా గెల్లు శ్రీనివాస్ యాదవ్ బరిలో నిలిచారు. అభ్యర్ధి శ్రీనివాస్ యాదవ్ అయినా సరే..పోటీ మాత్రం ఈటెల వర్సెస్ కేసీఆర్‌గా(KCR) జరిగింది.

ఈవీఎంలలో నిక్షిప్తమైన ప్రజల తీర్పు బహిర్గతం కానుంది. ఓట్ల లెక్కింపు కోసం ఎస్ఆర్ఆర్ ప్రభుత్వ కళాశాలలో జిల్లా అధికారులు పూర్తి ఏర్పాట్లు చేశారు. కౌంటింగ్‌ ప్రక్రియ ప్రశాంతంగా, పారదర్శకంగా జరిగేందుకు వీలుగా చర్యలు చేపట్టారు. కళాశాల వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ముఖ్యంగా స్ట్రాంగ్‌ రూముల వద్ద కేంద్ర బలగాలు, కౌంటింగ్‌ సెంటర్‌ లోపల ఆర్మ్‌డ్‌ ఫోర్స్‌ Huzurabad Counting) సిబ్బంది, వెలుపల సివిల్‌ పోలీసులతో మూడంచెల భద్రత ఏర్పాటు చేశారు. ఈవీఎంలు భద్రపరిచిన అన్ని స్ట్రాంగ్‌రూముల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. కౌంటింగ్‌ పురస్కరిం చుకుని కళాశాల పరిసరాల్లో మంగళవారం 144 సెక్షన్‌ అమల్లోఉంటుంది. ప్రధాన పార్టీ అభ్యర్ధులతో పాటు మొత్తం 30 మంది బరిలో నిలిచారు. మొత్తం 22 రౌండ్లలో 22 టేబుళ్లపై కౌంటింగ్ జరగనుంది. పోలైన ఓట్లు 2 లక్షలు దాటడంతో తుది ఫలితం తేలడానికి సాయంత్రం కావచ్చని అంచనా. 

Also read: Huzurabadelectio byn: 'ఎన్నికలో విజయం కోసం టీఆర్ఎస్​ ఎమ్మెల్యేలు డబ్బులు పంచారు'- ఈటల రాజేందర్ సంచలన ఆరోపణలు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G 

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

Read More