Home> తెలంగాణ
Advertisement

Railway: తిరుమల భక్తులకు గుడ్‌న్యూస్..సికింద్రాబాద్‌ నుంచి మరిన్ని ప్రత్యేక రైళ్లు..!

Railway: దేశంలో సాధారణ పరిస్థితులు కనిపిస్తుండటంతో రైళ్ల సంఖ్యను రైల్వే శాఖ పెంచుతోంది. తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది.

Railway: తిరుమల భక్తులకు గుడ్‌న్యూస్..సికింద్రాబాద్‌ నుంచి మరిన్ని ప్రత్యేక రైళ్లు..!

Railway: తిరుమల శ్రీవారి భక్తులకు రైల్వే శాఖ శుభవార్త చెప్పింది. సికింద్రాబాద్-తిరుపతి మార్గంలో ప్రత్యేక రైళ్లను నడపనుంది. ఈమేరకు అధికారికంగా ప్రకటించింది. ప్రత్యేక రైళ్లు ఈనెల 21, 28, 22, 29 తేదీల్లో పరుగులు పెట్టనున్నాయి. దక్షిణ మధ్య రైల్వే ఓ ప్రకటనలో తెలిపింది. 07481నెంబర్ గల రైలు తిరుపతిలో రాత్రి 9.10 గంటలకు బయలుదేరుతుంది. మరుసటి రోజు ఉదయం 9.30 గంటలకు సికింద్రాబాద్‌కు రానుంది.

మరోవైపు ఈనెల 22, 29 తేదీల్లో సికింద్రాబాద్-తిరుపతి మధ్య రెండు రైళ్లు నడవనున్నాయి. 07482 నెంబర్ గల రైలు సాయంత్రం 4.15 గంటలకు సికింద్రాబాద్‌ నుంచి వెళ్లనుంది. మరుసటి రోజు ఉదయం 5.20 గంటలకు తిరుపతికి చేరుకుంటుంది. ప్రత్యేక రైళ్లు రేణిగుంట, కడప, ఎర్రగుంట, తాడిపత్రి, గుంతకల్లు, మంత్రాలయం, రాయచూర్, తాండూరు, వికారాబాద్, లింగంపల్లి, బేగంపేట స్టేషన్లలో ఆగనుందని రైల్వే శాఖ తెలిపింది.

ఇటు సికింద్రాబాద్‌ నుంచి రాకపోకలు సాగించే పలు ప్రత్యేక రైళ్లను పొడిగిస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. సికింద్రాబాద్-మధురై మధ్య ప్రతి మంగళవారం నడిచే రైలు ఈనెల 29 నుంచి వచ్చే నెల 26 వరకు తిరగనుంది. మధురై-సికింద్రాబాద్ రైలును వచ్చే నెల 28 వరకు పొడిగించారు. సికింద్రాబాద్-జైపూర్ మధ్య నడిచే ట్రైన్‌ను సెప్టెంబర్‌ 30 వరకు పొడిగించినట్లు తెలిపారు. జైపూర్-సికింద్రాబాద్ మధ్య రైలును అక్టోబర్ 2 వరకు పొడిగించారు. ఈమేరకు దక్షిణ మధ్య రైల్వే అధికారిక ప్రకటనను వెలువరించింది.

Also read:Rahul Gandhi: కాంగ్రెస్‌లో కథ మొదటికి..తదుపరి అధ్యక్షుడు ఎవరన్న దానిపై ఉత్కంఠ..!

Also read:Pawan Kalyan: పద్యం పుట్టిన నేలలో మద్యం ప్రవహిస్తోంది..వైసీపీపై పవన్ కళ్యాణ్ ఫైర్..!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Read More