Home> తెలంగాణ
Advertisement

Heavy Rains: ప్రాజెక్టులకు కొనసాగుతున్న వరద.. గేట్లు ఎత్తుతున్న అధికారులు

భారీ వర్షాలతో తెలంగాణ (Telangana) ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరోవైపు ప్రాజెక్టులలోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. నిన్నటితో పోల్చితే నేడు కృష్ణా ప్రాజెక్టు (Krishna River Projects)ల్లోకి ప్రవాహం కాస్త తగ్గినట్లు సమాచారం.

Heavy Rains: ప్రాజెక్టులకు కొనసాగుతున్న వరద.. గేట్లు ఎత్తుతున్న అధికారులు

 గత ఐదారు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో తెలంగాణ (Telangana) ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరోవైపు ప్రాజెక్టులలోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. నిన్నటితో పోల్చితే నేడు కృష్ణా ప్రాజెక్టు (Krishna River Projects)ల్లోకి ప్రవాహం కాస్త తగ్గినట్లు సమాచారం. ఎగువ నుంచి 3.86 లక్షల క్యూసెక్కుల వరద నీరు జూరాల ప్రియదర్శిని డ్యామ్ (Jurala project)‌కు వచ్చి చేరుతోంది.

 

ప్రస్తుతం 36 గేట్ల వరకు ఎత్తివేసి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. దాదాపు 3.98 లక్షల క్యూసెక్కుల వరద నీటిని దిగువకు వదులుతున్నారు. జూరాల ప్రాజెక్టు నిల్వ సామర్థ్యం పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరుకుంది. దీని పూర్తిస్థాయి నీటి మట్టం 318.51 మీటర్లు కాగా, వరద నీరు భారీగా వచ్చి చేరడంతో ప్రస్తుతం 315 మీటర్లకు చేరుకుందని అధికారులు తెలిపారు.

 

మరోవైపు శ్రీశైలం (Srisailam project)లో పూర్తిస్థాయి నీటిమట్టం 884.40 అడుగులు కాగా, దాదాపుగా జలాశయం నిండుకుండలా ఉంది. శ్రీశైలం ప్రాజెక్టు సామర్థ్యం 215 టీఎంసీలు కాగా, ప్రస్తుతానికి 212 టీఎంసీల మేరకు నీరు చేరింది. బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడిన కారణంగా మరో రెండు, మూడు రోజులు వర్షాలు కురవనున్నాయి. దీంతో పూర్తిస్థాయికి నీరు వచ్చి చేరనుంది. ఎగువ నుంచి 4,31,115 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతుండటంతో 10 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు.

కాగా, నాగార్జునసాగర్ ప్రాజెక్టులో ప్రస్తుతం 309 టీఎంసీల నీరు ఉంది. అయితే దీని పూర్తిస్థాయి నిల్వ సామర్థ్యం 312 టీఎంసీలు. ప్రస్తుతానికి ఎగువ నుంచి వచ్చిన నీటిని వచ్చినట్లుగా కావాల్సినన్ని గేట్లు ఎత్తివేసి దిగువకు విడుదల చేస్తున్నారు. ఈ వరద నీటి కారణంగా ఈ దిగువ ప్రాంతాలతో పాటు హైదరాబాద్‌లో సైతం వర్షాలకు పలు ప్రాంతాలు జలాశయాలుగా మారిపోయాయి. 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

Read More