Home> తెలంగాణ
Advertisement

Heavy Rains: ప్రజలు, అధికారులు అప్రమత్తంగా ఉండాలి: సీఎం కేసీఆర్

తూర్పు బంగాళాఖాతాన్ని ఆనుకుని ఉత్తర అండమాన్‌ ప్రాంతంలో ఏర్పడిన అల్పపీడనం మరింత బలపడింది. ఈ క్రమంలో తెలంగాణ (Telangana) లో రాబోయే రెండు రోజులు.. సోమవారం, మంగళవారం భారీ నుంచి అతి భారీ వర్షాలు (Heavy rains) కురుస్తాయని వాతావరణ శాఖ (IMD) వెల్లడించింది. ఈ మేరకు అధికారులు మరింత అప్రమత్తంగా ఉండాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు.

Heavy Rains: ప్రజలు, అధికారులు అప్రమత్తంగా ఉండాలి: సీఎం కేసీఆర్

Heavy Rains officers should be vigilant CM KCR: హైదరాబాద్: తూర్పు బంగాళాఖాతాన్ని ఆనుకుని ఉత్తర అండమాన్‌ ప్రాంతంలో ఏర్పడిన అల్పపీడనం మరింత బలపడింది. ఈ క్రమంలో తెలంగాణ (Telangana) లో రాబోయే రెండు రోజులు.. సోమవారం, మంగళవారం భారీ నుంచి అతి భారీ వర్షాలు (Heavy rains) కురుస్తాయని వాతావరణ శాఖ (IMD) వెల్లడించింది. ఇప్పటికే రెండు రోజుల నుంచి అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలో తెలంగాణ ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావు ( K. Chandrashekar Rao ) వర్షాల పరిస్థితిపై సమీక్షించారు. రాబోయే రెండురోజులపాటు రాష్ట్ర వ్యాప్తంగా భారీ నుండి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని ప్రజలు, అధికారులు అప్రమత్తంగా ఉండాలని సీఎం కేసీఆర్ సూచించారు. ఈ మేరకు జిల్లా అధికార యంత్రాలను మరింత అప్రమత్తం చేయాలని సీఎం కేసీఆర్ (KCR) చీఫ్ సెక్రటరీ సోమేష్ కుమార్‌ను ఆదేశించారు. కలెక్టర్లు, ఎస్పీలు, పోలీస్ కమిషనర్లతో ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తూ అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ మేరకు ఆదివారం తెలంగాణ సీఎంవో (Telangana CMO) ప్రకటనను విడుదల చేసింది. Also read: Heavy rains: బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఇరు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన

ఇంకా కేసీఆర్ మాట్లాడుతూ.. రాష్ట్రంలోని అధికారులంతా ఎక్కడివారు అక్కడే ఉండి పరిస్థితిని గమనిస్తూ అవసరమైన సహాయ చర్యలు చేపట్టాలని ఆదేశించారు. భారీ వర్షాల వల్ల వరదలు కూడా వచ్చే అవకాశం ఉందని ప్రజలు కూడా మరింత జాగ్రత్తగా ఉండాలని సీఎం కోరారు. Also read: Amitabh Bachchan: 78వ వసంతంలోకి అడుగుపెట్టిన బాలీవుడ్ షెహన్‌షా

ఇల్లు కూలి.. ఇద్దరు మృతి
ఇదిలాఉంటే.. భారీ వర్షాలతో హైదరాబాద్ అతలాకుతలమవుతోంది. శుక్రవారం, శనివారం కురిసిన వార్షాలతో హైదరాబాద్‌లో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. ఈ క్రమంలోనే ఆదివారం పాతబస్తీలో రేకుల ఇల్లు కూలి ఇద్దరు మృతి చెందగా.. ఏడుగురికి తీవ్రగాయాలు అయ్యాయి. వెంటనే వారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఘటనా స్థలానికి చేరుకున్న ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది, స్థానిక పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. 
Also read : China on coronavirus: కరోనావైరస్ పుట్టింది చైనాలో కాదు: చైనా

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

 

Read More