Home> తెలంగాణ
Advertisement

Harish Rao: టాప్ గేరులో ట్రబుల్ షూటర్.. తెర వెనక ఏం జరిగింది..?

  Harish Rao: మాజీమంత్రి హరీశ్ రావు బీఆర్‌ఎస్ పార్టీకి  పెద్ద దిక్కులా మారారా..! కేటీఆర్‌ అమెరికా టూర్‌ను వాడుకుని పార్టీ వ్యవహారాల్లో అన్ని తానై నడిస్తున్నారా..! అటు గులాబీ బాస్‌ ఫామ్‌హౌస్‌కే పరిమితం కావడం హరీశ్‌ రావు అడ్వాంటేజ్‌గా మారిందా. కౌశిక్‌ రెడ్డి ఏపిసోడ్‌తో హరీశ్‌ రావుకు మంచి మైలేజ్‌ వచ్చిందా..! హరీశ్‌ రావు పనితీరుపై పార్టీలో ఎలాంటి చర్చ జరుగుతోంది.

Harish Rao: టాప్ గేరులో ట్రబుల్ షూటర్.. తెర వెనక ఏం జరిగింది..?

Harish Rao: జాతీయ పార్టీ నుంచి ప్రాంతీయ పార్టీల వరకు అన్ని పార్టీల్లో తల్లో నాలుకలుగా వ్యవహరించే లీడర్స్ కొంత మంది ఉంటారు. వీరే పార్టీకి అత్యవసర సమయాల్లో సలహాలు, సూచనలు ఇస్తూ పార్టీకి దిశా నిర్దేశం చేస్తూ ట్రబుల్ షూటర్స్ గా నిలుస్తుంటారు. అలాంటి నేతల్లో హరీష్ రావు ఒకరు. బీఆర్ఎస్ పార్టీకి ఆయన అసలు సిసలు ట్రబుల్ షూటర్ అని చెప్పాలి. బీఆర్ఎస్ అలియాస్ టీఆర్ఎస్ కు ముందు నుంచి ట్రబుల్ షూటర్ గా పార్టీ వ్యవహారాలను ఈయనే చక్కబెడుతున్నారు.  ముఖ్యంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్‌ రెడ్డి అరెస్టు విషయంలో క్యాడర్‌ను ముందుండి నడిపించారు. పార్టీ డీలా పడిన ప్రతి సందర్భంలోనూ హరీశ్‌ రావు పాత్ర పార్టీకి చాలా అవసరం అవసరమో మరోసారి కౌశిక్ రెడ్డి విషయంలో ప్రూవ్ అయింది. అందుకే ఆయన్ను పార్టీలో ట్రబుల్‌ షూటర్‌గా అభివర్ణిస్తున్నారు. తాజాగా కౌశిక్‌ రెడ్డి ఎపిసోడ్‌లో హరీశ్‌ రావు 100 శాతం మార్కులు పడ్డాయి. కేటీఆర్‌ అమెరికా టూర్‌ హరీశ్‌ రావుకు బాగా కలిసొచ్చిందని సొంత పార్టీలోనే చర్చ జరుగుతోందట. అటు అధినేత కేసీఆర్‌ కూడా ఫామ్‌హౌస్‌కే పరిమితం కావడంతో పార్టీకి హరీశే పెద్ద దిక్కులా మారిపోయారని క్యాడర్‌ అంతా భావిస్తోందట..

తాజాగా పాడి కౌశిక్‌ రెడ్డి, అరికెపూడి గాంధీ వ్యవహారం తెలంగాణ పాలిటిక్స్‌ను షేక్ చేస్తోంది. పాడి కౌశిక్‌ రెడ్డిపై అరికెపూడి గాంధీ అనుచరులు దాడి చేయడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. అయితే అరికెపూడి గాంధీ అరెస్ట్ తో టాపిక్‌ క్లోజ్ అయ్యిందని అంతా భావించారు. కానీ కౌశిక్ రెడ్డి దూకుడుకు, హ‌రీష్ రావు తోడయ్యారు. హుటాహుటిన సిద్దిపేట నుంచి హైదరాబాద్‌కు వచ్చేశారు. ఫోన్ల ద్వారానే నేతలందరిని పోగుచేశారు. తాను వ‌చ్చే స‌రికి గ్రేటర్‌ ఎమ్మెల్యేలంతా వ‌చ్చేలా కోఆర్డినేట్ చేసేశారు. అయితే హరీశ్‌ రావు రాకతో పాడికి కొండంత బలం దొరికనట్టయింది. హరీశ్‌ రావు వెంట బీఆర్‌ ఎస్‌ క్యాడర్‌ అంతా కదిలి రావడం పార్టీకి కొత్త జోష్ తీసుకువచ్చింది. హరీశ్‌ రావు ఒక్క పిలుపుతో దాదాపు 10 వేల మంది కార్యకర్తలు పోగయినట్టు సమాచారం.. ఆ తర్వాత వారంతా కలిసి కమిషనర్ వద్దకు వెళ్లడం.. అనంతరం హరీశ్‌ రావు ను అరెస్టు చేయడం చకచక జరిగిపోయాయి కానీ ఈ ఘటనతో పార్టీలో హరీశ్‌రావుకు ఎంత పలుకుబడి ఉందో నేతలకు అర్థమయిపోయింది..

ఇక రాష్ట్రంలో బీఆర్‌ఎస్‌ పార్టీ అధికారం కోల్పోయాక కేసీఆర్‌ సైలెంట్‌ అయ్యారు. కేవలం ఆయన ఫామ్‌హౌస్‌కే పరిమితం అయ్యారు. రాష్ట్రాన్ని వరదలు ముంచెత్తినా, కవిత జైలు నుంచి విడుదల బయటకు వచ్చినా కేసీఆర్‌ మాత్రం ఫామ్‌హౌస్ దాటి బయటకు రాలేదు.. ఇటీవల తన ఫామ్‌హౌస్‌లోనే నవగ్రహ చండీయాగం సైతం నిర్వహించారు.. అయితే కేసీఆర్‌ సైలెంట్‌ గా ఉన్న సమయంలో పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ హోదాలో కేటీఆర్‌ అన్ని తానై నడిపిస్తున్నారు. ఇత‌ర‌త్రా ఏం ఉన్నా హ‌రీష్ రావుతో పాటు పార్టీ మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డిని తెర‌పైకి తెస్తున్నారు. కానీ, కేటీఆర్ అమెరికాలో ఉన్న స‌మ‌యంలో అందివ‌చ్చిన అవ‌కాశాన్ని హ‌రీష్ రావు ప‌క్కగా వాడుకున్నారు. తనను అరెస్ట్ చేసి పోలీస్ స్టేష‌న్ కు త‌ర‌లించ‌టం, భుజం గాయం, అక్కడ బీఆర్ఎస్ కార్యక‌ర్తల‌తో హ‌డావిడి చేయడం అయనకు కలిసొచ్చే అవకాశాలున్నాయి. కేసీఆర్ సైలెంట్‌గా ఉండటం, కేటీఆర్ లేని స‌మ‌యంలో ఉన్న గ్యాప్ ను హ‌రీష్ రావు బాగా వినియోగించుకున్నారని పొలిటికల్‌ సర్కిల్స్‌లో జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇక ట్రబుల్ షూట‌ర్ గా ఎంత పేరున్న అధికారంలో ఉన్న స‌మ‌యంలో హ‌రీష్ రావుకు పూర్తిస్థాయి ఎలివేష‌న్ రాలేదు. మొన్న వ‌ర‌ద‌ల స‌మ‌యంలో హ‌రీష్ రావు ఒక్కరే ఖ‌మ్మం ప‌ర్యట‌న చేసి ప్రజలను ఓదార్చారు. కానీ ఇప్పుడు మాత్రం ఉద్యమ పార్టీకి పాత రోజుల‌ను హరీశ్‌ రావు గుర్తు చేశారు. గతంలో పార్టీలో త‌న రోల్ ను ఎలాగైతే పోషించారో ఇప్పుడు అందివచ్చిన అవకాశాన్ని మరోసారి చక్కగా వినియోగించుకున్నారని సొంత పార్టీలోనే గుసగుసలు వినిపిస్తున్నాయి.

ఇదీ చదవండి: ‘భోళా శంకర్’సహా చిరు కెరీర్ లో రాడ్ రంబోలా మూవీస్ ఇవే..

ఇదీ చదవండి:  పవన్ కళ్యాణ్ మూడో భార్య అన్నా లెజ్నెవా ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ తెలుసా..!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Read More